
రేవంత్‌కు టీడీపీ ఎమ్మెల్యేల ఆలింగనాలు
హైదరాబాద్: ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి అనుమతితో ఓటేసేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చిన రేవంత్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు స్వాగతించి ఆలింగనాలు చేసుకున్నారు. అంతా కలిసి పోలింగ్‌కు హాల్లోకి వెళ్లారు. రేవ ంత్ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. ఆయన వెంటనే ఓటేయకుండా రెండు గంటల పాటు అసెంబ్లీ లోపలే గడపడంతో ఉప ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అభ్యర్ధి కడియం శ్రీహరి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
దాంతో ఓటేసి వెంటనే వెళ్లిపోవాల్సిందిగా వారు రేవంత్‌కు సూచించారు. ఏసీబీ కేసులో రేవంత్‌కు బెయిల్ కోసం కోర్టులో పిటషన్ వేసినందున అది వస్తుందో రాదో తేలేదాకా ఎదురు చూసేందుకే జాగు చేసినట్లు చెబుతున్నారు. ఓటేశాక ఏసీబీ అధికారులు ఆయనను అసెంబ్లీ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.