మంచిర్యాల: ఫుడ్ పాయిజన్తో నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని కస్తూర్బా పాఠశాలలో గురువారం జరిగింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ పాఠశాలలో నాణ్యమైన భోజనం వడ్డించట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని వారు కోరారు.