embrace
-
ఆలిం‘ఘనం’ ఆత్మీయం
మనుష్యుల మధ్య మాటల కన్నా స్పర్శ ఎన్నో అనుభూతులను, ఎన్నో సంగతులను చెబుతుంది. భావోద్వేగాలను తెలియజేయడానికి కౌగిలి ఒక శక్తిమంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది. ప్రేమ, కృతజ్ఞతల నుంచి కోపం భయం వరకు స్పర్శ ద్వారా వ్యక్తీకరించబడిన భావోద్వేగాలను కౌగిలి, శబ్ద భాషకు మించిన సంబంధాన్ని పెంపొందిస్తుంది, అవగాహనను, సానుభూతిని ప్రోత్సహిస్తుంది.శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకొని రాజ్యానికి వెళ్లిపోతాడు. కణ్వమహర్షి తన కూతురిని, మనుమడిని శిష్యులతో దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు. శకుంతల నిండు కొలువులో తానెవరో చెప్తుంది. కానీ దుష్యంతుడు మాత్రం వారి వివాహాన్ని అంగీకరించడు. ‘నీ కొడుకును పరిష్వంగం చేసుకో... అపుడు నీ కొడుకు అవునో కాదో తెలుస్తుంది’ అని చెప్తుంది. అంటే పరిష్వంగంలోని శక్తి అదన్నమాట. దమయంతిని దూరం చేసుకొని నలుడు మారుపేరుతో, దేశదేశాలు తిరిగి ఋతుపర్ణ మహారాజు దగ్గర కాలం గడుపుతుండేవాడు. దమయంతి బాహుకుని పేరుతో ఉన్న నలుడిని గుర్తించాలని తనకు ద్వితీయ వివాహం జరుగుతున్నట్లు ఋతుపర్ణ మహారాజుకు చెప్పి పంపిస్తుంది. ఆ వివాహానికి ఋతుపర్ణ రాజు నలుడిని అంటే బాహుకుడిని తన రథసారథిగా చేసుకొని దమయంతి దగ్గరకు వస్తారు. బాహుకుని రూపంలో ఉన్న నలుని గుర్తించడానికి తన చెలికత్తె ద్వారా తన కూతురిని, కొడుకును వంటచేసుకొంటున్న బాహుకుడి దగ్గరకు పంపుతుంది. ఆ పిల్లలను చూడగానే బాహుకుడు చేతులు చాపి వారిని అక్కున చేర్చుకుంటాడు. కంటతడి పెడ్తాడు. తండ్రీ పిల్లల ముఖకవళికలను చూసి దమయంతి ఆ వంటవాడే తన భర్త నలుడని గుర్తిస్తుంది. పిల్లల పరిష్వంగంలోని శక్తి అది అన్నమాటే కదా.సీతమ్మ క్షేమవార్త చెప్పిన ఆంజనేయుడికి చేతులు చాపి గాఢ పరిష్వంగాన్ని రాముడు ఇచ్చాడు. లంకలో సీతమ్మను చూసి, రావణునిలో భయం కలిగించి, ధైర్యాన్ని సీతమ్మలో నింపి వచ్చిన హనుమకి ప్రాణ సముడవు అని చెప్పడానికి రెండు చేతులు చాపి కౌగిలించుకున్నాడు రాముడు. పరిష్వంగం ద్వారానే రాముడు తన కుమారులుగా లవకుశులను గుర్తించినట్లు కొన్ని రామాయాణాల్లో కనిపిస్తుంది.– ఆనంద‘మైత్రేయ’మ్ -
‘ఓయ్ పిల్లాడా ! ప్రియా వారియర్ కంటే..’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా వివిధ దేశాధినేతలను ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలి ఆలింగనంతో (బేర్ హగ్) చిత్తు చేస్తే, ఆయనకు విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రూపంలో ఆలింగనంలో పోటీ ఎదురైందనే సరదా చర్చ సాగుతోంది. శుక్రవారం లోక్‌సభలో ఎన్డీఏ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ తన ప్రసంగంతో, ఆ తర్వాత మోదీని ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆ వెంటనే సహచర ఎంపీలను ఉత్సాహపరుస్తూ కొంటెగా కన్నుగీటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్ చేష్టలన్నింటినీ వివిధ జాతీయ టీవీ ఛానళ్లు పదేపదే చూపాయి. ఈ ఘట్టాలు ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హాస్యపూర్వక వ్యాఖ్యలు, చర్చలకు దారితీశాయి. ► ‘ఓయ్ పిల్లాడా ! ప్రియా ప్రకాష్ వారియర్ (కన్నుగీటిన సీన్ల ద్వారా పాపులర్ అయిన మలయాళీ నటి) కంటే మెరుగ్గా రాహుల్ కన్నుగీటారు. మున్నాభాయ్ కంటే బాగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆస్కార్ అవార్డ్ రావొచ్చేమో?’ నంటూ గౌతమ్ జోషి ట్వీట్ చేశారు. ► ‘ప్రియా వారియర్ కంటే కూడా నిట్టనిలువునా మనిషిని పడగొట్టేలా కన్నుకొట్టడమంటే ఇదే’నని ఆకాష్ సిన్హా పేర్కొన్నారు ► ఈ కౌగిలింత ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండబోతోంది. ప్రియా వారియర్ కంటే కూడా ఈ కన్నుగీటడం మరింత ఎక్కువగా అంటురోగంగా వ్యాపిస్తుందేమోనన్న సందేహాన్ని గీతాశర్మ వెలిబుచ్చారు. ► అయితే రాహుల్ కన్నుగీటడంపై స్వయంగా ప్రియా వారియర్ ‘ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది’ అంటూ స్పందించింది. ► అవిశ్వాసంపై చర్చను పక్కన పెట్టి మోదీపై