
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక అనే మహిళ కొద్ది రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు వచ్చారు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే తన 11 నెలల కుమారుడితో కలిసి ఉంటున్నారు. రాధిక భర్త నేరం చేసిన కేసులో చంచల్ గూడ జైలులో ఉన్నారు. దీంతో రాధిక గాంధీ ఆస్పత్రిలోని వెయిటింగ్ రూమ్‌లో బాలుడితో కలిసి ఉంటున్నారు.గురువారం తెల్లవారు జామున 4 గంటలకు గుర్తుతెలియన వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసి పరారయ్యారు. కాసేపటి తర్వాత నిద్రలేవగా పక్కన బాబు కనిపించలేదు. దీంతో ఆమె కంగారుపడిన ఆమె చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి అనుమానిత వ్యక్తిని గుర్తించారు. ఉదయం 7.36గంటల సమయంలో బాలుడిని కిడ్నాప్ చేసినట్లుగా గాంధీ ఆస్పత్రిలోని సీసీ టీవి పుటేజ్‌లో ద్వారా కనుగొన్నారు. మెయిన్ గేట్ దగ్గర సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో అనుమానితున్ని సరిగా గుర్తించలేకపోతున్నామని పోలీసులు పేర్కొన్నారు. అదృశ్యమైన బాలుణ్ణి వెతికేందుకు డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్ రూట్లలలో మరిన్ని సీసీటీవీలను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment