
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన అమ్మాయి దారుణ హత్యకు గురయ్యింది. పోరండ్ల గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల అఖిల్ ఆ అమ్మాయిని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపాడని పోలీసులు తేల్చారు.
కాగా వారం రోజుల క్రితం అమ్మాయి కనిపించకుండా పోవడంతో పోలీసు స్టేషన్ లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువకుడిని శనివారం ఉదయం విచారించగా హత్య తాను చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత హత్య చేసిన ప్రదేశానికి నిందితుడు పోలీసులను తీసుకువెళ్లి చూపించాడని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment