వీధి కుక్కల స్వైర విహారంతో 26 జీవాలు ప్రాణాలు కోల్పోయాయి.
అచ్చంపేట రూరల్ (మహబూబ్‌నగర్ జిల్లా) : వీధి కుక్కల స్వైర విహారంతో 26 జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 26 గొర్రెలు మృతిచెందాయి. దీంతో యజమాని లబోదిబోమంటున్నాడు.