హైదరాబాద్: రాత్రిపూట బస్టాప్ వద్ద వేచి ఉన్న ఒంటరి మహిళకు లిఫ్ట్ ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించిన ఓ క్యాబ్ డ్రైవర్‌ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి ఆదివారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. లాలాపేట్ శాంతినగర్‌కు చెందిన కందుకూరి నాగ మధుకిరణ్(29) ఓలా క్యాబ్ డ్రైవర్. ఈ నెల 5న కాప్రా పరిధిలోని రాధిక థియేటర్ చౌరస్తా వద్ద రాత్రి 10:50 గంటలప్పుడు ఓ మహిళ ఒంటరిగా బస్సు కోసం వేచిచూస్తోంది.
అదే సమయంలో క్యాబ్‌లో అటుగా వచ్చిన నాగమధుకిరణ్ ఆమెను మాటల్లో పెట్టి సైనిక్‌పురి వరకు లిఫ్ట్ ఇస్తానంటూ క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక దారి మళ్లించాడు. ఏఎస్‌రావునగర్ పార్కు వద్దకు తీసుకెళ్లి కారు డోర్లు లాక్ చేసి మహిళతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఆమె అరుపులు, కేకలు వేయడంతో కారులోంచి దింపి అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. దీనిపై బాధితురాలు కుషాయిగూడ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా క్యాబ్ డ్రైవర్‌ను శనివారం అదుపులోకి తీసుకొని విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది అక్టోబర్ 17న కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. కౌకూర్ దర్గాకు బాలికను తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి లైంగికదాడికి యత్నించినట్లు అంగీకరించాడు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, ఏసీపీ గోనె సందీప్‌రావు, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ కె. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఘటనను ఓలా అధికార ప్రతినిధి ఖండించారు. ఇవి తమ సర్వీస్‌లో భాగంగా జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే డ్రైవర్‌ను ఓలా సర్వీస్‌నుంచి తొలగించినట్లు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల విచారణకు సహకరిస్తామని, ఎలాంటి సమాచారం కావాలన్నా అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment