Four students
-
సూర్య వ్యాఖ్యలపై కలకలం
చెన్నై: తమిళనాడులో నీట్ పరీక్షకు ముందు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తమిళ హీరో సూర్య వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు జడ్జి సుబ్రమణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. అయితే, సూర్య తమిళంలో ఇచ్చిన స్టేట్మెంట్ను ఆంగ్లంలో అన్వయించుకోవడంలో జరిగిన పొరపాటు వల్లనే జస్టిస్ సుబ్రమణ్యం తీవ్రంగా స్పందించారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత విషాదమని, ఇది తన మనసుని ఎంతగానో కలచివేసిందని సూర్య ట్విట్టర్లో స్పందించారు. కరోనా నేపథ్యంలో ప్రాణభయంతో న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలిస్తున్నారని, అయితే విద్యార్థులను మాత్రం నిర్భీతిగా వెళ్ళి పరీక్షలు రాయమని ఆదేశించడంలో నైతికత లేదని సూర్య ట్వీట్ చేసినట్లు జస్టిస్ సుబ్రమణ్యం తన లేఖలో పేర్కొన్నారు. అయితే సూర్య చేసిన ట్వీట్లో ‘‘అలాంటప్పుడు, నైతికత లేదు’’ అనే పదాలు లేవని, జడ్జి అన్వయం చేసుకోవడంలో పొరపాటుపడి ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు సూర్యపై ఎటువంటి చర్యలు చేపట్టొద్దని, ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు సాయపడ్డారని, ఒక దుర్ఘటనపై కళాకారుడి స్పందనను తీవ్రమైనదిగా పరిగణించరాదని ఆరుగురు మాజీ జడ్జీలు, కొందరు ప్రముఖ న్యాయవాదులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. -
పండుగ పూట విషాదం
సంగెం/భూపాలపల్లి అర్బన్/మల్హర్: హోలీ వేడుకలు ముగించుకుని స్నానాలకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చెరువులో మునిగి మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసు కున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా కాపులకనిపర్తికి చెందిన కందికట్ల యశ్వంత్ (13) బర్ల రాజ్‌కుమార్ (13), సదిరం రాకేష్ (12), దౌడు రాకేష్ (9) స్నే హితులతో కలసి హోలీ ఆడారు. అనంతరం పాయచెరువులో స్నానానికి దిగా రు. యశ్వంత్, దౌడు రాకేష్ మొరం కోసం తీసిన గోతిలో పడి చనిపోయారు. వారి వెనుక వెళ్లిన సదిరం రాకేష్ తృటిలో బయటపడ్డాడు. అలాగే.. భూపాలపల్లి జవహర్‌నగర్ కాలనీ చెందిన మాచర్ల కల్యాణ్S(16) మల్హర్ మండలం తాడ్వాయి గ్రామ సమీప చెరువుకు వెళ్లాడు. అందులో స్నానం చేసేందుకు దిగి.. ఈత రాకపోవడంతో నీట మునిగాడు. గమనించిన స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. హసన్‌పర్తి మండలం నిరూప్‌నగర్ తండాకు చెందిన భూక్య తిరుపతి (16) గ్రామంలోని దామోదర చెరువులోకి ఈతకు వెళ్లి.. లోతైన గుంతలో పడి నీట మునిగి చనిపోయాడు. -
మరో నలుగురు బయటకు
మే సాయ్: థాయ్‌లాండ్‌లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్నవారిలో మరో నలుగురు విద్యార్థుల్ని సహాయక బృందాలు సోమవారం రక్షించాయి. ఆదివారం నలుగురు విద్యార్థుల్ని కాపాడిన 10 గంటల తర్వాత మిగిలినవారిని బయటకు తీసుకొచ్చేందుకు సోమవారం సహాయక చర్యల్ని ప్రారంభించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ సాగిన ఈ ఆపరేషన్‌లో మరో నలుగురు విద్యార్థుల్ని డైవర్లు గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరందరిని థాయ్ రాయల్ పోలీస్ హెలికాప్టర్ ద్వారా 56 కి.మీ దూరంలో ఉన్న చియాంగ్‌రాయ్ ప్రచనుక్రోహ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ ఘటనలో ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థుల సంఖ్య 8కి చేరుకుంది. ప్రస్తుతం సహాయక కోచ్ ఎకపాల్(25)తో పాటు నలుగురు విద్యార్థులు ఇంకా గుహలోనే ఉన్నారు. జూన్ 23న తామ్ లూవాంగ్ గుహలోకి వెళ్లి చిక్కుకున్న 12 మంది విద్యార్థులతో పాటు కోచ్‌ను రక్షించేందుకు థాయ్‌లాండ్ అధికారులు ఆదివారం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం చీకటిపడటంతో ఆపరేషన్‌ను నిలిపివేసిన అధికారులు.. మంగళవారం సహాయక చర్యల్ని పునరుద్ధరించనున్నారు. వాతావరణం అనుకూలం.. ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న చియాంగ్ రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్ సక్ మీడియాతో మాట్లాడుతూ.. తొలిరోజు లాగే సోమవారం కూడా సహాయక చర్యలకు వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. గుహలోని పరిస్థితులపై అవగాహన ఉండటంతో ఆదివారం సహాయక చర్యల్లో పాల్గొన్న డైవింగ్ నిపుణుల్నే సోమవారం రంగంలోకి దించామన్నారు. ఆపరేషన్‌కు ముందు గుహలోని మార్గంలో ఆక్సిజన్ సిలిండర్లను చేరవేశామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తొలి బాలుడ్ని తీసుకురాగలమని అంచనా వేసినప్పటికీ.. సాయంత్రం 5.40 గంటలకే బయటకు తీసుకొచ్చామని నరోంగ్‌సక్ తెలిపారు.మిగిలిన ముగ్గురిని కూడా దాదాపు 3 గంటల వ్యవధిలోనే బయటకు తీసుకొచ్చామన్నారు. శారీరకంగా దృఢంగా ఉన్న విద్యార్థులనే తొలుత బయటకు తెచ్చేందుకు ప్రాధాన్యమిచ్చామని అన్నారు. వీరిని స్ట్రెచర్ల సాయంతో హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించామన్నారు. విద్యార్థులతో పాటు కోచ్‌ను కాపాడేందుకు 50 మంది థాయ్‌లాండ్ డైవర్లు, 40 మంది అంతర్జాతీయ డైవింగ్ నిపుణులు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ.. ఎగువ ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు గుహలో నీటి ప్రవాహం పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తామ్ లువాంగ్ గుహలోని నీటిని భారీ మోటార్ల సాయంతో తోడేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుకున్నదాని కంటే తొందరగానే విద్యార్థుల్ని గుహ నుంచి బయటకు తీసుకొస్తున్నామని నరోంగ్‌సక్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఆపరేషన్ ముగిసే అవకాశముందన్నారు. కాగా, సోమవారం గుహ నుంచి బయటకొచ్చిన నలుగురు విద్యార్థుల వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. విద్యార్థులంతా క్షేమమే కానీ.. చియాంగ్ రాయ్ ఆస్పత్రి ప్రస్తుతం చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సీనియర్ వైద్యుడొకరు తెలిపారు. తమకు ఆహారం అందించాల్సిందిగా విద్యార్థులు కోరారన్నారు. అయితే వీరికి ఇన్ఫె క్షన్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో ప్రస్తు తం వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. ఇలా గుహల్లో చిక్కుకున్న సందర్భాల్లో వ్యక్తులకు హైపోథెర్మియా(శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడం), పక్షులు, గబ్బిలాల విసర్జితాల కారణంగా శ్వాససంబంధ వ్యాధు లు వచ్చే అవకాశముందన్నారు. విద్యార్థులను 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్నాక తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. అరుదైన ఆహ్వానం తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్న వైల్డ్ బోర్స్ జట్టుకు అరుదైన ఆహ్వా నం లభించింది. నిర్ణీత సమయంలోగా అందరూ బయటకు రాగలిగితే రష్యా రాజధాని మాస్కోలో ఆదివారం జరిగే సాకర్ ప్రపంచకప్ ఫైనల్‌కు రావాలని ఈ జట్టు సభ్యుల్ని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాన్టీనో ఆహ్వానించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న తమ విద్యార్థులు తిరిగివచ్చాక వారికోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని మే సాయ్ ప్రసిత్సర్త్ పాఠశాల యాజమాన్యం తెలిపింది. -
నలుగురు విద్యార్థులను కాపాడి.. ప్రధానోపాధ్యాయురాలు మృతి
స్వాతంత్య్ర దిన వేడుకల ఏర్పాట్లలో ప్రమాదం * జెండాగా అమర్చే ఇనుప పైపును సిద్ధం చేసిన ప్రధానోపాధ్యాయురాలు * గద్దెపై అమర్చి, తీస్తుండగా విద్యుత్ తీగలకు తగిలిన పైపు * నలుగురు విద్యార్థులకు విద్యుత్ షాక్.. * ప్రాణాలకు తెగించి వారిని తోసేసిన హెచ్ఎం * విద్యుత్ షాక్ తగలడంతో కన్నుమూత పూడూరు: అదో ప్రాథమిక పాఠశాల.. తెల్లవారితే స్వాతంత్య్ర దినోత్సవం.. ముందుగా ఏర్పాట్లు చేసుకునేందుకు ఆదివారమే ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చారు.. కొందరు విద్యార్థుల సహాయంతో జెండా గద్దెను శుభ్రం చేశారు. జెండాగా అమర్చే ఇనుపపైపును సిద్ధం చేశారు.. ఓసారి పరిశీలిద్దామని జెండా గద్దెలో పైపును అమర్చారు.. తిరిగి తీస్తుండగా పాఠశాల పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలకు తాకింది.. దీంతో పైపును పట్టుకున్న విద్యార్థులంతా విద్యుత్ షాక్ తగిలి అల్లాడిపోయారు.. అది చూసిన హెచ్ఎం ప్రాణాలకు తెగించి విద్యార్థులను పక్కకు తోసేశారు.. కానీ దురదృష్టవశాత్తు ఆమె విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్‌కు చెందిన ప్రభావతి (40) మేడికొండ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల కోసం ఏర్పాట్లు చేసేందుకు ఆమె ఆదివారం పాఠశాలకు వచ్చారు. విద్యార్థుల సాయంతో జెండా గద్దెను సిద్ధం చేశా రు. దానిపై ఇనుప పైపును అమర్చి జెండా ఎగుర వేసేందుకు రిహార్సల్ నిర్వహించారు. పైపును తొలగిస్తుండగా పాఠశాల పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆ పైపును పట్టుకున్న మూడో తరగతి విద్యార్థులు కీర్తన (8), గణేశ్ (8), మధుమతి (8), ఒకటో తరగతి విద్యార్థి శివతేజ (6)లు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే ప్రభావతి విద్యార్థులను పక్కకు తోసేసింది. కానీ ఆమెకు పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. విద్యార్థులకు గాయాలయ్యా యి. స్థానికులు వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రభావతి మార్గమధ్యలోనే మరణించారు. విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. కాగా ప్రభావతికి భర్త రాజీవ్‌రెడ్డి, కుమార్తెలు సుభిక్ష (14), నాగహర్షిత (13) ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, ఎంఈవో కిషన్ తదితరులు ఆస్పత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభావతి కుటుంబానికి ట్రాన్స్‌కో నుంచి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి. -
విద్యార్థుల కిడ్నాప్‌నకు టీచర్ యత్నం
అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ నలుగురు విద్యార్థినుల కిడ్నాప్‌కు యత్నించాడు. పోలీ సుల కథనం ప్రకారం.. అచ్చంపేటలో ఎంఎస్ఎన్ స్కూల్‌కు చెందిన టీచర్ జీవన్ అలియాస్ బాలకుమార్ స్కూల్లోనే ట్యూషన్ ఉందని నాలుగో తరగతికి చెందిన నలుగురు అమ్మాయిలను ఆదివారం సాయంత్రం వారి ఇళ్ల వద్ద నుంచి కారులో ఎక్కించుకుని వెళ్లాడు. అయితే, పాఠశాలకు వెళ్లకుండా దారి మారడంతో గమనించిన ఓ విద్యార్థిని తన తల్లికి సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులతో కలసి గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని జేఎంజే పాఠశాల పక్కన గెస్టుహౌస్ వద్ద కారు కనిపించింది. అక్కడ సదరు ఉపాధ్యాయుడు, నలుగురు విద్యార్థినులు ఉన్నారు. కారులో బిర్యానీ ప్యాకెట్లు, ప్యాక్ ముక్కలు, కురుకురేలు, ల్యాప్‌టాప్, యేసుక్రీస్తు బొమ్మలు లభ్యమయ్యాయి. వెంటనే అతనిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మతమార్పిడికి వచ్చినట్లు అతని మాటలబట్టి తెలిసిందని ఎస్ఐ అనుదీప్ విలేకరులకు తెలిపారు. -
నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత
హైదరాబాద్: దళిత రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) దిగివచ్చింది. నలుగురు దళిత పీహెచ్డీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వేముల రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గురువారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్న విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌తోపాటు ఈ నలుగురు విద్యార్థులపై గతంలో హెచ్‌సీయూ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఏబీవీపీ విద్యార్థిపై దాడి చేశారనే ఆరోపణలతో ఐదుగురు విద్యార్థులపై హెచ్‌సీయూ గతంలో ఈ చర్య తీసుకుంది. ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఈ ఐదుగురు విద్యార్థులు గతకొన్ని రోజులుగా వర్సిటీ ప్రాంగణంలో నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా విద్యార్థులు భగ్గుమన్నారు. మిగతా నలుగురు విద్యార్థులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హెచ్‌సీయూ ఈ నిర్ణయం తీసుకుంది. -
ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకి అస్వస్థత
మంచిర్యాల: ఫుడ్ పాయిజన్‌తో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని కస్తూర్బా పాఠశాలలో గురువారం జరిగింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ పాఠశాలలో నాణ్యమైన భోజనం వడ్డించట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని వారు కోరారు. -
విషాదం మిగిల్చిన సరదా.. నీటమునిగి నలుగురు మృతి, మరొకరి గల్లంతు
గుర్ల/బాపట్ల, న్యూస్‌లైన్: విహారయాత్ర విషాదం మిగిల్చింది. విజయనగరం, గుంటూరు జిల్లాల్లో గురువారం నీట మునిగి నలుగురు విద్యార్థులు మరణించారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. విజయనగరం జిల్లా చింతలపేటకు చెందిన గీత (14), సుంకరి భవాని (13), తాళ్లపూడి మౌనిక (14)లతో సహా 40 మంది పిల్లలు పాఠశాలకు సెలవు కావడంతో సమీపంలోని మామిడితోటకు పిక్నిక్కు వెళ్లారు. బంతాట ఆడుతుండగా బంతి పక్కనే ఉన్న చంపావతి నదిలోకి వెళ్లింది. భవాని బ ంతి తీస్తూ ప్రమాదవశాత్తు నీళ్లలోకి పడిపోయింది. సహాయంగా వచ్చిన గీత, వీళ్లిద్దరి కోసం వచ్చిన మౌనిక కూడా నదిలో మునిగిపోయారు. గ్రామస్తులు వచ్చేసరికే ఆ ముగ్గురు బాలికలు మృతిచెందారు. మరో ఘటనలో గుంటూరు హిందూ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న 13 మంది విద్యార్థులు సూర్యలంకలో సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఎం.శ్రీనివాసరావు, ఎం.సురేంద్ర, వి.గౌతమ్, సురేష్, ఆర్వేటి మణికుమార్ (21) కొట్టుకుపోయారు. మణికుమార్ మృతదేహం తీరానికి కొట్టుకు రాగా, మిగిలిన వారిని మెరైన్ సిబ్బంది రక్షించారు. సురేష్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.