ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతుంది. హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ యుద్ధంతో ఏడాదికాలంగా నలుగుతున్న గాజాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో పాలస్తీనియన్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి.
అయితే తాజాగా గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మృతదేహాలను వీధికుక్కలు పిక్కుతుంటున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ఆకలితో ఉన్న వీధికుక్కలు ఈ మృతదేహాలను తింటున్నాయని, దీని ద్వారా మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారుతోందని గాజాలోని ఉత్తర భాగంలో అత్యవసర సేవల అధిపతి ఫేర్స్ అఫానా వెల్లడించారు.
ఉత్తర గాజా, జబాలియా ప్రాంతంలో హమాస్ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుగుపతున్న వైమానిక, భూతల దాడులను ప్రస్తావిస్తూ. ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనియన్ల జీవితాలను సూచించే ప్రతిదాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారుతోందని, తమ పనులు సవ్యంగా చేయలేకపోతున్నామని తెలిపారు. ఉత్తర గాజాలో జరుగుతున్నది నిజమైన మారణహోమమని ఆయన అన్నారు.
కాగా గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ మెరుపు దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. Oఇజ్రాయెల్‌లోకి చొచ్చుకుపోయిన హమాస్ ఉగ్రవాదులు అక్కడ 1200 మందిని బలితీసుకున్నారు. ఈ ఘటన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైనిక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా స్ట్రిప్‌లో ఇప్పటి వరకు 42,409 మంది మరణించారు. వీరిలో అత్యధికంగా పౌరులే ఉన్నారు. మరో 99,153 మంది గాయపడ్డారు.
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో 65 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ ఏజెన్సీ నిర్వహిస్తున్న గిడ్డంగి సహాయ కేంద్రంలో ఆహారం కోసం వెతుకుతున్న ఆకలితో ఉన్న నివాసితులపై సోమవారం ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment