కుప్పం: చిత్తూరు జిల్లాలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుప్పం మండలం వసనాడు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(30) అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతోనే సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.