భార్యను చంపి భర్త ఆత్మహత్య | Husband kills wife and commits suicide | Sakshi
Sakshi News home page

భార్యను చంపి భర్త ఆత్మహత్య

Published Wed, May 6 2015 2:38 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

Husband kills wife and commits suicide

శాంతిపురం: వుండలంలోని కాలిగానూరు వద్ద సోవువారం రాత్రి గుర్తించినహిళ శవం కేసు కొత్తమలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా భావించిన మృతురాలి భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాళ్లబూదగూరు ఎస్‌ఐ గోపి, మృతురాలి బంధువుల సవూచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వరటనపల్లెకు చెందిన చిన్నస్వామి కుమారుడు అయ్యుప్ప(26)తో వీ.కోట ఈశ్వర్‌నగర్‌కు చెందిన సుబ్రవుణ్యం, యుశోదవ్ము కువూర్తె వనిక(21)కు 13 నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన ఐదు నెలలకు అయ్యుప్ప బతుకు తెరువు కోసం సింగపూరుకు వెళ్లాడు. అప్పట్లో భార్యను పుట్టింట్లో ఉంచి వెళ్లడంతో ఆమె వి.కోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఇటీవల తిరిగి వచ్చిన అయ్యుప్ప భార్యతో పాటు వి.కోటలోనే ఉంటూ గతనెల 29న వరటనపల్లెకు వెళ్లివచ్చారు.

ఇరువురి మద్య చిన్నపాటి వివాదాలు నడుస్తున్నయి. వనికకు తరచూ కడుపునొప్పి వస్తుండటంతో పరీక్షల కోసం సోవువారం కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి వెళ్లేందుకు వి.కోట నుంచి ద్విచక్ర వాహనంపై బయులుదేరారు. అయితే కాలిగానూరు సమీపంలో సోవువారం రాత్రి వనిక శవమై కనిపించింది. సవూచారం అందుకున్న రాళ్లబూదగూరు ఎస్‌ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి రాత్రే మృతురాలి వివరాలు సేకరించారు. మృతురాలి నోరు నొక్కి, గొంతు నులిమి హత్య చేసినట్టు గుర్తించారు.

భర్తే నిందితుడన్న అనుమనంతో విచారణ ప్రారంభించారు.మంగళవారం వనిక మృతదేహానికి కుప్పం వంద పడకల ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆమె బంధువులకు అప్పగించారు. ఈ సందర్బంగా కుప్పం సీఐ రాజశేఖర్ మృతురాలి బంధువుల నుంచి వివరాలు సేకరించారు. అయితే భార్యను కడదేర్చిన అయ్యుప్ప స్వగ్రావూనికి వెళ్లి సోమవారం రాత్రి ఉరి వేసుకుని మృతి చెందాడు. దీనిపై తమిళనాడులోని బరుగూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుడి వద్ద నుంచి అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ వెలుగు చూస్తే వురిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
 
మూడో వ్యక్తి ఎవరు?
 సోమవారం సాయుంత్రం వుృతురాలు, ఆమె భర్తతో పాటుగా 50 ఏళ్లకు పైగా వయుస్సున్న ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. ఆయితే కొంతసేపటి తరువాత అయ్యుప్పతో పాటు తెల్లపంచె, చొక్కాతో ఉన్న సదరు వ్యక్తి వూత్రమే తిరిగి వచ్చాడని వారు చెబుతున్నారు. దీంతో ఈ మూడవ వ్యక్తి ఎవరన్నది సందేహంగా మిగిలింది. భార్యను కడదేర్చాలని మూందే పథకం పన్నిన అయ్యుప్ప సాయుంగా ఎవరినైనా ఏర్పాటు చేసుకున్నాడా? లేదా క్షణికావేశంలో భార్యను హత్య చేస్తే అక్కడే ఉన్న మూడో వ్యక్తి ఏమి చేస్తున్నాడు? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరన్నదీ పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement