ఒక్క బెడ్‌పై ముగ్గురు చొప్పున రోగులు చికిత్స పొందుతుండటం చూసి మానవహక్కుల కమిషన్ కార్యదర్శి నివ్వెరపోయారు.
శాలిబండ(హైదరాబాద్): ఒక్క బెడ్‌పై ముగ్గురు చొప్పున రోగులు చికిత్స పొందుతుండటం చూసి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కార్యదర్శి జస్టిస్ డి. సుబ్రమణ్యం నివ్వెరపోయారు. ఈ పరిస్థితికి కారణాలేంటని అధికారులను ప్రశ్నించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం నగరంలోని పేట్లబురుజు ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
జస్టిస్ డి. సుబ్రమణ్యం శనివారం పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న సేవలపై రోగుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. వార్డులోని ఒక బెడ్‌పై ముగ్గురు చొప్పున రోగులు కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఆస్పత్రి పరిపాలన విభాగం చూసుకునేందుకు ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను నియమించాలని సూచించారు.