
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వీధి కుక్కలు మళ్లీ రెచ్చిపోయాయి. ఎనిమిది నెలల బాలుడ్ని పొట్టన పెట్టుకున్నాయి. ఈ సంఘటన కిషన్ బాగ్‌లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. కిషన్ బాగ్ అసద్ బాబానగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల అయాన్ స్నేహితులతో కలిసి వీధిలో ఆడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒకేసారి నాలుగైదు కుక్కలు వీధిలో ఆడుకుంటున్న పిల్లలపై దాడి చేశాయి. అందరూ పారిపోగా అయాన్ ఒక్కడు మిగిలాడు. అవి బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి.
కొన ఊపిరితో ఉన్న అయాన్‌ను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీధి కుక్కల స్వైర విహారంతో నగరంలో కలకలం రేగింది. ఈ ఘటనపై బల్దియా ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆ ప్రాంతంలోని వీధి కుక్కల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులను ఆదేశించారు. కిషన్ బాగ్.. అసద్ బాబానగర్ ప్రాంతాల్లో రెండు వాహనాలు.. వాటితో పాటు 16 మంది డాగ్ క్యాచర్లతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకుంటున్నారు.
( టీకా వేసుకున్న అంగన్‌వాడీ ఆయా మృతి)
Comments
Please login to add a commentAdd a comment