సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి టీడీపీ లాయర్లు మళ్లీ సమయం కోరగా, మార్చి 11కి విచారణను కోర్టు వాయిదా వేసింది. గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో టీడీపీ న్యాయవాదులు నెట్టుకొస్తున్నారు. కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నిస్తున్నారు.
కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలను కూడా లోకేష్ పట్డించుకోలేదు. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగారు.
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్‌కి నోటీసులు జారీ కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లోకేష్ లెక్కచేయలేదు. నేటి విచారణలో మరోసారి టీడీపీ లాయర్లు వాయిదా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment