
నా భర్తను కిడ్నాప్ చేశారు
తన భర్త గోసుల మురళీని కిడ్నాప్ చేశారని నాగసువర్ణ అనే మహిళ బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీస్ స్టేషన్‌లో మహిళ ఫిర్యాదు
ప్రొద్దుటూరు క్రైం: తన భర్త గోసుల మురళీని కిడ్నాప్ చేశారని నాగసువర్ణ అనే మహిళ బుధవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేరకు ఆర్ట్స్ కాలేజి రోడ్డుకు చెందిన గోసుల మురళీ ఓ వాహనానికి యాక్టింగ్ డ్రైవర్‌గా వెళుతుంటాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగళవారం రాత్రి కడప నుంచి ఒక వ్యక్తి మురళీకి ఫోన్ చేసి డ్రైవర్ కావాలని అడిగాడు. పంపిస్తానని చెప్పడంతో కొద్దిసేపటికే ఇద్దరు వ్యక్తులు ఆర్ట్స్ కాలేజి రోడ్డులోని మురళీ ఇంటి వద్దకు వచ్చారు.
డ్రైవర్‌ను చూపించి వస్తానని అతను భార్య నాగసువర్ణతో చెప్పి వారితో కలిసి వెళ్లాడు. అయితే ఆ రాత్రి ఇంటికి రాలేదు. భర్త తన వద్ద రెండు ఫోన్లు ఉండగా ఒక ఫోన్ ఇంటిలో పెట్టి యూనినార్ నెంబర్ గల ఫోన్‌ను వెంట తీసుకెళ్లాడు. బుధవారం ఉదయం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం కడప నుంచి తమకు వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేసింది. తన భర్త గురించి అడుగుగా ఎవరో తన ఫోన్ తీసుకుని మీకు ఫోన్ చేసి ఉంటారని, వారి వివరాలు తెలియవని ఆమెకు జవాబు ఇచ్చాడు. దీంతో ఆమె చేసేదేమి లేక బుధవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.