subramanyam
-
అర్ధరాత్రి అరాచకం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కిడ్నాప్
సాక్షి, తిరుపతి జిల్లా: కూటమి ప్రభుత్వం అరాచకం పరాకాష్టకు చేరింది. తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసిన టీడీపీ నేత రవి నాయుడు.. దుర్మార్గంగా వ్యవహరించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినాసరే అధికార దుర్వినియోగంతో గద్దెనెక్కాలని దౌర్జన్యాలు, దాడులతో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది.తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక నేటికి( మంగళవారం) వాయిదా పడింది. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా సోమవారం నగర డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్వీయూ ప్రాంగణంలో కూటమి నేతల అరాచకాలతో హైడ్రామా నడిచింది.కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోవడంతో కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైఎస్సార్సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. తిరుపతి రాయల్ చెరువు రోడ్డులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డ్రైవర్‌ను టీడీపీ గూండాలు చితకబాదారు. అభినయ్ బంధువు కౌశిక్, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ వాసుదేవ యాదవ్‌లపై కూటమి రౌడీలు దాడికి పాల్పడ్డారు. రెండు కార్లను ధ్వంసం చేశారు. 45వ డివిజన్ కార్పోరేటర్ అనీష్ అనీష్ భార్య డాక్టర్ మమతను కూడా కిడ్నాప్ చేసి బెదిరించాలని కూటమి నేతలు ప్రయత్నం చేశారు. కార్పొరేటర్ సతీమణి కిడ్నాప్‌నకు యత్నంతిరుపతి 45వ డివిజన్ కార్పొరేటర్ అనీల్ రాయల్ సతీమణి మమతను కూటమి నేతలు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తిరుపతిలో నలుగురు కార్పొరేటర్లను టీడీపీ నాయకులు సోమవారం ఉదయం కిడ్నాప్ చేశారు. వారిలో అనీష్ రాయల్ కూడా ఉన్నారు. ఆయన కూటమి నేతలకు లొంగడని అనీష్ రాయల్ భార్యను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.సమాచారం తెలసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు వెంటనే అనీష్ రాయల్ సతీమణి మమతను ఆర్సీ రోడ్డులోని రాయల్ నగర్లో పారీ్టకి చెందిన నాయకుడి ఇంట్లో సురక్షితంగా ఉంచారు. ఆ సమాచారం తెలుసుకున్న కూటమి నేతలు సోమవారం అర్ధరాత్రి ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపులు కొట్టారు. దీంతో భయపడ్డ మమత పోలీసులకు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో భూమన అభినయ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు.వెంటనే అభినయ్ రెడ్డి, నాయకులు అక్కడకు చేరుకున్నారు. కూటమి నాయకులు వారిని అడ్డుకుని కార్లను ధ్వంసం చేశారు. అభినయ్ డ్రైవర్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్, పార్టీ నాయకుడు కౌసిక్లపై దాడి చేయగా, అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తికి ఫోన్ చేశారు. వెంటనే ఎంపీ గురుమూర్తి, కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ సమాచారంతో పోలీసులు రాగా, మమతను సురక్షితంగా భూమన కరుణాకర రెడ్డి ఇంటికి చేర్చారు. -
ధనవంతులమే కానీ తృప్తి లేని జీవితం నాది
-
తప్పు చేశానని ఒప్పుకుంటేనే వివాదానికి పుల్‌స్టాప్
రావులపాలెం (కొత్తపేట): జెడ్పీ సమావేశంలో తలెత్తిన వివాదంలో ఇప్పటికే తాను తప్పు ఒప్పుకున్నానని, అదేవిధంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా తప్పు చేశానని ప్రతికా ముఖంగా ప్రకటన చేస్తేనే ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెడతానని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం రావులపాలెం కాపు కల్యాణ మండపంలో ఆయన జిల్లాస్థాయిలో బీసీ సంఘాల నేతలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బండారు సత్యానందరావు మాట్లాడుతూ సమావేశంలో పరుషంగా మాట్లాడడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరంరెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాజకీయాల్లో అనుకోని సంఘటనలు ఒక్కోసారి జరుగుతుంటాయన్నారు. జెడ్పీ ఘటన కూడా అటువంటిదేనన్నారు. ఎమ్మెల్యేతోపాటు తాను కూడా సహనం కోల్పోయి ప్రవర్తించిన మాట వాస్తవమేన్నారు. జగ్గిరెడ్డి తన మాదిరిగా పత్రికా సమావేశం పెట్టి ముందుగా తాను పేపర్లు విసరడం తప్పేనని ఒప్పుకుంటేనే వివాదం ముగుస్తుందన్నారు. ఈ సమావేశంలో టీవీ ఏర్పాటు చేసి జెడ్పీ సమావేశాల వీడియోలను ప్రదర్శించారు. ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ కరుటూరి నరసింహరావు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. -
మరో భూవివాదంలో ఎమ్మెల్యే బోండా
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అక్రమాల పుట్ట రోజుకొకటి బయట పడుతున్నాయి. గతంలో విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేయడంపై పెద్ద దుమారమే రేగింది. అనంతరం ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలు మరువకముందే.. తాజాగా మరో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. స్థానిక సబ్బరాయనగర్ వెంచర్లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితులు చెబుతున్నారు. కానీ ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు నగర సీపీకి ఫిర్యాదు చేశాడు. -
తోడు కోసం తోరణం
సూచౌను దాటాక, ఎత్తయిన నీలపు కొండలకూ, వైషాన్ సరస్సుకూ మధ్య ఒక చిన్న గ్రామముంది. పేరు హంచివాంగ్. ఆ ఊరి పురాతన వీధులలో రాళ్ల తోరణాలు కనబడతాయి. అవి సుగుణశీలలగు స్త్రీల జ్ఞాపక చిహ్నాలు. చిన్నప్పుడే భర్తను కోల్పోయి యావజ్జీవమతనికే అంకితమై మరి పెండ్లాడని వితంతువులను కీర్తించుటకీ తోరణాలు కట్టేవారు. ఇట్టివి కట్టాలంటే చక్రవర్తి అనుజ్ఞ కావాలి. ‘‘మైహువా, లోపలికిరా, ఎదిగినదానవు గుమ్మం దగ్గర నిలబడొచ్చా?’’ అంది వేన్సతి, తన కుమార్తెతో. డెబ్బై ఎనభై మంది సైనికులా వీధిన వెళ్తున్నారు. సైనికులకు చివర వస్తూవున్న కెప్టెన్ కొంచెం దూరంనుంచే మైహువాను చూశాడు. అతడు ముందుకు సాగుతూవుంటే ఆమె చిరునవ్వు నవ్వింది. ఆమె సుందరముఖాన్ని తలతిప్పి మరోసారి చూసి ముందుకు సాగాడతడు. ఒక దొంగల గుంపు సమీపాన్ని నీలపు కొండల్లో దాగుకొని చుట్టు పక్కల ప్రాంతాలపై దాడులు జరుపుతూవుంది. వాళ్లను పట్టుకోవడానికి ముప్పై మైళ్ల దూరానున్న సూచౌ నుంచి వచ్చిందీ సైన్యం. హంచివాంగ్ లాంటి చిన్న గ్రామంలో సైనికులనుంచడానికి ఇళ్లు తక్కువ. వాళ్లని దేవాలయాల్లో నిలిపి, ఆఫీసర్లు మాత్రం కాస్త నిద్రపోవడానికైనా వీలుండే ఇళ్లల్లో ఉంటారు. ఈ సంగతి మనస్సులో ఉండే, ఇల్లు గుర్తుపెట్టుకోడానికి కెప్టెన్ మరోసారి చూశాడు మైహువా వైపు. సైనికుల కేర్పాట్లు చేసి, మధ్యాహ్నం వాళ్లింటికొచ్చాడు కెప్టెన్. అతని పేరు లీ సంగ్. ఇంట్లో మైహువా తల్లి, నానమ్మ ఉన్నారు. ఇద్దరూ వితంతువులే. నానమ్మ ముఖం ముడతలు పడింది. నల్లని ముఖముల్ గుడ్డ తలకు కట్టుకొంది. వేన్సతి ముప్పైయేళ్లది. అందం ఏమీ తగ్గలేదు. సన్నగా పొడుగ్గా ఉంది. మైహువా రూపానికి మెరుగుపెట్టి కొంచెం శాంతం అద్దితే ఎట్లుంటుందో అట్లుంది. ఆమెలో ఉద్రేకాగ్ని అరిపోలేదు కాని అణిగివుంది. ఆమె ముఖం మీద ముసుగువుంది. మూడుతరాల ఆడవాళ్లున్న ఆ ఇంట్లోకి పరాయి మగవాణ్ని రానివ్వడం ఎన్నడూ జరగనిదే. కానీ అతడు సంస్కారిలా కనిపించాడు. ‘నా భోజనం బరువు మీకక్కర లేదు. కాస్త స్నానానికీ పరుండటానికీ స్థలం ఇస్తే చాలు. ఎప్పుడైనా టీ ఇస్తే ఇవ్వండి’ అన్నాడు. అతణ్ణి చూసేసరికి వితంతువు లిద్దరికీ మైహువాకు తగిన వరుడనిపించింది. ‘ఇది నీ హోదాకు తగిన ఇల్లు కాదు. కాని నీ కిష్టమైతే ఉండొచ్చు’ అంది వేన్సతి. వెదురుమంచం ముందున్న వసారాలో వేసి, పెరటి వైపు కూతురూ తల్లీ పడుకోవచ్చు. ఇంట్లో ముసలమ్మ ఉండటం వల్ల పుకార్లకు అవకాశం లేదు. కెప్టెన్ లీ సంగ్ రాకతో వారింట్లో మార్పు కలిగింది. ఆ వితంతువుల ఇంట్లోకి ఎన్నాళ్లనుండో లేని మగవాని కంఠాన్నీ మారుమోగే నవ్వునూ తెచ్చిపెట్టాడు. ఒకసారి హాలులోని చిన్న అలమారాలో కావ్యాలు, పురాణాలు చూశాడు సంగ్. ఆడవాళ్లు చదవగలిగినవి కావు. కొన్ని పిల్లల పుస్తకాలున్నాయి. ‘మీ వద్ద మంచి గ్రంథాలయం ఉందే’ అన్నాడు సంగ్. ‘ఇవి నా భర్తవి’ అని చెప్పింది వేన్సతి. ‘ఈ పిల్లల పుస్తకాలేంటి? పిల్లలు లేని యీ ఇంట్లో ఇంత బాల సాహిత్యం ఉందేమిటి?’ అన్నాడు కెప్టెన్. వేన్సతి సిగ్గుపడింది. పెద్దగా చదువుకోకపోయినా పిల్లలకు చదువు చెబుతుందామె. స్త్రీ ధర్మములు, కుటుంబ గౌరవం లాంటి పుస్తకాల ప్రతులూ ఉన్నాయి. ఆడపిల్లలు మంచి కోడళ్లుగా సంచరించడానికి కావలసిన నైతిక బోధన కూడా ఆమె చేస్తుంది. ‘ఆడదానికి తల్లిగా, భార్యగా, తోబుట్టువుగా, కూతురుగా, ప్రవర్తించడంలో ప్రధాన విషయాలు తెలిస్తే చాలు’ అని చెప్పింది. ఆ ఊరిలో ఆమెకొక గౌరవ స్థానం ఉంది. ఊళ్లో ఒక్క హ్యూ కుటుంబం వారికే పవిత్ర స్మృతి చిహ్నం ఉంది. అలాంటి పవిత్ర తోరణం ఎత్తించాలని వేన్ వంశీయులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటికి వెనుక కాయగూరల తోట ఉంది. వేన్సతి, కెప్టెన్ అందులో తిరుగుతున్నారు. కొన్ని ఫలవృక్షాలు, కొన్ని పూలమొక్కలు అందులో ఉన్నాయి. తూర్పు వైపు గేటు. దాని పక్క చిన్నగది. అది తోటమాలికి. పేరు చాంగ్. నలభై ఏళ్లుంటాయి. కండలు తీరిన దేహం. తల వెంట్రుకలు పైకి ఎగగట్టాడు. తోటంతా అతడే పెంచుతాడు. దోసకాయలు, పుచ్చకాయలు, కాబేజీలు ఎక్కువగావుంటే బజారుకు వెళ్లి అమ్ముకొస్తాడు. నూతి దగ్గరికి వెళ్లి చాంగ్ ఒక బాల్చీడు నీరు తోడి, గుమ్మడి డొలకతో తాగి, తక్కింది చేతుల మీద పోసుకుని కడుక్కున్నాడు. నీళ్లు తాగుతున్నప్పుడు అతని కంఠం మీద యెండ తళతళ మెరిసేసరికి వేన్సతి పెదవులు వణికాయి. ‘ఇతడు లేకపోతే మేం ఏమైపోయేవాళ్లమో? కడుపుకు తిండి, పరుండటానికి ఇంత స్థలం ఉంటే చాలు. ఇంత కష్టపని పనిచేయడం నేనెక్కడా చూడలేదు’ అని చెప్పింది వేన్సతి. మరోరోజు కెప్టెన్ తోటలోకి వెళ్లేసరికి చాంగ్ కోళ్లదొడ్డి రాటలు పాతుతున్నాడు. ‘ముసలమ్మగారి యిరవయ్యో యేట ఆమె భర్త పోయారు. ఆమె కొక్కడే కొడుకు. ఆయనకు మా అమ్మగారిని పెళ్లిచేశారు. ఆయన ఒకనాడు తల దువ్వుకొంటూనే నేలమీదపడి మరణించారు. పద్దెనిమిదవ యేట అమ్మగారు విధవ అయ్యారు. అప్పటికామె గర్భిణి. అలాంటి వయస్సులో యావజ్జీవ వైధవ్యమా? అయినా అమ్మగారిక పెళ్లాడనన్నారు. ముసలమ్మగారప్పుడే నలభై యేండ్ల నుండి వైధవ్యం పాలిస్తూవున్నారు. వీరిద్దరి పేరుమీదా ఒక శిలాతోరణం కట్టించడానికి చక్రవర్తికి విన్నపం చేస్తారట’ చెప్పాడు చాంగ్. రోజులు గడుస్తున్నాయి. దొంగల్ని పట్టడంలోకంటే మైహువాను పట్టడంలోనే కెప్టెన్ ఆసక్తి చూపుతున్నాడు. ‘మీ అమ్మ అంటే నీకు గర్వం లేదా’ అడిగాడో మారు సంగ్. ‘స్త్రీ ఎవరినన్నా పెండ్లాడి కాపురం చెయ్యాలి కాని ఇలా కాదు’ అంది మైహువా. కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. ‘పవిత్ర వితంతువంటే ఎక్కడలేని ఖ్యాతిగదా! మా అమ్మకా ఖ్యాతి కావాలి’ అంది. ఓసారి, ‘అమ్మా నువ్వింకా చిన్నదానవే కదా, ఎందుకు పెళ్లాడకూడదు?’ అంది మైహువా. వేన్సతికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘నీ నోరు పడిపోను, సిగ్గూ ఎగ్గూ లేదటే’ అని శపించింది కూతుర్ని. వేన్సతి జీవితం ఉన్నట్టుండి మారిపోయింది. ఊహించినట్టే కెప్టెన్, మైహువా వివాహం జరిగింది. మూడు నెలల తర్వాత ముసలమ్మ మరణించింది. ముసలమ్మకూ వేన్సతికీ శిలా తోరణాలు కట్టాలని రాజగురువు చేసిన సిఫారసుకు చక్రవర్తి అంగీకరించాడు. వేన్ వంశీయులంతా ఉత్సాహంగా ఉన్నారు. ‘పవిత్ర మాత’లనే మహా గౌరవపదం వాడేస్తున్నారు. ‘ఒక ఇల్లు, ఇద్దరు పవిత్రులు’ అని రాయబడిన పరదాను మేజిస్ట్రేటు బహుమతిగా పంపాడు. మొన్నటిదాకా అత్త, కూతురు, అల్లుడు ఇంటిని నవ్వులతో నింపేవారు. భవిష్యత్తులోకి తొంగి చూడటానికి వేన్సతికి భయమేసింది. తోరణం తాలూకూ వెయ్యి రూపాయలు కూడా మంజూరైనాయి. ఇక ఆమె ప్రఖ్యాత స్త్రీ కాబోతోంది. ‘ఖ్యాతితో ఏకాంతవాసం మరో ఇరవై సంవత్సరాలు’ అనిపించసాగింది. అప్పుడప్పుడు మానుపిల్లులు కొండల్లోంచి కోళ్లకోసం వస్తుంటాయి. ‘కోళ్లగూడు పిల్లులు జొరబడకుండా కప్పెయ్యి’ అంది వేన్సతి. ‘నేను చూసుకుంటాను’ అన్నాడు చాంగ్. ఒకరోజు అర్ధరాత్రి ఓ కోడి పూలమొక్కల మీద పడివుంది. తన అశ్రద్ధకు చాంగ్ నొచ్చుకున్నాడు. కానీ ఆమె దయతో, ‘దీంట్లో పోయిందేముంది? రేపు దీన్ని కూర వండుతాను’ అంది. మరునాడు కూర వడ్డిస్తూ, ‘మళ్లీ ఈ రాత్రి కూడా పిల్లి వస్తుందేమో’ అంది వేన్సతి. ‘మీకెలా తెలుసు’ అన్నాడు చాంగ్. ‘నిన్న రాత్రి దానికి కావలసింది దొరకలేదు. జడుసుకొని దొరికిన కోడిపిల్లనే పారేసింది. దానికి కోడి కావాలి. అది ఎక్కడ పడివుందో దానికి తెలుసు. తెలివైందైతే ఈ రాత్రి కూడా రావాలికదా’ అంది. ముసలమ్మకూ వేన్సతికీ శిలా తోరణాలు కట్టాలని రాజగురువు చేసిన సిఫారసుకు చక్రవర్తి అంగీకరించాడు. వేన్ వంశీయులంతా ఉత్సాహంగా ఉన్నారు. ‘పవిత్ర మాత’లనే మహా గౌరవపదం వాడేస్తున్నారు. తోరణం తాలూకూ వెయ్యి రూపాయలు కూడా మంజూరైనాయి. -
పోలీసు కస్టడీకి ఐసిస్ సానుభూతిపరుడు
హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరుడు, కృష్ణ జిల్లాకు చెందిన సుబ్రమణ్యం అలియాస్ ఒమర్ ను విచారించేందుకు సిట్ పోలీసులు ఏడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఆయన 14 రోజుల రిమాండ్ఽలో ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే సమాచారం మేరకు ఈనెల 23న టోలిచౌక్ వద్ద సిట్ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. సుబ్రమణ్యం డిగ్రీ చదువుతున్న సమయంలో ముస్లిం స్నేహితుల స్పూర్తితో మతం మార్పిడి చేసుకుని గుజరాత్ నుంచి వచ్చిన మత ప్రచారకులతో కలిసి వెళ్లిపోయాడు. సిద్దాపూర్లో మదర్సాలో చేరి సుమారు తొమ్మిది నెలలపాటు మత గ్రంథాలను అధ్యయంన చేశాడు. కొన్ని రోజుల తర్వాత తన స్వగ్రామం వెళ్లి తండ్రితో గొడవపడి బాలనగర్లో సోడా వ్యాపారం చేశాడు. ఐసిస్ చీఫ్ అబూ ఖలీఫా ఆల్ హింద్ ఆదేశాల మేరకు దేశంలో వివిధ ప్రాంతాల్లో కుట్రపన్నాడు. సాంఘిక మాధ్యమాల ద్వారా ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తూ రెండు సంవత్సరాల్లో సుమారు ఐదువేల మందితో మాట్లాడాడు. ఇరాక్, ఇరాన్, దుబాయ్ వంటి ఇతర దేశాలలో ఉండే ఉగ్రవాదులతో నేరుగా మాట్లాడేవాడు. కృష్ణా జిల్లా తదితర ప్రాంతాల్లో ఉన్న అతని స్నేహితులపై పోలీసులు అరా తీస్తున్నారు. -
అనంత అభివృద్ధికి రహదారుల నిర్మాణమే కీలకం
అనంతపురం సిటీ : అనంత అభివద్ధికి రహదారుల నిర్మాణం కీలకమని ఆర్అండ్బి ఎస్ఈ సుబ్రమణ్యం తెలిపారు. రాష్ట్రంలోనే జాతీయ రహదారులు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇదేనన్నారు. జిల్లాలో 250 కిలో మీటర్లు మేర జాతీయ రహదారుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. 125 కిలో మీటర్లు పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. మిగిలిన 125 కిలో మీటర్లు రహదారుల నిర్మాణపు పనులను డిసెంబరులో ప్రారంభిస్తామన్నారు. ఈ పనులు పెనుకొండ నుంచి రొద్దం, గోరంట్ల నుంచి ఓడీ చెర్వు, ఎన్ఎస్ గేటు నుంచి పేరూరుల మధ్య జరుగుతున్నాయని తెలిపారు. అలాగే బళ్లారి – గుత్తి పట్టణాలను అనుబంధంగా సాగుతున్న రహదారుల పనులు రూ.500 కోట్లు, మదనపల్లి రహదారి పనులు రూ.300 కోట్లు, బళ్లారి – అనంతపురం మధ్య జరుగుతున్న రోడ్డు నిర్మాణాల పనులు రూ.350 కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు. -
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కుప్పం: చిత్తూరు జిల్లాలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుప్పం మండలం వసనాడు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(30) అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతోనే సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. -
’లలిత్ మోదీకి దావూద్‌తో సన్నిహిత సంబంధాలు’
-
ఒక్క బెడ్‌కు ముగ్గురు రోగులా..!
శాలిబండ(హైదరాబాద్): ఒక్క బెడ్‌పై ముగ్గురు చొప్పున రోగులు చికిత్స పొందుతుండటం చూసి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యదర్శి జస్టిస్ డి. సుబ్రమణ్యం నివ్వెరపోయారు. ఈ పరిస్థితికి కారణాలేంటని అధికారులను ప్రశ్నించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం నగరంలోని పేట్లబురుజు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. జస్టిస్ డి. సుబ్రమణ్యం శనివారం పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న సేవలపై రోగుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. వార్డులోని ఒక బెడ్‌పై ముగ్గురు చొప్పున రోగులు కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఆస్పత్రి పరిపాలన విభాగం చూసుకునేందుకు ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను నియమించాలని సూచించారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
నెల్లూరు(చిల్లకూరు): చిల్లకూరు మండలం తిక్కవరం సమీపంలోని గిరిజన కాలనీ వద్ద తుపాకుల చిన సుబ్రహ్మణ్యం(40) అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేదమే జీవననాదం
వేదమే జీవననాదం వారికి. కాన్వెంటుల్లో చదువు ‘కొన’లేని వారు కొందరైతే, చతుర్వేదాలే చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి కలిగిస్తాయని వేద పాఠశాలలో చేరిన వారు మరికొందరు. ‘కుల వృత్తికి సాటి రావు గువ్వల చెన్న..’ అన్న పెద్దల మాటలే వేదంగా భావించి వేద పాఠశాలలో చేరినవారు మరికొందరు. వేదమంత్రాలను సుస్వరంతో వల్లె వేస్తూనే, ఇంగ్లిష్ పదాలతోనూ కుస్తీ పడుతున్నారు. ఆధునికతను అందిపుచ్చుకుంటూ కంప్యూటర్‌తో దోస్తీ చేస్తున్నారు. కీసరగుట్టలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర సంస్కృత వేద పాఠశాల తమ విద్యార్థులను ఎందులోనూ తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతోంది. ఒకప్పుడు గురుకులాలు సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేవి. విద్యార్థులకు వేదవేదాంగాలు బోధించి ధర్మాన్ని నడిపే సారథులుగా తీర్చిదిద్దేవి. ఇప్పుడు కాలం మారింది. వేద విద్యార్థులు నేటి సమాజంలో బతకాలంటే ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అందుకే, ఈ కాలానికి తగినట్లుగా ఇక్కడి విద్యార్థులకు ప్రతిరోజూ ఇంగ్లిష్, కంప్యూటర్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటిలో పరీక్షలూ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఈ ట్రెండ్ పదేళ్ల కిందటే మొదలైంది. బ్రహ్మ ముహూర్తంతోనే దినచర్య బ్రహ్మ ముహూర్తం నుంచే వేద విద్యార్థుల దినచర్య మొదలవుతుంది. స్నానాదులు ముగించుకుని, ఉదయం ఆరు గంటలకల్లా మధుర స్వరంతో సుప్రభాతం ఆలపిస్తారు. ప్రాతఃకాల సంధ్యా వందనం ముగించుకుని అల్పాహారం తీసుకుంటారు. తొమ్మిది గంటలకు ప్రార్థనలో శ్రీ వేంకటేశ్వరుని అష్టోత్తరంతో కీర్తించి తరగతుల్లోకి వెళ్తారు. మధ్యాహ్నం వరకు గురువు చెప్పిన వేద మంత్రాలను వల్లె వేస్తారు. మాధ్యాహ్నిక సంధ్యావందనం ముగించుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం తరగతుల్లో ఉదయం చెప్పిన మంత్రాలను ఆవృతం (పునశ్చరణ) చేసుకుంటారు. సాయం సంధ్యా వందనం.. రాత్రి సహస్రనామ అర్చనలో పాల్గొని ఆధ్యాత్మికతను సంతరించుకుంటారు. అనధ్యాయాలే సెలవుదినాలు సాధారణంగా విద్యార్థులకు ఆదివారాలు, రెండో శనివారాలు సెలవులు. వేద విద్యార్థులకు మాత్రం అనధ్యాయ దినాలైన పాఢ్యమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్యలే సెలవులు. ప్రతినెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే పాఢ్యమి, అష్టమి, పక్షానికొకటి వచ్చే అమావాస్య, పౌర్ణమి కలిపి నెలకు ఆరు రోజులు పాఠశాల ఉండదు. ఆ రోజుల్లో బట్టలు ఉతుక్కోవడం వంటి వ్యక్తిగత పనులు చూసుకుంటారు. పాత పాఠాలను కాసేపు పునశ్చరణ చేస్తారు. సెలవు రోజుల్లోనే కాదు, ప్రతిరోజూ సాయంత్రం 5-6 గంటల సమయంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలాడతారు. స్మార్త, ఆగమ, వేద విభాగాల్లో కోర్సులు ఐదో తరగతి పూర్తి చేసుకున్న వారు వేదపాఠశాలలో చేరడానికి అర్హులు. ఇక్కడి పాఠశాలలో వేద, స్మార్త, ఆగమ విభాగాలు ఉన్నాయి. స్మార్త, ఆగమ విద్యాభ్యాసానికి ఎనిమిదేళ్లు, వేదాధ్యయనానికి పదేళ్లు పడుతుంది. వేదం చదువుకున్న వారికి ఆలయాల్లో అర్చక ఉద్యోగాలు ఉంటాయి. స్మార్తంలో పట్టభద్రులైన వారు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగే షోడశ సంస్కారాలు (డోలారోహణం, కేశఖండనం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం వంటివి), వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు, కర్మకాండ వంటివి జరిపిస్తుంటారు. ఆగమ శాస్త్రాన్ని అభ్యసించిన వారు దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో నిష్ణాతులవుతారు. ఆలయ నిర్మాణం, వాస్తు, దేవుడికి జరిగే కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాల్లో వారి మాటే శిలాశాసనం. ఆదరణకు కొదవ లేదు వేద పాఠశాలలో చేరిన రోజునే వేద విభాగ విద్యార్థుల పేరిట రూ.3 లక్షలు, స్మార్త, ఆగమ విద్యార్థుల పేరిట రూ.లక్ష టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. విద్య పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ , టీటీడీ డాలర్ ప్రదానం చేస్తారు. డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకు ఆదరణ బాగానే ఉంటుంది. వేద పండితులు విదేశాల్లోనూ ’కొలువు‘దీరుతున్నారు. అక్కడి దేవాలయాల్లో ఇక్కడి నుంచి విద్యార్థులను తీసుకెళ్లి నియమించుకుంటున్నారు. కాలానికి తగినట్లుగా మార్పులతో విద్యార్థులు ముందుకెళ్తున్నారు. వేదం గొప్పతనం తెలిసింది : సుబ్రమణ్యం పోలీసు అవుదామనుకున్నా.. మా కుటుంబం బలవంతం మీదే వేద పాఠశాలలో చేరాను. ఇక్కడికొచ్చిన ఏడాదికే నా అభిప్రాయం తప్పని తెలిసింది. పోలీస్ ఉద్యోగంలోనైతే పరిమితమైన ప్రాంతానికే సేవ చే సే అవకాశముంటుంది. అదే వేద పండితుడిగా దైవానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే యావత్ సమాజానికి సేవ చేసినట్టే. వేదాల్లో మిగిలినవి కొన్ని మాత్రమే : దత్తు, తణుకు భాషలు, లిపులు అంతరించిపోతున్నట్లే, వేదాలు కూడా చాలావరకు అంతరించిపోతున్నాయి. అభ్యసించే వాళ్లే కాదు, బోధించేవాళ్లూ తగినంత మంది లేకపోవడమే దీనికి కారణం. రుగ్వేదంలో నిజానికి 21 శాఖలు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మిగిలినవి రెండే. యజుర్వేదంలో వంద శాఖలు ఉంటే, వాటిలోనూ రెండే మిగిలాయి. సామవేదంలో వెయ్యిశాఖలు ఉంటే, మూడే అందుబాటులో ఉన్నాయి. -
ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రాజీవ్ యువ కిరణాలు పథకం కింద కాంట్రాక్టు పద్ధతిపై లైవ్లీహుడ్ స్పెషలిస్టు, ఎంఐఎస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైవ్లీహుడ్ స్పెషలిస్టు పోస్టుకు పోస్టుగ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఎంఎస్ ఆఫీస్ తెలిసి, కమ్యూనిటీ డెవలప్మెంట్లో పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. ఎంఐఎస్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ (కంప్యూటర్స్), బీటెక్ (కంప్యూటర్స్), ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు 40 ఏళ్లకు మించి ఉండకూడదన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రాజెక్ట్ డెరైక్టర్ మెప్మా, రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
నిలోఫర్‌లో విభజన చిచ్చు
హైదరాబాద్, న్యూస్‌లైన్: నిలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో విభజన చిచ్చు రేగింది. ఉద్యోగులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ప్రాంతాలవారీగా చీలిపోయారు. 20 ఏళ్లుగా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సివిల్ సర్జన్(ఆర్ఎంవో-1) డాక్టర్ ఉషారాణిని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యాధికారులు సోమవారం నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యంను ఘెరావ్ చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ఆందోళనకు దిగారు. అవినీతికి పాల్పడుతున్న ఉషారాణిని తక్షణమే బదిలీ చేయించాలని, లేనిపక్షంలో సూపరింటెండెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లి పోవాలని సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చారు. సూపరింటెండెంట్ మౌనం పాటించడంతో తెలంగాణ వైద్యాధికారులు ఆయనను చుట్టుముట్టి బలవంతంగా రాజీనామా చేయిం చేందుకు యత్నించారు. అనంతరం ఆర్ఎంవో డాక్టర్ ఉషారాణిపై తెలంగాణ వైద్యాధికారులు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నువ్వు ఎక్కడ పుట్టావు.. ఇక్కడికెందుకు వచ్చావు... నీ వెనుక ఎవరున్నారంటూ నిలదీశారు. రాజీనామా చేస్తావా లేదా అంటూ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంను కుర్చీలోంచి లేపేందుకు వైద్యులు ప్రయత్నించారు. సుబ్రహ్మణ్యం లేవకపోవడంతో ఆయన కుర్చీని పక్కను తోసేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. డీఎంఈ పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో ఎంతోమంది అనుభవం కలిగిన వైద్యులు ఉన్నప్పటికీ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యంను నిలోఫర్ సూపరింటెండెంట్‌గా నియమించారని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు బొంగు రమేష్ ఆరోపించారు. సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం ఆర్ఎంవో డాక్టర్ ఉషారాణిని అడిగి సలహాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. 20 ఏళ్ల నుంచి ఆర్ఎంవోగా పనిచేస్తున్న ఉషారాణి టెండర్లు లేకుండా క్యాంటీన్‌ను తన అనుయాయులకు అప్పగించారని, క్యాంటీన్ నిర్వహణపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో తాను ఎలాంటి బెదిరింపులకూ భయపడనని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు. గిట్టని వారే అలజడులు సృష్టిస్తున్నారని, ఎవరో రాజీనామా చేయాలని కోరితే వెంటనే తెల్ల కాగితంపై సంతకం చేసే మనస్తత్వం తనది కాదని అన్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సివిల్ సర్జన్ (ఆర్ఎంవో-1) డాక్టర్ ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యాధికారులు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, రామ్‌సింగ్, శ్రీనివాస్, రమేష్, రవీందర్ గౌడ్, వినోద్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంను ఘోరావ్ చేసిన వారిలో ఉన్నారు. -
డింగ్ డాంగ్ 29th Sep 2013
-
డింగ్ డాంగ్ 21st Sep 2013
-
నేడు ధర్మవరపు సుబ్రమణ్యం జన్మదినం
-
ఆంద్రోపన్యాసకులు రీడర్ డా.అన్నదానం సుబ్రహ్మణ్యంతో సాక్షి వేదిక
-
డింగ్ డాంగ్ 15th Sep 2013
-
ఎల్లిమామ డింగ్ డాంగ్ 11th Sep 2013
-
డింగ్ డాంగ్ 28th Aug 2013
-
డింగ్ డాంగ్ 14th Aug 2013
-
డింగ్ డాంగ్ 10th Aug 2013
-
డింగ్ డాంగ్ 7th Aug 2013
-
డింగ్ డాంగ్ 27th July 2013
-
డింగ్ డాంగ్ 24th July 2013
-
డింగ్ డాంగ్ 20th July 2013
-
డింగ్ డాంగ్ 17th July 2013
-
డింగ్ డాంగ్ 13th July 2013
-
ఎల్లిమామ డింగ్ డాంగ్ 10th July 2013
-
డింగ్ డాంగ్ 6th July 2013
-
డింగ్ డాంగ్ 3rd July 2013