సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విచారణ జరిపించాలని 14 ఏళ్ల క్రితం లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ ఏసీబీ కోర్టు మళ్లీ విచారణ ప్రారంభించింది. పిటిషన్‌పై విచారణకు సంబంధించి లక్ష్మీపార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది.
గతంలో అప్పటి న్యాయమూర్తి డీఎస్‌ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపేస్తూ స్టే ఉత్తర్వులిచ్చారు. అయితే స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న స్టే గడువు ముగియడంతో ఏసీబీ కోర్టు విచారణను పునఃప్రారంభించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్టే 10 సంవత్సరాలు దాటితే ఎత్తివేయబడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment