బుక్కరాయసముద్రం : మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే కొండన్న(36) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక శనివారం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.