అప్పు తీసుకున్న వ్యక్తిని కాల్‌మనీ నిర్వాహకులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు..
అనంతపురం సెంట్రల్ : అప్పు తీసుకున్న వ్యక్తిని కాల్‌మనీ నిర్వాహకులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. గుత్తికి చెందిన రవీంద్ర బుక్కరాయసముద్రం మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి గంగాధర్‌కు రూ.10లక్షల వరకు అప్పు ఉన్నాడు. కొద్ది రోజులుగా రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి ఆచూకీ కనుగొన్న గంగాధర్, అతని బంధువులు రవీంద్రను గుత్తి నుంచి అనంతపురానికి ఓ వాహనంలో తీసుకువచ్చారు.
నగరంలో వడ్డీ వ్యాపారంతో పైకొచ్చినట్లు విమర్శలు ఎదుర్కొనే ఓ ప్రజాప్రతినిధి కుమారుడి వద్ద పంచాయితీ చేసేందుకు ప్రయత్నించారు. వివాదం పెద్దది కాకుండా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రూరల్ సీఐ కృష్ణమోహన్ మార్గం మధ్యలోనే వారితో చర్చించి సమస్యను సద్దుమణిగించారు. ఈ విషయంపై సీఐని వివరణ కోరగా.. అది కిడ్నాప్ కాదని, డబ్బు బాకీ ఉండడంతో పంచాయితీ కోసం అనంతపురం పిలుచుకొచ్చారని తెలిపారు. విషయం తెలియడంతో వారిని స్టేషన్‌కు పిలించినట్లు వివరించారు. న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించానన్నారు. న్యాయం జరగలేదని భావిస్తే గుత్తి పోలీస్‌స్టేషన్‌ను కానీ, కోర్టును కానీ ఆశ్రయించాలని సూచించినట్లు చెప్పారు.