![Telangana Govt Serious Focus On Stray Dogs Menace](/styles/webp/s3/article_images/2024/07/22/revanth_5.jpg.webp?itok=7pVWnhDA)
సచివాలయంలో జంతు పరిరక్షణ సంస్థలతో చర్చ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు కాటు వేయడంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జీహెచ్‌ఎంసీకి పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో కుక్కల సమస్యపై హైకోర్టు సూచనల మేరకు సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.
వివిధ జంతు పరిరక్షణ సంఘాలతో సమావేశమై, వీధి కుక్కల బెడద తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని యానిమల్ బర్త్ కంట్రోల్ ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ కమిటీని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ కె.సతీశ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లగాన్ మోహన్‌రెడ్డి, యానిమల్ వెల్‌ఫేర్ సంస్థల తరఫున అమల అక్కినేని, వాసంతి వడి, న్యాయవాదులు శ్రేయ పరోపకారి, వేణు మాధవ్, ఐపీఎం రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సంపత్, ఆరోగ్య శాఖ అధికారులు హాజరు కానున్నారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment