దత్తత తీసుకున్న విదేశీ మహిళతో..
నోయిడా : ఆ వీధి కుక్కల దశ తిరిగింది. ఒకప్పుడు తిండి దొరక్క దుర్భర జీవితాన్ని గడిపి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆ కుక్కలు ఇప్పుడు ఖరీదైన ఆహారం తింటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ‘‘కన్నన్ ఎనిమల్ వెల్ఫేర్’’ అనే స్వచ్ఛంద సంస్థ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వీధి కుక్కలను చేరదీస్తోంది. వాటి ఆరోగ్యం మెరుగు పరిచి శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది. అందులో భాగంగా కుక్కలను పెంచుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపే విదేశీయులకు వాటిని దత్తత ఇస్తున్నారు. వీరు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా దాదాపు 90కుక్కలను విదేశాలకు పంపారు. వీధి కుక్కలను పెంచుకుంటున్న విదేశీయులు సైతం వాటి ప్రవర్తన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment