వివాహితను కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు | woman kidnapped in krishnagiri district | Sakshi
Sakshi News home page

వివాహితను కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు

Published Thu, Apr 28 2016 9:03 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

వివాహితను కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు

వివాహితను కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు

కేకే.నగర్(తమిళనాడు): వివాహితను ప్రేమించిన పోలీసు అధికారి కుమారుడు ఆమెను కిడ్నాప్ చేసిన సంఘటన కృష్ణగిరి జిల్లాలో సంచలనం కలిగించింది. కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలో గల తలిపట్టి గ్రామానికి చెందిన అరసకుమరన్ కూలీ. ఇతని కుమార్తె తమిళరసి(20) బీఎస్సీ పూర్తి చేసిన తమిళరసికి ధర్మపురి జిల్లా పాలకోడు సమీపంలోని పొత్తలం గ్రామానికి చెందిన వ్యక్తితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తమిళరసి దగ్గర బంధువు హఠాన్మరణం చెందడంతో అంత్యక్రియలకు ఆమె హాజరైంది. ఆ తరువాత ఆమె ఇంటికి రాలేదు. తమిళరసి ఇంటికి వెళ్లకపోవడంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె బంధువులు ఊరంతా వెతికారు. ఆ సమయంలో కొంతమంది తమిళరసిని రామూర్తి కుమారుడు సత్యనాథన్ కిడ్నాప్ చేసి ఉండవచ్చునని తెలిపారు. దీంతో తమిళరసి తండ్రి అరస కుమరన్ నాగరసంపట్టి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


విశ్రాంత పోలీసు అధికారి రామమూర్తి కుమారుడు సత్యనాథన్ (23) తన కుమార్తె తమిళరసిని కిడ్నాప్ చేశాడని ఆమెను రక్షించాలని కోరారు. రామమూర్తి ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ జరపగా సత్యనాథన్ ఇంటిలో లేడని తెలిసింది. సత్యనాథన్, తమిళరసి గతంలో ప్రేమించుకున్నారని, ఈ ప్రేమ వ్యవహారం తెలిసిన ఆమె తల్లిదండ్రులు తమిళరసి వేరే వ్యక్తితో వివాహం జరిపించారని పోలీసు విచారణలో తేలింది. ప్రేమించిన తమిళరసిని మరచిపోలేక సత్యనాథన్ ఆమెను కిడ్నాప్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన సత్యనాథన్, తమిళరసిల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement