
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో గతంలో దాఖలైన కేసు విచారణ డిసెంబర్ 6కు వాయిదా పడింది. హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సోమవారం దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే తమ తరఫున సీనియర్ న్యాయవాది విచారణకు హాజరవుతారని, కేసు విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ నందమూరి లక్ష్మీ పార్వతి కోరారు. ఇందుకు సమ్మతించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
హైకోర్టు నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకుని గత 14 ఏళ్లుగా ఏసీబీ కోర్టులో విచారణ జరగకుండా చూసుకున్నారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆనాటి స్టే గడువు ముగిసింది. లక్ష్మీపార్వతి 2005లో వేసిన ప్రైవేటు పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈ నెల 18న విచారణ ప్రారంభించింది. లక్ష్మీపార్వతి ప్రైవేటు ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ జరపకుండా చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పటి న్యాయమూర్తి జస్టిస్ డీఎస్‌ఆర్ వర్మ 2005లోనే స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. స్టే రద్దు చేయాలని లక్ష్మీపార్వతి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment