Krishnagiri District
-
ఘోర ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
క్రిష్ణగిరి: కృష్ణగిరి– హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న గ్యాస్ ట్యాంకర్ లారీని కారు ఢీనడంతో ఏడాది చిన్నారితో పాటు ఐదుగురు మృతి చెందారు. వివరాల మేరకు... బెంగళూరుకు చెందిన రమేష్ కుటుంబ సభ్యులు 8 మంది కలిసి తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంలో బంధువుల శుభకార్యానికి కారులో వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకొని సోమవారం ఉదయం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. క్రిష్ణగిరి-హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద కారు అదుపుతప్పి పక్కనే నిలిపి ఉన్న ఖాళీ గ్యాస్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడాది బాలిక అంజలితో పాటు ఐదుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా డీఎస్పీ రాజు, రవాణాశాఖాధికారి బాలమురుగన్, కందికుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
స్టూడెంట్ను ఎత్తుకెళ్లి పెళ్లికి యత్నించిన పీటీ సర్
సాక్షి, తిరువొత్తియూరు: కృష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలో ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా మత్తూర్ సమీపం జింజెమ్‌పట్టికి చెందిన మూర్తి కుమార్తె (16) ప్లస్ వన్ చదువుతోంది. తిరువణ్ణామలై జిల్లా మేల్ సంగంలో ఉంటోంది. అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్ మిషన్ మెట్రికులేషన్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈ నేపథ్యంలో 9వ తేదీన ఆ విద్యార్థిని అదృశ్యమైంది. దీనిపై విద్యార్థిని తల్లి కావ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తిరువన్నామలై నాగనూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్న చరణ్ రాజ్ వివాహం చేసుకోడానికి ఆ విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్లు తేలింది. దీంతో మత్తూరు పోలీస్ ఇన్స్పెక్టర్ మురుగన్ ఆదివారం చరణ్ రాజ్‌ను అరెస్టు చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. చదవండి: అద్దె కోసం వచ్చామంటూ 12 సవర్ల బంగారం దోచేశారు -
ఊరు ఇంటర్ పాసైంది
ఇరులపట్టి గ్రామం. ఎక్కడుంది? డెంకణికొట్టయ్ తాలూకా. ఎక్కడుంది? బొమ్మతతనూర్ పంచాయితీ. ఎక్కడుంది? కృష్ణగిరి జిల్లా. ఓ.. తమిళనాడు! తమిళనాడులోని ఆ ఇరులపట్టి గ్రామం ఇప్పుడు వార్తలలోకి రావడానికి మంచి కారణమే ఉంది. ఆ ఊరి ఇంటర్ విద్యార్థిని కృష్ణవేణి గురువారం వచ్చిన ఫలితాలలో 600 మార్కులకు 295 మార్కులతో పాసై ఊరికి గుర్తింపును తెచ్చింది. ఇరులపట్టి గ్రామంలో ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి కృష్ణవేణి. పక్క జిల్లా అయిన ధర్మపురిలో.. పాలాకోడ్ సమీపంలోని కొత్తూరు ప్రభుత్వ కళాశాలలో ఆమె చదివింది. టెన్త్ కూడా అక్కడే. తొంభై తొమ్మిది, తొంభై ఎనిమిది శాతాలతో పిల్లలు పాస్ అవుతున్న కాలం ఇది. అయితే కృష్ణవేణిని వారితో సమానంగా అభినందించడానికి ఆమె సాధించిన మార్కులను కాకుండా, ఆమె ప్రయత్నాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్లో కామర్సు, అకౌంట్స్ సబ్జెక్టులతో పాసైంది కృష్ణవేణి. ఇరులపట్టి చుట్టుపక్కల చాలావరకు తెలుగు, కన్నడ మీడియం పాఠాశాలలే. అందుకని తమిళ మీడియం కోసం పొరుగు జిల్లాల్లోని హాస్టల్లో ఉండి.. అక్కడే ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంది. బ్యాంక్ పరీక్షలు రాస్తూ, సివిల్ సర్వీసుకు ప్రిపేర్ అవుతూ ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె లక్ష్యం. తండ్రి రైతు. తల్లి గృహిణి. ఇద్దరు తోబుట్టువులు. వాళ్ల చదువు టెన్త్ తర్వాత ఆగిపోయింది. కృష్ణవేణి ఆ ఊరి చరిత్రలోనే ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి అనే వార్త రాగానే చుట్టుపక్కల డిగ్రీ కళాశాలల నుంచి ఆమెకు సీటు ఇస్తామన్న ఆఫర్లు మొదలయ్యాయి! ధర్మపురిలోని ‘ఆర్ట్స్ అండ్ సైన్స్’ ప్రైవేటు కాలేజీ ఇప్పటికే ఆమె కోసం అడ్మిషన్‌ను రిజర్వు చేసి ఉంచింది! ఇంటర్ ఫలితాలు వచ్చిన రోజు డెంకణికొట్టయ్ డిఎస్పీ సంగీత, కేళమంగళం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇరులపట్టి గ్రామంలోనే ఉన్నారు. స్థానికులకు రేషన్ బియ్యం, పప్పు, నూనెల పంపిణీ సక్రమంగా జరుగుతున్నదో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఆ పనిలో ఉన్నప్పుడే కృష్ణవేణి గురించి డిఎస్పీ సంగీతకు తెలిసింది. వెంటనే ఆమెను పిలిపించి అభినందించారు. ‘‘నేనూ నీ లాగే పల్లె ప్రాంతం నుంచి వచ్చాను. మా ఇంట్లో నేనే తొలి గ్రాడ్యుయేట్‌ని’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు సంగీత. ఆర్థికంగా కృష్ణవేణికి సహాయం చేకూరేలా చేస్తానని కూడా చెప్పారు. ఇరులపట్టి గిరిజన గ్రామం. ఇకముందు కృష్ణవేణి ఏం సాధించినా అది ఊరు పంచుకునే విషయమే అవుతుంది. కృష్ణవేణి ర్యాంకు సాధించలేదు. నైంన్టీ నైన్ పర్సెంటేమీ రాలేదు. ఇంటర్ పూర్తి చేసింది.. అంతే! ఊరి పేరు మార్మోగిపోతోంది. ఊరి చరిత్రలోనే.. తొలి.. ఇంటర్ ఉత్తీర్ణురాలు కృష్ణవేణి!! -
ప్రేమ పెళ్లి ఎంత పనిచేసింది?
క్రిష్ణగిరి(సూళగిరి): పెద్దల మాట పెడచెవిన పెట్టి కర్ణాటకలో ఓ జంట ప్రేమ వివాహం చేసుకుంది. బంధువులు వారిని గ్రామానికి తీసుకొచ్చి పంచాయితీ పెట్టి విడిపోవాలని సూచించారు. దీంతో ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ప్రియున్ని కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకొన్న ప్రియుని తండ్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ సంఘటన సూళగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. సూళగిరి తాలూకా కొడితిమ్మనపల్లి గ్రామానికి చెందిన బసప్ప కొడుకు సురేష్(21) ప్లస్‌టూ వరకు చదువుకొని బెంగళూరులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహేశ్వరి(21) డిగ్రీ వరకు చదువుకుంది. ఏడాది కాలంగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. గత నెల 17వ తేదీ బెంగళూరులోని కణ్ణమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకొన్న ఇరువర్గాల బంధువులు వారికి నచ్చజెప్పి శనివారం స్వగ్రామానికి తీసుకొచ్చి పంచాయితీ ఏర్పాటు చేసి విడిపోవాలని సూచించారు. దీంతో ప్రేమ జంట సూళగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు రాత్రి సమయంలో స్టేషన్లో ఉంచమని, ఉదయం రావాలని సూచించడంతో సూళగిరిలోని ఓ మిత్రుని ఇంట్లో బసచేసి ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళుతుండగా బంధువులు సురేష్‌ను కిడ్నాప్ చేశారు. తన భర్తను కిడ్నాప్ చేశారని మహేశ్వరి సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకొన్న సురేష్ తండ్రి, గతంలో కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
మావి మూడు ఏలుబడులే కానీ బతుకొక్కటే
‘రాగెన్నుల రాజ్జెం’కు రాసిన ముందుమాటలోంచి; ప్రచురణ: కృష్ణగిరి జిల్లా రచయితల సంగం; పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు. రమేశ్ ఫోన్: +91 8500548142 కృష్ణగిరి జిల్లా రచయితల సంగం (కృష్ణ. ర. సం.) వారు వెలువరిస్తుండే పన్నెండో పొత్తం ఇది. ‘మొరసునాడు కతలు’ పేరుతో వస్తుండే రెండో కూర్పు ఇది. మొరసునాడు ఇప్పటి ఆంధ్ర, కర్నాటక, తమిళనాడులలో మూడు ముక్కలయి నిలిచి ఉంది. చిత్తూరు, అనంతపురం, కృష్ణగిరి పెనువంటెం(జిల్లా)లలో కొంత కొంత; కోలారు, చిన్నబళ్లాపురం, బెంగళూరు నగర, గ్రామ పెనువంటెంలను కలిపితే మొరసునాడు అవుతుంది. మొరసునాడులో నూటికి ఏబయిమంది తెలుగు వాళ్లు ఉంటారు. ఇందులో తమిళనాడుముక్క వాళ్లవి ఆరు కతలుండాయి. ఆంధ్రముక్క వాళ్లవి అయిదు కతలుండాయి. కర్నాటకముక్క నుండి తీసుకొనింది నాలుగు కతల్ని. మూడు ముక్కలయి మూడునాడుల్లో ఉండినా, ఈ తావు బతుకూ బాళూ అంతా ఒకటే. ఈ తావు వాళ్లకి ముక్కెమయిన తిండిపంట రాగులు. వరసగా నాలుగు నాళ్లు రాగిసంగటి దొరకకపోతే వేసట పడిపోతారు. ఈ పదైదు కతలలో రాగిముద్దను తలుచుకోని కతే లేదు. మావి మూడు ఏలుబడులే కానీ బతుకొక్కటే అని చెప్పదలుచుకొంటిమి. దానికే మూడు ముక్కల కతలన్నీ కలగలిపి కూరిస్తిమి. ఈ కూర్పులోని పదైదుమంది రచయితలలో తొమ్మిదిమంది తెలుగువాళ్లు, నలుగురు కన్నడిగులు, ఇద్దురు తమిళులు. పదైదుమందిలో ఆరుగురు దళితులు, ఏడుగురు వెనకబడిన తరగతుల వాళ్లు, ఇద్దురు రైతుబిడ్డలు. దానికే కావచ్చు ఈ కతలన్నీ మన్ను మణము(సువాసన)తో నిండి ఉండాయి. ఏలుబడులు మూడుముక్కలు చేసిన మమ్మల్ని నానుడు(సాహిత్యా)లు అతుకుతుండాయి. రండి, మా రాగెన్నుల రాజ్జెం మీకు ఎదురుకోలు పలుకుతా ఉంది. - స.వెం.రమేశ్ రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం (‘కథ-2015’కు రాసిన సంపాదకీయంలోంచి; ప్రచురణ: కథాసాహితి; పేజీలు: 206; వెల: 65; ప్రతులకు: 164, రవి కాలనీ, తిరుమలగిరి, సికింద్రాబాద్-15; ఫోన్: 9849310560) సాహిత్య సృజన మామూలుగా ఏ వ్యక్తి అయినా చేసే పనికాదు. సమాజంలో ముఖ్యమైన భాగంగా ముందున ఉంటూ, సమాజ చలన సూత్రాలను గురించి తనకున్న అవగాహనతో తను జీవిస్తూన్న సమాజం తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తూ విస్పష్టంగా వ్యాఖ్యానించగల వ్యక్తి- అనగా రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం. అలా కమ్యూనికేషన్ నెరపడం- అంటే సాహిత్యం సృజియించడం- ఒక రకంగా తన బాధ్యత అనుకుంటాడు రచయిత. నడుస్తూన్న కాలం మౌలిక స్వభావాన్ని దాని రూపం, సారంతో సహా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, మారని మనిషితనం (్టజ్ఛి ్ఛ్ట్ఛట్చ జీ ్టజ్ఛి ఝ్చ), చరిత్ర వారసత్వం నేటి ప్రపంచంలో ఎలా నెగ్గుకుని వస్తున్నాయో తన రచనల ద్వారా చూపిస్తూ ఆ బాధ్యత నెరవేరుస్తాడు. సాహిత్య సృజన వివిధ ప్రక్రియ(జ్ఛట్ఛ)లలో సాగుతుంది. కథ వాటిల్లో ప్రధానమైనది. నిరంతర పరిణామశీలమైన విశిష్ట సాహితీప్రక్రియ కథ. కథంటే కేవలం కల్పన కాదు, అలాగని పూర్తి వాస్తవమూ కాదు. సాధారణత్వం చెరిగిపోయేలా ఊహను మేళవించి, ఒక యథార్థ జీవిత శకలాన్ని ఉన్నతీకరించి ఆసక్తికరంగా మలచడం- అనగా నిజజీవితంలో అంతవరకూ మన అనుభవంలోకి రాని రీతిలో, మన ఆలోచనకు తట్టని కోణంలో ఒక పరిచితమైన విషయాన్ని లేదా సాధారణ ఘటనను లేదా మామూలు సన్నివేశాన్ని కొత్తగా చూపడం కథ అవుతుంది. ఈ ఆసక్తికరంగా మలిచే కొత్తకోణంలో చూపే పనినే ‘కళ’ అంటాము. కళ అంటే సాధారణ అర్థంలో ప్రకృతి అనుకరణ అని మనకు తెలుసు. ఈస్థటిక్స్ ప్రకారం ఆలోచనలు రేకెత్తించేలా వినూత్న పద్ధతిలో ఆవిష్కృతమయ్యే వాస్తవికత పార్శ్వం అని కూడా మనకు తెలుసు. అలా చూసినప్పుడు కథారచయితని కళాకారుడనే అనాలి. ఎందుకంటే కథ (fiction) ఒక రకంగా వాస్తవమూ, మరోరకంగా వాస్తవాన్ని ధిక్కరించే ఊహాకల్పన కూడా. - ఆడెపు లక్ష్మీపతి -
తెలుగు భాషాభిమానులు ఎటువైపు ?
► అయోమయంలో తెలుగు సంఘాలు ► ఎవరికి ఓటేయాలో తెలియక సంకట స్థితి హొసూరు : తమిళనాడులో తెలుగువారు అధికంగా ఉన్న క్రిష్ణగిరి జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. దేశంలో తెలుగు వారికి ఎటువంటి సమస్య వచ్చిన తొలుత స్పందించే తమిళనాడులోని తెలుగువారే. జిల్లాలో 2.90 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో 20 శాతం తమిళులు, మిగలిన వారంతా తెలుగు, కన్నడ, ఉర్దూ భాషా ప్రజలే. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలు తలపడుతున్నాయి. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థిగా కే. గోపీనాథ్, అన్నాడీఎంకే పార్టీ తరుపున పి. బాలక్రిష్ణారెడ్డి తలపడుతున్నారు. సంకట పరిస్థితుల్లో తెలుగు సంఘాలు : హొసూరు నియోజకవర్గంలో తెలుగు సంఘాలు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కే. గోపీనాథ్, బాలక్రిష్ణారెడ్డి ఇద్దరు తెలుగువారే, ఎవరికి ఓటేయ్యాలో తెలియక సంఘాలు సంకటస్థితిలో పడ్డాయి. డీఎంకే హయాంలోనే నిర్బంధ తమిళం : 2006లో డీఎంకే హయాంలో నిర్బంధ తమిళభాషా చట్టం తీసుకువచ్చింది. అప్పుడు డీఎంకే తెలుగు వారికి వ్యతిరేకం కాదా అని తెలుగు భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు. గోపీనాథ్ తెలుగు భాషను కాపాడేందుకు కృషి చేసినా ప్రస్తుతం ఆయన కూటమి పార్టీ డీఎంకే కదా అంటూ నిలదీస్తున్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే ఈ సారి నిర్బంధ తమిళభాషా చట్టాన్ని సవరిస్తామని గోపీనాథ్ చెబుతున్నా, 2006లో నిర్బంధ తమిళం ఎందుకు అడ్డుకోలేదని భాషాభిమానులు అంటున్నారు. తమిళ నిర్బంధానికి గురిచేసింది అన్నాడీఎంకే కాదా ? హొసూరు అన్నాడీఎంకే అభ్యర్థి పి.బాలక్రిష్ణారెడ్డి తెలుగు వ్యక్తే. ఈయన అన్నాడీఎంకే పార్టీ తరఫున పోటీ చేయడంతో తెలుగువారంతా నిర్బంధ తమిళభాషా చట్టాన్ని పదును పెట్టి విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వం కాదా అని భాషాభిమానులు అంటున్నారు. పోరాటాలు చేసి జయ పట్టించుకున్న పాపన పోలేదని వారు మండిపడుతున్నారు. నిర్బంధ తమిళభాషా చట్టంపై ఎమ్మెల్యే అయితే మాట్లాడగలడా లేక ఆ చట్టంపై పార్టీని ఒప్పించగలడా అనే అనుమానాలు వ్యక్తవమవుతున్నాయి. తెలుగు యువశక్తి ఆపగలదా ? నిర్బంధ తమిళం తెలుగు యువశక్తి ఆపగలదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో అనేక ఉద్యమాలు నడిపి, తన జీవితం మొత్తం తెలుగు భాషకే అంకితం చేసిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హొసూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన తమిళ పార్టీల ఎదుట ఎంత వరకు నిలబడుగలుగుతాడు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా జగదీశ్వర్ రెడ్డి జయలలిత పోటీ చేస్తున్న ఆర్కేనగర్‌తో పాటు హొసూరులో కూడా బరిలో ఉన్నారు. తెలుగు వాడి నాడి తెలుసుకోవడం ఇప్పుడే సాధ్యం కాదు మరి. -
వివాహితను కిడ్నాప్ చేసిన మాజీ ప్రియుడు
కేకే.నగర్(తమిళనాడు): వివాహితను ప్రేమించిన పోలీసు అధికారి కుమారుడు ఆమెను కిడ్నాప్ చేసిన సంఘటన కృష్ణగిరి జిల్లాలో సంచలనం కలిగించింది. కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపంలో గల తలిపట్టి గ్రామానికి చెందిన అరసకుమరన్ కూలీ. ఇతని కుమార్తె తమిళరసి(20) బీఎస్సీ పూర్తి చేసిన తమిళరసికి ధర్మపురి జిల్లా పాలకోడు సమీపంలోని పొత్తలం గ్రామానికి చెందిన వ్యక్తితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తమిళరసి దగ్గర బంధువు హఠాన్మరణం చెందడంతో అంత్యక్రియలకు ఆమె హాజరైంది. ఆ తరువాత ఆమె ఇంటికి రాలేదు. తమిళరసి ఇంటికి వెళ్లకపోవడంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె బంధువులు ఊరంతా వెతికారు. ఆ సమయంలో కొంతమంది తమిళరసిని రామూర్తి కుమారుడు సత్యనాథన్ కిడ్నాప్ చేసి ఉండవచ్చునని తెలిపారు. దీంతో తమిళరసి తండ్రి అరస కుమరన్ నాగరసంపట్టి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశ్రాంత పోలీసు అధికారి రామమూర్తి కుమారుడు సత్యనాథన్ (23) తన కుమార్తె తమిళరసిని కిడ్నాప్ చేశాడని ఆమెను రక్షించాలని కోరారు. రామమూర్తి ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ జరపగా సత్యనాథన్ ఇంటిలో లేడని తెలిసింది. సత్యనాథన్, తమిళరసి గతంలో ప్రేమించుకున్నారని, ఈ ప్రేమ వ్యవహారం తెలిసిన ఆమె తల్లిదండ్రులు తమిళరసి వేరే వ్యక్తితో వివాహం జరిపించారని పోలీసు విచారణలో తేలింది. ప్రేమించిన తమిళరసిని మరచిపోలేక సత్యనాథన్ ఆమెను కిడ్నాప్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన సత్యనాథన్, తమిళరసిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భార్యను చంపి భర్త ఆత్మహత్య
శాంతిపురం: వుండలంలోని కాలిగానూరు వద్ద సోవువారం రాత్రి గుర్తించినహిళ శవం కేసు కొత్తమలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావించిన మృతురాలి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాళ్లబూదగూరు ఎస్ఐ గోపి, మృతురాలి బంధువుల సవూచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వరటనపల్లెకు చెందిన చిన్నస్వామి కుమారుడు అయ్యుప్ప(26)తో వీ.కోట ఈశ్వర్‌నగర్‌కు చెందిన సుబ్రవుణ్యం, యుశోదవ్ము కువూర్తె వనిక(21)కు 13 నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన ఐదు నెలలకు అయ్యుప్ప బతుకు తెరువు కోసం సింగపూరుకు వెళ్లాడు. అప్పట్లో భార్యను పుట్టింట్లో ఉంచి వెళ్లడంతో ఆమె వి.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఇటీవల తిరిగి వచ్చిన అయ్యుప్ప భార్యతో పాటు వి.కోటలోనే ఉంటూ గతనెల 29న వరటనపల్లెకు వెళ్లివచ్చారు. ఇరువురి మద్య చిన్నపాటి వివాదాలు నడుస్తున్నయి. వనికకు తరచూ కడుపునొప్పి వస్తుండటంతో పరీక్షల కోసం సోవువారం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి వెళ్లేందుకు వి.కోట నుంచి ద్విచక్ర వాహనంపై బయులుదేరారు. అయితే కాలిగానూరు సమీపంలో సోవువారం రాత్రి వనిక శవమై కనిపించింది. సవూచారం అందుకున్న రాళ్లబూదగూరు ఎస్ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి రాత్రే మృతురాలి వివరాలు సేకరించారు. మృతురాలి నోరు నొక్కి, గొంతు నులిమి హత్య చేసినట్టు గుర్తించారు. భర్తే నిందితుడన్న అనుమనంతో విచారణ ప్రారంభించారు.మంగళవారం వనిక మృతదేహానికి కుప్పం వంద పడకల ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆమె బంధువులకు అప్పగించారు. ఈ సందర్బంగా కుప్పం సీఐ రాజశేఖర్ మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అయితే భార్యను కడదేర్చిన అయ్యుప్ప స్వగ్రావూనికి వెళ్లి సోమవారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. దీనిపై తమిళనాడులోని బరుగూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుడి వద్ద నుంచి అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ వెలుగు చూస్తే వురిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మూడో వ్యక్తి ఎవరు? సోమవారం సాయుంత్రం వుృతురాలు, ఆమె భర్తతో పాటుగా 50 ఏళ్లకు పైగా వయుస్సున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. ఆయితే కొంతసేపటి తరువాత అయ్యుప్పతో పాటు తెల్లపంచె, చొక్కాతో ఉన్న సదరు వ్యక్తి వూత్రమే తిరిగి వచ్చాడని వారు చెబుతున్నారు. దీంతో ఈ మూడవ వ్యక్తి ఎవరన్నది సందేహంగా మిగిలింది. భార్యను కడదేర్చాలని మూందే పథకం పన్నిన అయ్యుప్ప సాయుంగా ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నాడా? లేదా క్షణికావేశంలో భార్యను హత్య చేస్తే అక్కడే ఉన్న మూడో వ్యక్తి ఏమి చేస్తున్నాడు? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరన్నదీ పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సింది. -
చెలి కోసం నెచ్చెలి పూజలు
రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత నెచ్చలి శశికళ బుధవారం ఉదయాన్నే కృష్ణగిరి జిల్లాలోని అటవీ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యక్షం అయ్యారు. కొబ్బరి కాయలు చేత బట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆంజనేయుడికి ప్రత్యేకంగా కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లించారు. అన్నాడీఎంకే అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ బంధం దాదాపు 30 ఏళ్లు పైమాటే. జయలలిత ఎక్కడికి వెళ్లినా వెన్నంటి శశికళ ఉంటారు. జయలలితకు ఏ మేరకు గౌరవాలు, విలువలు దక్కుతాయో అవన్నీ ఆమెకూ దక్కాల్సిందే. జయలలితకు నీడలా ఉంటూ వచ్చిన శశికళకు రెండేళ్ల క్రితం చేదు అనుభవం ఎదురైంది. పోయేస్ గార్డెన్ నుంచి ఆమెను గెంటివేయడంతో ఇక జయ-శశి బం ధానికి కాలం చెల్లినట్టే సర్వత్రా భావించారు. అయితే, కొందరు మాత్రం ఇది వారికి కొత్తేమీ కాదన్నట్టుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇక, వీరిద్దరి మధ్య అగాథం పెంచినట్టేనన్న భావన ప్రతి ఒక్కరి మదిలోనూ నెలకొంది. అయి తే, ఈ అగాథం వెనుక భారీ కుట్ర వెలుగు చూసింది. ఈ పరిస్థితుల్లో బాధనంతా ఏకరువు పెడుతూ కన్నీరు మున్నీరై మనసులోని మాటను తలైవికి చేరవేస్తున్నట్లు ఓ లేఖాస్త్రం మీడియాకు శశికళ విడుదల చేశారు. అం దులో ‘ఆనమీర గలనా... జయ సఖి’ అంటూ తప్పొప్పులు తానెరుగనని, అంతా ఎవరో చేసి తనపై వేశారని, తనకు ప్రాణస్నేహితురాలు జయను ప్రేమిం చటం తప్ప వేరే ప్రపంచమే తెలియదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇక తన జీవితం జయలలిత సేవకే అంటూ ప్రకటించారు. దీంతో కరిగిపోయిన పురట్చి తలైవి మళ్లీ పోయేస్ గార్డెన్లో శశికళకు చోటు ఇచ్చారు. ఆ నాటి నుంచి జయలలితకు మళ్లీ నీడలా ఉంటూ వస్తున్న శశికళ తన చెలిని ప్రధానిగా చూడాలన్న తపనతో ఉంటున్నారు. ఆలయ బాట తాము కేసుల నుంచి నిర్దోషులుగా బయట పడాలని, జయలలిత అత్యున్నత స్థానంలో ఉండాలని కాంక్షిస్తూ నెచ్చెలి శశికళ ఆలయాల బాట సైతం పట్టారు. గత ఏడాది రాష్ర్టంలోని అన్ని ప్రధాన ఆలయాలను ఆమె రహస్యంగా సందర్శించారు. ఈ ఆలయ బాట పట్టేం దుకు చెన్నై కోటూరు పురంలోని బొజ్జగణపయ్య ఆల యంలో జయలలితతో కలసి పూజలను సైతం నిర్వహించారు. ఆ తర్వాత ఓమారు తిరుచ్చిలో జయలలిత కలసి ఆలయ దర్శనానికి వెళ్లిన శశికళ బుధవారం ఉదయాన్నే కృష్ణగిరిలోని ఓ అటవీ గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. పవిత్ర క్షేత్రాలన్నీ సందర్శించి ప్రత్యేక పూజలను శశికళ చేసి ఉన్నారు. చిన్నమ్మ పూజలు జయలలిత అత్యున్నత స్థానంలో కూర్చోవాలని కలలు కంటున్న శశికళ తన కోరికను తీర్చాలంటూ ఆంజనేయస్వామిని వేడుకున్నారు. 40 లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకుని పీఎం సింహాసనంలో కూర్చోవాలని జయలలిత తపన పడుతుండటం, ఆమె కలను నెరవేర్చడం లక్ష్యంగా ఎన్నికలకు ముందు రోజు ఈ ఆల యాన్ని శశికళ సందర్శించినట్టుందన్న ప్రచారం సాగుతోంది. కృష్ణగిరి జిల్లా నయాన్ పారై సమీపంలోని అటవీ గ్రామంలో కాట్టు ఆంజేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి శని వారం, పౌర్ణమి పర్వదినాన ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ కొబ్బరికాయను కొట్టడం ఉండదు. కొబ్బరికాయను ఓ సంచిలో పెట్టి ఆలయ ప్రద క్షిణ చేస్తే, కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ఆలయం గురించి శశికళ తెలుసుకున్నట్టుంది. ఉదయాన్నే చెన్నై నుంచి రోడ్డు మార్గంలో కృష్ణగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆలయానికి వెళ్లిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరి సంచిని చేత బట్టి ఆలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేశారు. పూజాది కార్యక్రమాల అనంతరం ఆగమేఘాలపై చెన్నైకు ఆమె తిరుగు పయనం అయ్యారు. శశికళ వెంట ఓ మహిళ, మరో ముగ్గురు ఉన్నట్టు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరు కోర్టులో సాగుతున్న విచారణ తుది దశకు చేరిన దృష్ట్యా, అందులో నుంచి నిర్దోషులుగా బయట పడాలని, జయలలిత ప్రధాని కావాలని ఆమె పూజలు చేశారు.