ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Invitation to apply for jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Published Sun, Dec 1 2013 2:07 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Invitation to apply for jobs

 మోమిన్‌పేట, న్యూస్‌లైన్:  పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రాజీవ్ యువ కిరణాలు పథకం కింద కాంట్రాక్టు పద్ధతిపై లైవ్లీహుడ్ స్పెషలిస్టు, ఎంఐఎస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ సుబ్రహ్మణ్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

లైవ్లీహుడ్ స్పెషలిస్టు పోస్టుకు పోస్టుగ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఎంఎస్ ఆఫీస్ తెలిసి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో పనిచేసిన అనుభవం ఉండాలన్నారు. ఎంఐఎస్ అసిస్టెంట్ పోస్టుకు బీఎస్సీ (కంప్యూటర్స్), బీటెక్ (కంప్యూటర్స్), ఎంసీఏ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు 40 ఏళ్లకు మించి ఉండకూడదన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు  పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రాజెక్ట్ డెరైక్టర్ మెప్మా, రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement