విద్యార్థుల కిడ్నాప్‌నకు టీచర్ యత్నం | teacher trying to kidnap to students | Sakshi
Sakshi News home page

విద్యార్థుల కిడ్నాప్‌నకు టీచర్ యత్నం

Published Tue, Feb 23 2016 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

విద్యార్థుల కిడ్నాప్‌నకు టీచర్ యత్నం

విద్యార్థుల కిడ్నాప్‌నకు టీచర్ యత్నం

అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ నలుగురు విద్యార్థినుల కిడ్నాప్‌కు యత్నించాడు.   పోలీ సుల కథనం ప్రకారం.. అచ్చంపేటలో ఎంఎస్‌ఎన్ స్కూల్‌కు చెందిన టీచర్ జీవన్ అలియాస్ బాలకుమార్ స్కూల్లోనే ట్యూషన్ ఉందని నాలుగో తరగతికి చెందిన నలుగురు అమ్మాయిలను ఆదివారం సాయంత్రం వారి ఇళ్ల వద్ద నుంచి కారులో ఎక్కించుకుని వెళ్లాడు. అయితే, పాఠశాలకు వెళ్లకుండా దారి మారడంతో గమనించిన ఓ విద్యార్థిని తన తల్లికి సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులతో కలసి గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని జేఎంజే పాఠశాల పక్కన గెస్టుహౌస్ వద్ద కారు కనిపించింది. అక్కడ సదరు ఉపాధ్యాయుడు, నలుగురు విద్యార్థినులు ఉన్నారు. కారులో బిర్యానీ ప్యాకెట్లు, ప్యాక్ ముక్కలు, కురుకురేలు, ల్యాప్‌టాప్, యేసుక్రీస్తు బొమ్మలు లభ్యమయ్యాయి. వెంటనే అతనిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మతమార్పిడికి వచ్చినట్లు అతని మాటలబట్టి తెలిసిందని ఎస్‌ఐ అనుదీప్ విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement