సూచౌను దాటాక, ఎత్తయిన నీలపు కొండలకూ, వైషాన్ సరస్సుకూ మధ్య ఒక చిన్న గ్రామముంది. పేరు హంచివాంగ్. ఆ ఊరి పురాతన వీధులలో రాళ్ల తోరణాలు కనబడతాయి. అవి సుగుణశీలలగు స్త్రీల జ్ఞాపక చిహ్నాలు. చిన్నప్పుడే భర్తను కోల్పోయి యావజ్జీవమతనికే అంకితమై మరి పెండ్లాడని వితంతువులను కీర్తించుటకీ తోరణాలు కట్టేవారు. ఇట్టివి కట్టాలంటే చక్రవర్తి అనుజ్ఞ కావాలి.
‘‘మైహువా, లోపలికిరా, ఎదిగినదానవు గుమ్మం దగ్గర నిలబడొచ్చా?’’ అంది వేన్‌సతి, తన కుమార్తెతో. డెబ్బై ఎనభై మంది సైనికులా వీధిన వెళ్తున్నారు. సైనికులకు చివర వస్తూవున్న కెప్టెన్ కొంచెం దూరంనుంచే మైహువాను చూశాడు. అతడు ముందుకు సాగుతూవుంటే ఆమె చిరునవ్వు నవ్వింది. ఆమె సుందరముఖాన్ని తలతిప్పి మరోసారి చూసి ముందుకు సాగాడతడు.
ఒక దొంగల గుంపు సమీపాన్ని నీలపు కొండల్లో దాగుకొని చుట్టు పక్కల ప్రాంతాలపై దాడులు జరుపుతూవుంది. వాళ్లను పట్టుకోవడానికి ముప్పై మైళ్ల దూరానున్న సూచౌ నుంచి వచ్చిందీ సైన్యం. హంచివాంగ్ లాంటి చిన్న గ్రామంలో సైనికులనుంచడానికి ఇళ్లు తక్కువ. వాళ్లని దేవాలయాల్లో నిలిపి, ఆఫీసర్లు మాత్రం కాస్త నిద్రపోవడానికైనా వీలుండే ఇళ్లల్లో ఉంటారు. ఈ సంగతి మనస్సులో ఉండే, ఇల్లు గుర్తుపెట్టుకోడానికి కెప్టెన్ మరోసారి చూశాడు మైహువా వైపు.
సైనికుల కేర్పాట్లు చేసి, మధ్యాహ్నం వాళ్లింటికొచ్చాడు కెప్టెన్. అతని పేరు లీ సంగ్. ఇంట్లో మైహువా తల్లి, నానమ్మ ఉన్నారు. ఇద్దరూ వితంతువులే. నానమ్మ ముఖం ముడతలు పడింది. నల్లని ముఖముల్ గుడ్డ తలకు కట్టుకొంది. వేన్‌సతి ముప్పైయేళ్లది. అందం ఏమీ తగ్గలేదు. సన్నగా పొడుగ్గా ఉంది. మైహువా రూపానికి మెరుగుపెట్టి కొంచెం శాంతం అద్దితే ఎట్లుంటుందో అట్లుంది. ఆమెలో ఉద్రేకాగ్ని అరిపోలేదు కాని అణిగివుంది. ఆమె ముఖం మీద ముసుగువుంది.
మూడుతరాల ఆడవాళ్లున్న ఆ ఇంట్లోకి పరాయి మగవాణ్ని రానివ్వడం ఎన్నడూ జరగనిదే. కానీ అతడు సంస్కారిలా కనిపించాడు. ‘నా భోజనం బరువు మీకక్కర లేదు. కాస్త స్నానానికీ పరుండటానికీ స్థలం ఇస్తే చాలు. ఎప్పుడైనా టీ ఇస్తే ఇవ్వండి’ అన్నాడు. అతణ్ణి చూసేసరికి వితంతువు లిద్దరికీ మైహువాకు తగిన వరుడనిపించింది. ‘ఇది నీ హోదాకు తగిన ఇల్లు కాదు. కాని నీ కిష్టమైతే ఉండొచ్చు’ అంది వేన్‌సతి. వెదురుమంచం ముందున్న వసారాలో వేసి, పెరటి వైపు కూతురూ తల్లీ పడుకోవచ్చు. ఇంట్లో ముసలమ్మ ఉండటం వల్ల పుకార్లకు అవకాశం లేదు.
కెప్టెన్ లీ సంగ్ రాకతో వారింట్లో మార్పు కలిగింది. ఆ వితంతువుల ఇంట్లోకి ఎన్నాళ్లనుండో లేని మగవాని కంఠాన్నీ మారుమోగే నవ్వునూ తెచ్చిపెట్టాడు. ఒకసారి హాలులోని చిన్న అలమారాలో కావ్యాలు, పురాణాలు చూశాడు సంగ్. ఆడవాళ్లు చదవగలిగినవి కావు. కొన్ని పిల్లల పుస్తకాలున్నాయి. ‘మీ వద్ద మంచి గ్రంథాలయం ఉందే’ అన్నాడు సంగ్. ‘ఇవి నా భర్తవి’ అని చెప్పింది వేన్‌సతి. ‘ఈ పిల్లల పుస్తకాలేంటి? పిల్లలు లేని యీ ఇంట్లో ఇంత బాల సాహిత్యం ఉందేమిటి?’ అన్నాడు కెప్టెన్. వేన్‌సతి సిగ్గుపడింది.
పెద్దగా చదువుకోకపోయినా పిల్లలకు చదువు చెబుతుందామె. స్త్రీ ధర్మములు, కుటుంబ గౌరవం లాంటి పుస్తకాల ప్రతులూ ఉన్నాయి. ఆడపిల్లలు మంచి కోడళ్లుగా సంచరించడానికి కావలసిన నైతిక బోధన కూడా ఆమె చేస్తుంది. ‘ఆడదానికి తల్లిగా, భార్యగా, తోబుట్టువుగా, కూతురుగా, ప్రవర్తించడంలో ప్రధాన విషయాలు తెలిస్తే చాలు’ అని చెప్పింది. ఆ ఊరిలో ఆమెకొక గౌరవ స్థానం ఉంది. ఊళ్లో ఒక్క హ్యూ కుటుంబం వారికే పవిత్ర స్మృతి చిహ్నం ఉంది. అలాంటి పవిత్ర తోరణం ఎత్తించాలని వేన్ వంశీయులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంటికి వెనుక కాయగూరల తోట ఉంది. వేన్‌సతి, కెప్టెన్ అందులో తిరుగుతున్నారు. కొన్ని ఫలవృక్షాలు, కొన్ని పూలమొక్కలు అందులో ఉన్నాయి. తూర్పు వైపు గేటు. దాని పక్క చిన్నగది. అది తోటమాలికి. పేరు చాంగ్. నలభై ఏళ్లుంటాయి. కండలు తీరిన దేహం. తల వెంట్రుకలు పైకి ఎగగట్టాడు. తోటంతా అతడే పెంచుతాడు. దోసకాయలు, పుచ్చకాయలు, కాబేజీలు ఎక్కువగావుంటే బజారుకు వెళ్లి అమ్ముకొస్తాడు. నూతి దగ్గరికి వెళ్లి చాంగ్ ఒక బాల్చీడు నీరు తోడి, గుమ్మడి డొలకతో తాగి, తక్కింది చేతుల మీద పోసుకుని కడుక్కున్నాడు. నీళ్లు తాగుతున్నప్పుడు అతని కంఠం మీద యెండ తళతళ మెరిసేసరికి వేన్‌సతి పెదవులు వణికాయి. ‘ఇతడు లేకపోతే మేం ఏమైపోయేవాళ్లమో? కడుపుకు తిండి, పరుండటానికి ఇంత స్థలం ఉంటే చాలు. ఇంత కష్టపని పనిచేయడం నేనెక్కడా చూడలేదు’ అని చెప్పింది వేన్‌సతి.
మరోరోజు కెప్టెన్ తోటలోకి వెళ్లేసరికి చాంగ్ కోళ్లదొడ్డి రాటలు పాతుతున్నాడు. ‘ముసలమ్మగారి యిరవయ్యో యేట ఆమె భర్త పోయారు. ఆమె కొక్కడే కొడుకు. ఆయనకు మా అమ్మగారిని పెళ్లిచేశారు. ఆయన ఒకనాడు తల దువ్వుకొంటూనే నేలమీదపడి మరణించారు. పద్దెనిమిదవ యేట అమ్మగారు విధవ అయ్యారు. అప్పటికామె గర్భిణి. అలాంటి వయస్సులో యావజ్జీవ వైధవ్యమా? అయినా అమ్మగారిక పెళ్లాడనన్నారు. ముసలమ్మగారప్పుడే నలభై యేండ్ల నుండి వైధవ్యం పాలిస్తూవున్నారు. వీరిద్దరి పేరుమీదా ఒక శిలాతోరణం కట్టించడానికి చక్రవర్తికి విన్నపం చేస్తారట’ చెప్పాడు చాంగ్.
రోజులు గడుస్తున్నాయి. దొంగల్ని పట్టడంలోకంటే మైహువాను పట్టడంలోనే కెప్టెన్ ఆసక్తి చూపుతున్నాడు. ‘మీ అమ్మ అంటే నీకు గర్వం లేదా’ అడిగాడో మారు సంగ్. ‘స్త్రీ ఎవరినన్నా పెండ్లాడి కాపురం చెయ్యాలి కాని ఇలా కాదు’ అంది మైహువా. కెప్టెన్ ఆశ్చర్యపోయాడు. ‘పవిత్ర వితంతువంటే ఎక్కడలేని ఖ్యాతిగదా! మా అమ్మకా ఖ్యాతి కావాలి’ అంది. ఓసారి, ‘అమ్మా నువ్వింకా చిన్నదానవే కదా, ఎందుకు పెళ్లాడకూడదు?’ అంది మైహువా. వేన్‌సతికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘నీ నోరు పడిపోను, సిగ్గూ ఎగ్గూ లేదటే’ అని శపించింది కూతుర్ని.
వేన్‌సతి జీవితం ఉన్నట్టుండి మారిపోయింది. ఊహించినట్టే కెప్టెన్, మైహువా వివాహం జరిగింది. మూడు నెలల తర్వాత ముసలమ్మ మరణించింది. ముసలమ్మకూ వేన్‌సతికీ శిలా తోరణాలు కట్టాలని రాజగురువు చేసిన సిఫారసుకు చక్రవర్తి అంగీకరించాడు. వేన్ వంశీయులంతా ఉత్సాహంగా ఉన్నారు. ‘పవిత్ర మాత’లనే మహా గౌరవపదం వాడేస్తున్నారు. ‘ఒక ఇల్లు, ఇద్దరు పవిత్రులు’ అని రాయబడిన పరదాను మేజిస్ట్రేటు బహుమతిగా పంపాడు. మొన్నటిదాకా అత్త, కూతురు, అల్లుడు ఇంటిని నవ్వులతో నింపేవారు. భవిష్యత్తులోకి తొంగి చూడటానికి వేన్‌సతికి భయమేసింది. తోరణం తాలూకూ వెయ్యి రూపాయలు కూడా మంజూరైనాయి. ఇక ఆమె ప్రఖ్యాత స్త్రీ కాబోతోంది. ‘ఖ్యాతితో ఏకాంతవాసం మరో ఇరవై సంవత్సరాలు’ అనిపించసాగింది.
అప్పుడప్పుడు మానుపిల్లులు కొండల్లోంచి కోళ్లకోసం వస్తుంటాయి. ‘కోళ్లగూడు పిల్లులు జొరబడకుండా కప్పెయ్యి’ అంది వేన్‌సతి. ‘నేను చూసుకుంటాను’ అన్నాడు చాంగ్. ఒకరోజు అర్ధరాత్రి ఓ కోడి పూలమొక్కల మీద పడివుంది. తన అశ్రద్ధకు చాంగ్ నొచ్చుకున్నాడు. కానీ ఆమె దయతో, ‘దీంట్లో పోయిందేముంది? రేపు దీన్ని కూర వండుతాను’ అంది.
మరునాడు కూర వడ్డిస్తూ, ‘మళ్లీ ఈ రాత్రి కూడా పిల్లి వస్తుందేమో’ అంది వేన్‌సతి. ‘మీకెలా తెలుసు’ అన్నాడు చాంగ్. ‘నిన్న రాత్రి దానికి కావలసింది దొరకలేదు. జడుసుకొని దొరికిన కోడిపిల్లనే పారేసింది. దానికి కోడి కావాలి. అది ఎక్కడ పడివుందో దానికి తెలుసు. తెలివైందైతే ఈ రాత్రి కూడా రావాలికదా’ అంది.
ముసలమ్మకూ వేన్‌సతికీ శిలా తోరణాలు కట్టాలని రాజగురువు చేసిన సిఫారసుకు చక్రవర్తి అంగీకరించాడు. వేన్ వంశీయులంతా ఉత్సాహంగా ఉన్నారు. ‘పవిత్ర మాత’లనే మహా గౌరవపదం వాడేస్తున్నారు. తోరణం తాలూకూ వెయ్యి రూపాయలు కూడా మంజూరైనాయి.
Comments
Please login to add a commentAdd a comment