రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం రాజంపేటలో దారుణం జరిగింది. ఓ మూడేళ్ల బాలికపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ సంఘటనలో బాలిక ముక్కులోని ఓ భాగం పూర్తిగా ఊడిపోయింది. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు దాడి చేసినట్లు బాలిక తండ్రి గంగరాజు తెలిపారు.
గతంలో కుక్కల బెడదపై పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చిన్నారికి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.