laxmi parvati
-
బాబు అక్రమ ఆస్తులపై తీర్పు18కి..
సాక్షి, హైదరాబాద్ : అక్రమ ఆస్తులు కూడబెట్టాడంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్లో సోమవారం తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. న్యాయమూర్తి మరోసారి వాయిదా వేశారు. చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలంటూ లక్ష్మీపార్వతి 2006లో ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అయితే ఆరు నెలలకు మించి స్టే ఉత్తర్వులు కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించిన నేపథ్యంలో... ఈ ఏడాది మొదట్లో ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేసేలా ఏసీబీని ఆదేశించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది నివేదించారు. (దేవుడు చేసిన మనుషుల్లారా మీపేరేమిటి?) దీంతో ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ పిటిషన్‌పై ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నా... పలుమార్లు వాయిదాపడుతూ వస్తోంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అవినీతిపై దాఖలైన పిటిషన్లను రోజువారీ పద్ధతిలో విచారించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై వెంటనే తీర్పును వెలువరించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది పలుమార్లు ఏసీబీ ప్ర త్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సుప్రీం తీర్పు ఈ పిటిషన్‌కు వర్తించదని, కేసులు నమోదై న్యాయ స్థానాల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న వాటికే ఆ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసిన న్యాయమూర్తి... ఈ పిటిషన్‌పై తీర్పును 18కి వాయిదా వేశారు. -
ఆకట్టుకున్న నవ జనార్దన పారిజాతం
-
చంద్రబాబు లాంటి నీచుడ్ని చరిత్రలో ఎక్కడా చూడలేదు
-
లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’
దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘రాధాకృష్ణ’. ప్రసాద్ వర్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఢమరుకం శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో పుష్పాల సాగరిక, శ్రీనివాస్ కానురులు సంయుక్తంగా నిర్మించారు. అనురాగ్, ముస్కాన్ శెట్టిలు జంటగా నటించిన ఈ చిత్రంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘కనుమరుగవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథా నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన అందమైన ప్రేమ కథను చూపించబోతున్నాం. అందరికీ నచ్చేలా అందరూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని ‘రాధాకృష్ణ’చిత్ర యూనిట్ పేర్కొంది. అలీ, కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్ఎమ్ శ్రీలేఖ సంగీత మందిస్తున్నారు. చదవండి: ‘కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ పది వేల అడుగుల ఎత్తులో... -
‘పిచ్చి తుగ్లక్ బస్‌యాత్ర మొదలైంది’
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘర పరాభవం ఎదురవనుందనే భయంతోనే చంద్రబాబు బస్సు యాత్ర మొదలు పెట్టారని తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఓ మాజీ సీఎం వెంపర్లాడటం మొదటి సారి అని విమర్శించారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. డిపాజిట్లు కూడా రావనే భయంతో బాబు బస్సు యాత్ర చేపట్టారని, ఆయన తీరు చూస్తే నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్టు ఉందన్నారు. ఆ ఘనుడు సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తనకు తెలిసి మూడు లక్షల కోట్ల అవినీతి సొమ్ము చంద్రబాబు దగ్గర ఉందని ఆమె పేర్కొన్నారు. పార్టీలో అంతర్గతంగా చంద్రబాబు పనికి రాడని. రామోజీ, రాధాకృష్ణ చెప్పారని తెలిసిందన్నారు. చంద్రబాబు కొడుకు కూడా పనికి రాడని చెప్పేశారని.. అందుకే వాళ్లను చంద్రబాబు బతిమిలాడుకున్నారని భోగట్టా. దాని కోసమే ఓ పక్క కేసులు ముంచుకొస్తున్నా జనంలోకి వచ్చి తిరుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. (‘గతంలో జరిగిన అక్రమాలకు బాబు సమాధానం చెప్పాలి’) ఈ బస్సు యాత్రలో ఆయన చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆర్థికంగా, శారీరకంగా సీఎం వైఎస్ జగన్ తనని బాధపెడుతున్నారని బాబు చెబుతున్నారు. కానీ మానసికంగా చంద్రబాబు బాధ.. తన ఖర్మ అని ఆమె తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌ను చూసి ఓర్చుకోలేక బాధపడుతున్నారని.. ఇంత సిగ్గుమాలిన చర్యలు చంద్రబాబుకే తెలుసని ఆమె మండిపడ్డారు. 108లో ఓ కార్మికుడిని తీసుకెళుతుంటే దారి కూడా ఇవ్వలేదని ఆమె దుయ్యబట్టారు. అబద్ధాలే ధ్యేయంగా ఆ పార్టీ వాళ్లు జీవితం సాగిస్తున్నారని లక్ష్మి పార్వతి విమర్శించారు. చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే నైతిక హక్కు ఉందా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తొమ్మిది నెలల్లో సీఎం వైఎస్ జగన్ చేసిన పథకాలు చంద్రబాబు ఎప్పుడైనా చేశాడా అని ఆమె నిలదీశారు.( ‘చంద్రబాబు ప్రతిపక్షనేత కాదు.. పనికిమాలిన నేత’) అవినీతిని పూర్తిగా రూపుమాపేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. 340 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు అంటున్నారు.. ఆ జాబితా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాబు హయాంలోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. ఎందుకు ఈ అబద్ధాల జీవితం, సింహంలా ఒకరోజు బతికినా చాలని ఆమె ఎద్దేవా చేశారు. ఐటీ సోదాలు జరిగిన వాళ్లు ఎవరు బాబుకు చెందిన వాళ్లు కాదా అని ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కబ్జాలు చేసి సింగపూర్ కంపెనీల ద్వారా అక్రమ సంపాదనను వైట్ మనీగా చేసుకోవాలని బాబు ప్రయత్నం చేశాడని లక్ష్మి పార్వతి మండిపడ్డారు. 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ ఎంతో జాగ్రత్తగా పొదుపు చేస్తూ ముందుకు వెళుతున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. అప్పుల్లో నింపిన చంద్రబాబు దార్శనికుడా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నిరుద్యోగ భృతిని ఎన్నికల స్టంట్‌గా ఇచ్చాడని ఆమె నిప్పులు చెరిగారు. నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఇంటికే పింఛన్ ఇస్తున్న తీరు కనిపించడం లేదా అని ఆమె మండిపడ్డారు. గత ఐదేళ్లల్లో చంద్రబాబు చేసిన ఒక్క మంచి పని చెప్పాలని.. తనను ప్రజలు దారుణంగా ఓడించి, అందరూ గడ్డి పెడుతున్నా మారవా అని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సాక్షాత్తు ప్రతిపక్ష నేతను చంపించాలని చూశారని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు మాత్రం శాంతిభద్రతలు సరిగి లేవనడం విడ్డూరం అన్నారు. టీడీపీ అధ్యక్ష పదవి పోతుందని పిచ్చి తుగ్లక్ లా రోడ్డున పడ్డారని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మారకపోతే ఇక బాబు క్షమార్హత కూడా కోల్పోతారని ఆమె హితవు పలికారు. -
‘వయసులో చిన్నవాడైనా నాకు అవకాశం కల్పించాడు’
సాక్షి, విజయవాడ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 67వ వర్ధంతి సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు గారి వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పొట్టి శ్రీరాములు మనుమరాలిని పిలిచి సన్మానించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారని కొనియాడారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడం, పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం ముదావహమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఆయన త్యాగాన్ని విస్మరించిందని విమర్శించారు. పొట్టి శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దని గుర్తు చేశారు. ఆయన వద్ద అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగించారని మండిపడ్డారు. సీఎం జగన్ వయసులో చిన్నవాడైనా త్యాగధనులను గుర్తించి స్మరించుకునే అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. .పట్టుదల, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన పొట్టి శ్రీరాములు భావితరాలకు స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. -
‘చంద్రబాబు’ కేసు విచారణ 6కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో గతంలో దాఖలైన కేసు విచారణ డిసెంబర్ 6కు వాయిదా పడింది. హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సోమవారం దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అయితే తమ తరఫున సీనియర్ న్యాయవాది విచారణకు హాజరవుతారని, కేసు విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ నందమూరి లక్ష్మీ పార్వతి కోరారు. ఇందుకు సమ్మతించిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. హైకోర్టు నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకుని గత 14 ఏళ్లుగా ఏసీబీ కోర్టులో విచారణ జరగకుండా చూసుకున్నారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆనాటి స్టే గడువు ముగిసింది. లక్ష్మీపార్వతి 2005లో వేసిన ప్రైవేటు పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఈ నెల 18న విచారణ ప్రారంభించింది. లక్ష్మీపార్వతి ప్రైవేటు ఫిర్యాదుపై ఏసీబీ కోర్టు విచారణ జరపకుండా చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పటి న్యాయమూర్తి జస్టిస్ డీఎస్ఆర్ వర్మ 2005లోనే స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. స్టే రద్దు చేయాలని లక్ష్మీపార్వతి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. -
40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఏమీ చేయలేదు...
సాక్షి, తాడేపల్లి: ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లక్ష్మిపార్వతి తెలిపారు. శనివారం ఆమె తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి బాటలోనే రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అవినీతి రహిత పాలన చేస్తున్నారని తెలిపారు. నాలుగు నెలల పాలనలో సుమారు నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత సీఎం జగన్‌ది అని ప్రశంసించారు. సీఎం జగన్ నిజాయతీ పాలన చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కమిషన్ల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ‘పీపీఏ, రాజధాని, పొలవరం అన్నింటిలో బాబు పాలన ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగి కుంభకోణాల మయంగా మారింది. ట్విటర్లో మాత్రమే మాట్లాడే కొడుకు కన్న ఘనత చంద్రబాబుదే. అవినీతి, దోపిడికి పాల్పడిన బాబుకు జగన్ పాలనను విమర్శించే హక్కు లేదు. పీపీఏలో భారీగా చంద్రబాబు కమిషన్లు తీసుకున్నారు. చివరికి కోడెల మృతదేహాన్ని పట్టుకొని శవ రాజకీయం చేశారు. చంద్రబాబు, కోడెల కుటుంబ సభ్యలు వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఎల్లో మీడియా ఇష్టానుసారంగా వార్తలు రాస్తోంది. మహిళ అని చూడకుండా నాపై తప్పుడు వార్తలు రాశారు. టీడీపీ పాలనలో ప్రజా ధనాన్ని జన్మభూమి కమిటీలు దోచుకుతిన్నాయని’ ఆమె మండిపడ్డారు. తల్లుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం జగన్ నాలుగు నెలల పాలనపై ఎటువంటి రీమార్క్ లేదని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని తెలిపారు. -
సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు షాక్!
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిరిగి విచారణ ప్రారంభం కానుంది. 2005లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ జరపాలని నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. కాగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు తెచ్చుకున్న స్టే రద్దయింది. దీంతో హైదరాబాద్ ఏసీబీ కోర్టు కేసు విచారణను మళ్లీ మొదలుపెట్టింది. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఆమె శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. కేసు స్టేటస్‌పై వచ్చేనెల 13న హైదరాబాద్ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. -
లక్ష్మీబాంబు అంటే బాబుకు భయం
సాక్షి, రాయవరం (మండపేట): ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీకి భయపడనని, కేసీఆర్‌కు భయపడనని, బాంబులు వేసినా భయపడనని చెబుతున్నారు. కాని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే బాంబుకి మాత్రం భయపడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. రాయవరం మండలంలో ప్రచారం చేసేందుకు పసలపూడి వచ్చిన సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబునాయుడిలోని అసలు సిసలైన కోణాన్ని దర్శకుడు రామ్‌గోపాలవర్మ చూపించారన్నారు. అందుకే తన నిజస్వరూపం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా బట్టబయలవుతుందనే భయంతో సినిమాను ఆపించేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుదల చేయాలన్నారు. చంద్రబాబునాయుడే ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యేలతో చెప్పులేయించి, ఆత్మక్షోభకు గురి చేశారన్నారు. చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనేందుకు చంద్రబాబు చూస్తున్నాడన్నారు. మడమ తిప్పని నేత జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిగా లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తన కొడుకు వయస్సున్న జగన్మోహన్రెడ్డిని చూసి చంద్రబాబు భయపడుతున్నాడన్నారు. జగన్మోహన్రెడ్డి అతడే సైన్యమన్నట్లుగా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తుంటే, చంద్రబాబునాయుడు ఇతర రాష్ట్రాల నాయకులను దిగుమతి చేసుకుని ప్రచారం చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. నీతి, నిజాయితీ ఉన్న జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. జగన్మోహన్రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. విలేకరుల సమావేశంలో సినీ నిర్మాత తాడి గనిరెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం మండపేట నియోజకవర్గ అధ్యక్షుడు చిర్ల జయరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దురదృష్టకరం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని హరికృష్ణ నివాసంలో పార్థివదేహానికి పుష్పగుచ్ఛం సమర్పించి, సంతాపం వ్యక్తం చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తదితరులను కేసీఆర్ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా కేసీఆర్ పేర్కొన్నారు. హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి సూచించారు. గవర్నర్ ప్రగాఢ సంతాపం.. నందమూరి హరికృష్ణ అకాల మృతిపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకాల మరణం దురదృష్టకరమని అన్నారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ముక్కుసూటి మనిషి సాక్షి, హైదరాబాద్: తెల్లవారుజామున నిద్రలేవగానే దిగ్భాంత్రికర వార్త విన్నా. విషయం తెలియగానే కళ్యాణ్‌రామ్‌తో మాట్లాడా. వెంటనే నార్కెట్పల్లికి చేరుకున్నా. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తి. నీతినిజాయతీగా ఉండేవారు. ఒకపక్క కుటుంబ సభ్యుడిని, మరో పక్క పార్టీ నాయకుడిని కోల్పోయా. ఆయన మనసుకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నా. – చంద్రబాబు, ఏపీ సీఎం అమ్మగారూ.. అని ఆప్యాయంగా పిలిచేవాడు మా కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతోంది. నా పెద్ద కుమారుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. తొలుత మా వివాహాన్ని హరికృష్ణ వ్యతిరేకించినా, ఆ తర్వాత నన్ను ఆప్యాయంగా పలకరించేవాడు. నన్ను అమ్మా.. అని ఆప్యాయంగా పిలిచేవాడు. ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమైన కుమారుడు. తండ్రికి రథసారధి. – లక్ష్మీపార్వతి పలువురి దిగ్భ్రాంతి హరికృష్ణ అకాల మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌అలీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు సంతాపం తెలిపారు. -
కా.రా. మాస్టారుకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్/శ్రీకాకుళం: తెలుగు కథా సాహిత్యంలో అగ్రగణ్యులు కాళీపట్నం రామారావు (కా.రా.మాస్టారు)ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమణాచారి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ జాతీయ అవార్డు కింద ఆయనకు బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నగదు పారితోషికాన్ని రూ. 1.50 లక్షలు చేస్తున్నామని చెప్పారు. కథా సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకువెళ్లిన శ్రీకాకుళంకు చెందిన కా.రా.మాస్టర్‌ను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులు, ట్రస్ట్ సలహాదారు డా. కె.శివారెడ్డి, ట్రస్ట్ సభ్యురాలు మృణాళిని, ఓల్గాలను రమణాచారి అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ సాహితీవేత్తలను ఈ అవార్డుకు ఎంపిక చేసి.. వారిని తగు రీతిలో గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. సాహిత్యం వల్లే ఎన్టీఆర్‌తో తనకు పరిచయమైందని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం స్థాపించిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ద్వారా సాహితీ కృషీవలులకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేయడం తనకు ఆత్మానందాన్ని ఇస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సాహిత్య దిగ్గజాలను ఈ అవార్డుతో గౌరవిస్తుండటంలో సాహిత్యానికి నిలువెత్తు రూపమైన రమణాచారి కృషి ఎంతో ఉందన్నారు. సమావేశంలో మృణాళిని, డా. కె. శివారెడ్డి, ఓల్గా పాల్గొన్నారు. కథానిలయ స్థాపకుడు.. కా.రా.మాస్టారు 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని మురపాక గ్రామంలో జన్మించారు. 1943 నుంచి విశాఖలో పలు ఉద్యోగాలు చేశారు. తరువాత భీమునిపట్నంలో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. సాహిత్యం ద్వారా పారితోషికం, సన్మానాల ద్వారా లభించిన ప్రతి పైసాను కూడబెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని 1997 పిబ్రవరిలో ‘కథానిలయం’ ఏర్పాటు చేశారు.