కిడ్నాప్ అయిన మౌనిక శవమైతేలింది | kidnapped women found dead in medipally | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ అయిన మౌనిక శవమైతేలింది

Published Sun, Jul 3 2016 1:53 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

కిడ్నాప్ అయిన మౌనిక శవమైతేలింది

కిడ్నాప్ అయిన మౌనిక శవమైతేలింది

మేడిపల్లి: కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన నవవధువు మౌనిక కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది. ఆదివారం దేశాయిపేట శివారులో మౌనిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమెను కిడ్నాప్ చేసిన దుండగులే హత్యచేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శనివారం రాత్రి తన తండ్రితో బైక్పై వెళ్తున్న మౌనికను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దేశాయి పేటకు చెందిన మౌనికకు మోత్కురావు పేటకు చెందిన యువకుడితో మూడు నెలల క్రితమే వివాహం అయింది. ఈ క్రమంలో తండ్రితో కలిసి పుట్టింటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు.. తండ్రిని కొట్టి ఆమెను కిడ్నాప్ చేశారు. పోలీసులు ఆమె ఆచూకి కోసం దర్యాప్తు జరుపుతున్న క్రమంలో ఆమె మృతదేహం లభించింది. పోలీసులు నిందితులను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement