
బాలిక కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో కిడ్నాప్ చేసిన వ్యక్తితో పాటు సహకరించిన మరోవ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి
కంచికచర్ల : మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కేసులో కిడ్నాప్ చేసిన వ్యక్తితో పాటు సహకరించిన మరోవ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి నందిగామ కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ కె.ఈశ్వరరావు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు మండలంలోని గనిఆత్కూరుకు చెందిన 15ఏళ్ల మైనర్‌బాలికను అదే గ్రామానికి చెందిన షేక్ కరీముల్లా ఈ నెల 8న కిడ్నాప్ చేశాడని బాలిక కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అప్పటి నుంచి అతనికోసం వెతుకుతున్నామని, శుక్రవారం కరీముల్లాతో పాటు అతనికి సహకరించిన చందర్లపాడు మండలం చింతలపాడుకు చెందిన షేక్ బాషాలు గనిఆత్కూరు రోడ్డులో సంచరిస్తుండగా పట్టుకున్నామని అరెస్టు చేసి నందిగామ కోర్టుకు పంపామని ఎస్‌ఐ తెలిపారు.