దాడే రాహుల్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రసంగం బదులు ప్రదర్శన ఇచ్చారు. చిన్నపిల్లాడి మాదిరిగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయడం తప్ప ఓ విజనూ లేదూ, రోడ్డు మ్యాపూ లేదు’ అంటూ మరో ట్విటరాటీ సంజూ శర్మ విరుచుకుపడ్డారు ► ప్రధానిని రాహుల్‌గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత చౌకబారుగా కన్నుగీటడం ఆయన అపరిపక్వతను, స్థాయి లేమి తనాన్ని స్పష్టం చేస్తోంది’ అంటూ ఘోస్ స్పాట్ అకౌంట్ ట్వీట్ చేశారు. ► ముఖ్యమైన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ మర్యాదను, నిబంధనలను రాహుల్ తక్కువచేశారు. జప్పీ (కౌగిలింత) తర్వాత కన్నుగీటడం చూస్తుంటే ఆయన ప్రతిపక్ష నేతా లేక మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి పాత్రా? సిగ్గుచేటు...షెహజాద్ జై హింద్ ట్విటర్ అకౌంట్ నుంచి పేర్కొన్నారు ► ఆలింగనం తర్వాత కన్నుకొట్టడమా? భారతీయులను మూర్ఖులను చేయాలనే యత్నం వద్దు రాహుల్. పార్ల మెంట్లో కామెడీ షో ఏం జరగడం లేదు. పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడేటపుడు సీరియస్‌గా వ్యవహరించు. ప్లీజ్ పరిణతి ప్రదర్శించు...బర్ఖా ట్రెహాన్ ట్వీట్ చేశారు. ► ‘వావ్..వావ్ ! ఏమి హగ్ అండీ. ఎంత అద్భుతమైన రోజు ఇది’ అని సంజుక్త బసు వ్యాఖ్యానించారు. ► ‘న్యూ వైల్డ్ స్టోన్ యాడ్ మాదిరిగా ఉంది ఇది’ అని ఓజాస్ ట్వీటారు. ► రాహుల్ తన ప్రసంగంలో బీజేపీ వైఫల్యాలు ఎండగట్టి, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం ద్వారా మోదీ, బీజేపీ కంటే తాను, కాంగ్రెస్‌పార్టీ ఏ విధంగా భిన్నమైందో చెప్పారు అని శ్రీవత్స పేర్కొన్నారు. -
ఆత్మీయ ఆలింగనం
దక్షిణకొరియా సరిహద్దులో ఉన్న ఉత్తరకొరియా గ్రామం పాన్‌మున్‌జోన్‌లో ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను ఆలింగనం చేసుకున్న ద.కొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్. నెల రోజుల వ్యవధిలో వీరిద్దరూ సమావేశమవడం ఇది రెండోసారి. -
కాన్పూర్ రిక్షా పుల్లర్ కొత్త అలోచన
-
బౌద్ధంలోకి 300 మంది హిందువులు
బౌద్ధుల పుణ్యక్షేత్రమైన బుద్ధగయలో సుమారు 300 మంది వెనుకబడిన కులాలకు చెందిన హిందువులు బౌద్ధమతం స్వీకరించారు. కుల వివక్ష, అంటరానితనం వదిలించుకోవడం కోసమే తాము బౌద్ధమతంలో చేరినట్లు మతమార్పిడి చేసుకున్నవారు తెలిపారు. బీహార్ లోని ఔరంగాబాద్, జహనాబాద్ జిల్లాలతోపాటు, మహరాష్ట్ర లోని నాగ్ పూర్, సతారా నగరాలనుంచి, మధ్యప్రదేశ్ జబల్ పూర్, రేవా నుంచి వచ్చిన వారంతా బౌద్ధంలో చేరినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మయన్మార్ కు చెందిన బౌద్ధ సన్యాసి చంద్రముని, బుద్ధ గయలోని బర్మా విహార్ ఆశ్రమంలో జరిగిన దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించిన బాబా సాహెబ్ అంబేద్కర్ మిషన్... ఈ హిందువుల మతమార్పిడి కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించినట్లు అధికారులు చెప్తున్నారు. -
రేవంత్‌కు టీడీపీ ఎమ్మెల్యేల ఆలింగనాలు
హైదరాబాద్: ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి అనుమతితో ఓటేసేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చిన రేవంత్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు స్వాగతించి ఆలింగనాలు చేసుకున్నారు. అంతా కలిసి పోలింగ్‌కు హాల్లోకి వెళ్లారు. రేవ ంత్ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. ఆయన వెంటనే ఓటేయకుండా రెండు గంటల పాటు అసెంబ్లీ లోపలే గడపడంతో ఉప ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అభ్యర్ధి కడియం శ్రీహరి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఓటేసి వెంటనే వెళ్లిపోవాల్సిందిగా వారు రేవంత్‌కు సూచించారు. ఏసీబీ కేసులో రేవంత్‌కు బెయిల్ కోసం కోర్టులో పిటషన్ వేసినందున అది వస్తుందో రాదో తేలేదాకా ఎదురు చూసేందుకే జాగు చేసినట్లు చెబుతున్నారు. ఓటేశాక ఏసీబీ అధికారులు ఆయనను అసెంబ్లీ నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు.