50 వీధి కుక్కల సజీవ దహనం | 50 stray dogs burnt alive in Chennai | Sakshi
Sakshi News home page

50 వీధి కుక్కల సజీవ దహనం

Published Wed, Jun 15 2016 3:34 PM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM

50 వీధి కుక్కల సజీవ దహనం - Sakshi

50 వీధి కుక్కల సజీవ దహనం

చెన్సై: దాదాపు 50కి పైగా వీధికుక్కలను సజీవదహనం చేసిన దారుణ ఘటన నగరానికి చేరువలోని కీజమూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కుక్కలు... గొర్రెలు, మేకల మందలపై దాడిచేయడంతో వాటిలో కొన్ని చనిపోయాయి. దీంతో కోపోద్రిక్తులైన గ్రామానికి చెందిన కొంతమంది ఆహారంలో పురుగుల మందు కలిపి కుక్కలకు పెట్టారు. తర్వాత వాటిపై కిరోసిన్ చల్లి తగలబెట్టారు.

జంతు ప్రేమికుడు పీ అస్వాత్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న ఆయన చనిపోయిన కుక్కలకు పూర్తి దహన సంస్కారాలను నిర్వహించారు. మెల్ మరువతూర్ పోలీసు స్టేషన్ లో దీనిపై ఫిర్యాదుచేశారు. గ్రామంలో గొర్రెలు, మేకలకు గాయాలైనట్లు ఏమీ కనిపించలేదని, గ్రామస్థుల్లో కొంతమంది కుక్కలను కావాలనే హతమార్చారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మురళీ, ముత్తు, మురుగదాస్, జీవాలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement