పోరాం గ్రామంలో కిడ్నాపైన బాలుడు మాదేష్ విశాఖ జిల్లా నక్కపల్లిలో పోలీసులకు లభ్యమయ్యాడు.
♦ కిడ్నాపైన బాలుని కథ సుఖాంతం
పూసపాటిరేగ(నెల్లిమర్ల): పోరాం గ్రామంలో కిడ్నాపైన బాలుడు మాదేష్ విశాఖ జిల్లా నక్కపల్లిలో పోలీసులకు లభ్యమయ్యాడు. బాలుడు తండ్రి శేషపు సంతోష్‌కుమారే కిడ్నాప్ చేసినట్లు తేలింది. ఎస్‌ఐ జి.కళాధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేశారు. బాలుడు తండ్రి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విశాఖ జిల్లా నక్కపల్లిలో టవర్ లొకేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా కిడ్నాప్ అయిన బాలుడు మాదేష్(3) ఒక ఇంట్లో వున్నట్లు ఆచూకీ లభ్యమైంది.
బాలుడును పట్టుకొనేలోపు సమీపంలో వున్న తండ్రి శేషపు సంతోష్‌కుమార్ పోలీసుల నుంచి తృటిలో తప్పించుకొన్నట్లు ఎస్‌ఐ కళాధర్ తెలిపారు. నక్కపల్లిలో తప్పించుకొన్న సంతోష్‌కుమార్ కో సం అక్కడ పోలీసులు సహకారంతో గాలి స్తున్నట్లు ఫోన్‌లో ఎస్‌ఐ సమాచారం ఇచ్చారు. రెండు రోజులుగా కొడుకు కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న తల్లి స్రవం తి, బంధువులు బాలుడు ఆచూకీ లభ్యమవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.