auto driver suicide
-
ఆర్థిక ఇబ్బందులతో ఆటో కార్మికుడి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం : మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే కొండన్న(36) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
భార్య కోపగించుకుందని... నెల్లూరు(క్రైమ్) : భార్య కోపగించుకుందని మనస్థాపంతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు...కిసాన్‌నగర్ అరవిందానగర్కు చెందిన పి. దుర్గాప్రసాద్ (29)కు తొమ్మిది నెలలు కిందట ఉదయగిరికి చెందిన శారద అలియాస్ చరితతో వివాహమైంది. వివాహానంతరం దుర్గాప్రసాద్ జాకీర్‌హుస్సేన్‌నగర్‌లో కాపురం పెట్టారు. ఆటో నడపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి దుర్గాప్రసాద్ తీవ్ర ఉద్వేగానికి లోనైయ్యేవాడు. ఈ విషయమై పలుమార్లు దంపతుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. గొడవ పడిన కొద్దిసేపటికి ఇద్దరూ మళ్లీ కలిసి పోయేవారు. రోజు అత్త, మామలతో గంటపాటు సరదాగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవాడు. దీపావళి పండగకు భార్యతో కలిసి దుర్గాప్రసాద్ ఉదయగిరిలోని అత్తవారింటికి వెళ్లాడు. రెండు రోజులు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో శారదను తమాషాగా గిచ్చడంతో ఆమె కోపడింది. తినే అన్నం ప్లేటును విసిరికొట్టింది. దీంతో మనస్థాపానికి గురైన దుర్గాప్రసాద్ ఎవరికి చెప్పా పెట్టకుండా ఈ నెల 1వ తేదీ నెల్లూరుకు వచ్చేశాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. 2వ తేదీ మైపాడుగేటు సమీపంలోని ఆటోస్టాండ్ వద్ద సహచర ఆటోడ్రైవర్లతో బాగా పొద్దుపోయే వరకు గడిపాడు. తన స్నేహితుడైన అరుణ్‌కుమార్‌కు గురువారం బాడుగ ఉందని ఉదయం 7 గంటలకు వస్తానని చెప్పి వెళ్లాడు. రాత్రి భార్యతో చాలాసేపు ఫోనులో మాట్లాడారు. అనంతరం ఇంట్లోని శ్లాబుకు ఉన్న కొక్కీకి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం దుర్గాప్రసాద్ ఎంతకి రాకపోవడంతో అరుణ్‌కుమార్ అతని ఇంటి వద్దకు వెళ్లాడు. తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపల నుంచి గడియపెట్టి ఉంది. దుర్గాప్రసాద్‌ను పిలిచినా లోపలి నుంచి ఎలాంటి శబ్ధం లేకపోవడంతో కిటికీలోనుంచి చూడగా కొక్కీకి దుర్గాప్రసాద్ వేలాడుతూ కనిపించాడు. దీంతో దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు, రెండో నగర పోలీసులకు సమాచారం అందించారు. రెండో నగర ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణారెడ్డి, ఎస్ఐ తిరుపతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి మృతదేహాన్ని కిందకు దించారు. దుర్గాప్రసాద్ మృతి విషయం తెలుసుకున్న భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరుకు చేరుకుంది. భర్త మృతదేహాన్ని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బా«ధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెండో నగర ఎస్ఐ తిరుపతయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ఏటూరు నాగారం: వరంగల్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘన్పూర్ గ్రామానికి చెందిన అబ్దుల్లా తన వ్యక్తి ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కుప్పం: చిత్తూరు జిల్లాలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుప్పం మండలం వసనాడు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(30) అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతోనే సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. -
భార్య కేసు పెట్టిందని ఆత్మహత్య...
ఉప్పల్ : భార్య కేసు పెట్టడంతో మనస్తాపం చెంది ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... రామంతాపూర్ రాంరెడ్డినగర్‌కు చెందిన దుర్గా వినోద్(25) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం సౌజన్యతో అతనికి వివాహమైంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లి నల్లకుంట పోలీస్ స్టేషన్లో భర్త వే ధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ ఈనెల 17న కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఇదిలాఉండగా.. వినోద్ బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ దొరికింది. అందులో డబ్బు లేదని అత్తింటివారు నన్ను చిన్న చూపు చూసేవారు. నా భార్యతో వేధింపుల కేసు పెట్టించారు. అంతేకాకుండా వేరేవారితో నాకు వివాహేతర సంబంధం అంటకట్టారు’. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా’... అని రాసి ఉంది. అత్తింటి వారి వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని వినోద్ తల్లి బాలమణి ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.