ఏసీబీ సోదాల్లో బయటపడ్డ నెల్లూరు జెడ్పీ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఆస్తుల విలువ రూ.85 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది.
రిమాండ్‌కు నెల్లూరు జెడ్పీ సీఈవో
నెల్లూరు (క్రైమ్): ఏసీబీ సోదాల్లో బయటపడ్డ నెల్లూరు జెడ్పీ సీఈవో బొబ్బా రామిరెడ్డి ఆస్తుల విలువ రూ.85 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌రావు.. రామిరెడ్డి ఇంటితోపాటు అతడి బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇవి కొనసాగాయి.
సోదాల్లో గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.4 కోట్ల మేర ఉండగా బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.85 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు రామిరెడ్డిని అరెస్ట్ చేసి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. శనివారం ఆయనను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.