నూజివీడు : కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దీంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులు ఆగిరిపల్లి పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా ఐదురుగు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.