Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌.. Click & Refresh | Chandrababu Bail Petition In ACB Court: Live Updates | Sakshi
Sakshi News home page

Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌.. Click & Refresh

Published Fri, Sep 15 2023 6:02 AM | Last Updated on Fri, Sep 15 2023 7:18 PM

Chandrababu Bail Petition In ACB Court: Live Updates - Sakshi

Khaidi No 7691.. LIVE UPDATES

7:15 PM, సెప్టెంబర్‌ 15, 2023
రేపు జనసేన విస్తృతస్థాయి సమావేశం

► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ఏం మాట్లాడారు?
►జైలు బ్రీఫింగ్‌ను జనసేన కార్యవర్గానికి వివరించనున్న పవన్‌ కళ్యాణ్‌
►చంద్రబాబు సూచనలు, పొత్తు అంశాలపై సుదీర్ఘ ప్రజంటేషన్‌కు రెడీ
►పొత్తు వల్ల ఎక్కడెక్కడ రాజీ పడాలో వివరించనున్న పవన్‌ కళ్యాణ్‌
►మీరనుకున్నట్టు అందరికీ టికెట్లు ఇవ్వలేనని చెప్పనున్న పవన్‌
►పొత్తులో టిడిపి ఎన్ని టికెట్లు ఇస్తే.. అక్కడ మాత్రమే జనసేన పోటీ
►ఏ ఏ స్థానాలన్నది ఉమ్మడి కార్యాచరణలో నిర్ణయించుకోనున్న పార్టీలు
►30 స్థానాలకు జనసేన పరిమితం అని రాజకీయవర్గాల్లో ప్రచారం
►ఇప్పటివరకు ఆశలు పెట్టుకుని నియోజకవర్గాల్లో తిరిగిన కొందరు
►తాజా పొత్తు నిర్ణయంతో ఖర్చు పెట్టుకున్న వారికి తీవ్ర నిరాశ
►రేపు మధ్యాహ్నం మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం
►టీడీపీతో కలిసి వెళ్లాల్సిందే, రాజీ పడదామని చెప్పనున్న పవన్‌

7:10 PM, సెప్టెంబర్‌ 15, 2023
జైల్లో చంద్రబాబు.. ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయంటే.?

► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు
► స్పెషల్‌ మెడికల్ టీం ను నియమించిన ప్రభుత్వం
►అత్యవసర ఔషధాలు ఓ పాజిటివ్ బ్లడ్, అంబులెన్స్ రెడీ
►అన్ని వేళల్లో సన్నద్ధంగా పదిమంది వైద్య నిపుణుల బృందం
►చంద్రబాబు ఆరోగ్య భద్రతకు సంబంధించి సకల ఏర్పాట్లు
►టీవీ, న్యూస్‌ పేపర్లు, ఇంటి భోజనం, వేడి నీళ్లు ఏర్పాటు

6:55 PM, సెప్టెంబర్‌ 15, 2023
సెలవుపై రాజకీయమా?

► రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై జైళ్లశాఖ ప్రకటన
► రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు
► రాహుల్ భార్య నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరారు
►ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసుకునేందుకు రాహుల్ సెలవు పెట్టారు
►4 రోజుల సెలవు అభ్యర్థనను జైళ్ల శాఖ అంగీకరించింది
►దీనిపైనా కొన్ని మీడియాలు రాజకీయం చేయడం అర్థరహితం

6:40 PM, సెప్టెంబర్‌ 15, 2023
కింకర్తవ్యం ? : లోకేష్‌ @ ఢిల్లీ

►మరో రెండు రోజులూ ఢిల్లీలోనే ఉండనున్న నారా లోకేష్
►ఇవ్వాళ అంతగా సక్సెస్‌ కాని అపాయింట్‌మెంట్లు
►చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు
►పలువురు పార్టీల నేతలను కలవాలని ప్రయత్నాలు
►అపాయింట్‌మెంట్ల విషయంలో కలిసిరాని పరిచయాలు
►మొత్తం టిడిపి నేతలను, మద్ధతుదారులను ఉపయోగిస్తున్న లోకేష్‌
►రేపు సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమావేశమయ్యే ఛాన్స్

5:24PM, సెప్టెంబర్‌ 15, 2023
వారంలో మూడో ములాఖత్‌ కుదరదు: జైళ్ల  ఉప  శాఖాధికారి, కోస్తా ఆంధ్ర ప్రాంతం, రాజమండ్రి

►నారా భువనేశ్వరి ములాఖత్ పై జైళ్ల శాఖ స్పష్టత
►వారంలో మూడో ములాఖత్ నిబంధనలు రీత్యా సాధ్యం కాదు
►అందుకే ఈరోజు నారా భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరించాం
►ఈ వారం లో రిమాండ్ ఖైదీ నెంబర్  7691 కి రెండు ములాఖత్ లు పూర్తయ్యాయి
►ఈ నెల 12 న  నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి లకు ములాఖత్ ఇచ్చాం
►ఈ నెల 14 న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ లు ములాఖత్ అయ్యారు
►అత్యవసర పరిస్థితులు ఉంటేనే వారంలో మూడో ములాఖత్‌కు అవకాశం
►ప్రస్తుతం రిమాండ్ ఖైదీ చంద్రబాబుకి అలాంటి అత్యవసర కారణాలు లేవు
►అందుకే నారా భూబనేశ్వరి ములాఖత్ దరఖాస్తు ని తిరస్కరించాం

4:50 PM, సెప్టెంబర్‌ 15, 2023
కింకర్తవ్యం ? : లోకేష్‌ @ ఢిల్లీ

►ఉదయం నుంచి బీజేపీ నేతల అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నం
►బీజేపీ నుంచి రాని స్పందన, బీజేపీలో ఉన్న టిడిపి నేతలతో లాబీయింగ్‌
►చంద్రబాబు కేసులపై పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు
►రఘురామ కృష్ణరాజుతో సుదీర్ఘ మంతనాలు
►రేపు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్న లోకేష్


4:30 PM, సెప్టెంబర్‌ 15, 2023
టీడీపీ, జనసేన పొత్తు ప్రకటనపై సజ్జల కౌంటర్

►రాజకీయాల్లో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ డూప్‌
►ఇంతకాలం విడివిడిగా ఉన్నట్లు నటించారు
►బీజేపీని తీసుకొచ్చే బాధ్యత పవన్‌కు బాబు అప్పగించారమో
►ఏపీలో అధికార పార్టీకి ఈసారి పాజిటివ్ ఓటు ఉంది
►ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం

4:15 PM, సెప్టెంబర్‌ 15, 2023
నారాయణ పిటిషన్‌ 25కు వాయిదా

►నారాయణ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్ల పై విచారణ 25కి వాయిదా
►అసైన్డ్ భూముల స్కాంలో సీఐడీ నమోదు చేసిన 2 కేసులు క్వాష్ చేయాలని పిటిషన్
►ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన మాజీ మంత్రి నారాయణ
► నారాయణతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అంజనీకుమార్
►విచారణను ఈ నెల 25కి వాయిదా వేసిన కోర్టు

3:15 PM, సెప్టెంబర్‌ 15, 2023
తాడేపల్లిగూడెం: ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

►జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకున్నాడు
►పవన్ కళ్యాణ్ ఇంతకాలం పెళ్లి ఒకరితో సంసారం ఒకరితో అన్నట్లుగా ఉన్నాడు
►పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు
►జనసేనతో టీడీపీ కలవడం వల్ల చాలామంది తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు

1:15 PM, సెప్టెంబర్‌ 15, 2023
వివేకానంద, స్పెషల్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, CID, సుదర్శన్‌ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్‌

►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లకు విచారణ అర్హత లేదు
►రెండు బెయిల్ పిటిషన్లలో ఒకే సెక్షన్ల ద్వారా అప్లై చేశారు
►ఈ రెండు పిటిషన్లలో బెయిల్ కోసం నిర్ణీత కారణం చెప్పలేదు
►హైకోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్‌పై స్టే ఉండగా మళ్లీ ఇక్కడ బెయిల్ వేయటం విరుద్ధం
►నిందితుడి కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితేనే మధ్యంతర బెయిల్ అడుగుతారు
►మధ్యంతర బెయిల్ కూడా 24 లేదా 48గంటలు ఇస్తారు
►హైకోర్టులో వేసిన పిటిషన్ నే ఇక్కడ వేశారు
►నిందితుడు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు
►ఇప్పుడు చెప్తున్న సెక్యూరిటీ రీజన్స్ రిమాండ్ టైంలోనే చెప్పారు
►కౌంటర్ దాఖలు చేయటానికి మంగళవారం వరకూ సమయం ఇచ్చారు
►కోర్టు ఏం చెప్తుందో 19వ తేదీ వరకూ వేచి చూడాలి

12:10PM, సెప్టెంబర్‌ 15, 2023
చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా

►చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా
►ఈ పిటిషన్‌ విచారణ సైతం 19వ తేదీకే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కోర్టు
►హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉండటాన్ని ప్రస్తావించిన న్యాయమూర్తి
►కస్డడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉందన్న న్యాయమూర్తి
►బెయిల్ పిటిషన్ నూ ఈనెల 19నే విచారిస్తామన్న న్యాయమూర్తి
►మధ్యంతర బెయిల్‌, బెయిల్‌ పిటిషన్లు రెండూ వాయిదా

12:00PM, సెప్టెంబర్‌ 15, 2023
మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

► స్కిల్‌ స్కాం కేసులో ఏ1 చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
►విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

11:30 AM, సెప్టెంబర్‌ 15, 2023
బెయిల్‌ పిటిషన్‌ @ ACB కోర్టు, విజయవాడ

► చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ
► బెయిల్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్
► కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీఐడీ తరపు న్యాయవాది

11:00 AM, సెప్టెంబర్‌ 15, 2023
బెయిల్‌ పిటిషన్‌ @ ACB కోర్టు, విజయవాడ

► చంద్రబాబుకు ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్‌
► బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ
► స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఈ బెయిల్ పిటిషన్
► ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు
► బాబు బెయిల్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని CIDకి కోర్టు సూచన

10:30 AM, సెప్టెంబర్‌ 15, 2023
డామిట్‌.. కథ అడ్డం తిరిగిందా.?

► రాజమండ్రి సెంట్రల్‌ జైలు లోపల మాట్లాడింది వేరు, బయట జరిగింది వేరు
► ఇంకొన్నాళ్లు దొంగాట ఆడుకుందామని పవన్‌కు బాబు సూచించినట్టు సమాచారం
► ఇప్పుడే పొత్తు ప్రకటిస్తే బీజేపీకి కోపం వస్తుందని చెప్పిన చంద్రబాబు
► లోపల ఓకే చెప్పి బయట ప్లేటు ఫిరాయించిన పవన్‌ కళ్యాణ్‌
► జైలు బయట ప్రెస్‌ మీట్‌లో ఫ్లోలో అసలు విషయం చెప్పేసిన పవన్‌
► ఒక వైపు లోకేష్‌, మరో వైపు బాలయ్యను పెట్టుకుని పవన్‌ పొత్తు ప్రకటన
► పవన్‌ నోట పొత్తు వినగానే షాక్‌కు గురయిన బాలయ్య, లోకేష్‌
► పవన్‌ మాట్లాడిన తర్వాత ఏం చేయాలో పాలుపోక బాలయ్య, లోకేష్‌ మౌనం
► ఇప్పటికిప్పుడు గట్టిగా గెలిచే స్థానాలు 20 కూడా లేకపోవడంతో కంగారు
► డ్యామేజీ కంట్రోల్‌ కోసం హడావిడి ప్రయత్నాలు మొదలెట్టిన లోకేష్‌, బాలయ్య
► సాయంత్రం తర్వాత ఢిల్లీ ప్లాన్‌ తెర మీదికి
► లోకేష్‌ ఢిల్లీ టూరు లక్ష్యం ఒకటే : ఎలాగైనా బీజేపీ నేతల అపాయింట్‌మెంట్‌

09:30AM, సెప్టెంబర్‌ 15, 2023
విశ్వసనీయతకు యూటర్న్‌కు మధ్య యుద్ధం
► జైలు ముందు పొత్తు ప్రకటన చేసిన పవన్‌, లోకేష్‌
► పవన్‌, లోకేష్‌ తీరు తప్పుబట్టిన విజయసాయిరెడ్డి
► ఈ యుద్ధం వైఎస్సార్‌సిపి x టిడిపి, జనసేన....
సింగిల్‌గా వచ్చే సింహాం x నక్కల గుంపు
ప్రజా సంక్షేమం x అధికార దాహం
విశ్వసనీయత x యూటర్న్‌ రాజకీయాలు
స్థిరమైన పాలన x అస్థిరమైన నాయకత్వం
నీతి నిజాయతీ x అవకాశవాదం
సమైక్యత x కుల రాజకీయం

09:15AM, సెప్టెంబర్‌ 15, 2023
ఢిల్లీలో నారా లోకేష్‌ బిజీ బిజీ

► ఢిల్లీ పర్యటనలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
►  చంద్రబాబు అరెస్ట్ గురించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చేలా లాబీయింగ్‌
►  పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదుల అపాయింట్‌మెంట్లు అడిగిన టీడీపీ టీం
► కక్ష రాజకీయంగా కలరింగ్‌ ఇచ్చేందుకు ఢిల్లీలో లోకేష్‌ మంతనాలు
► పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహణ
► లోక్‌సభలో బాబు అరెస్ట్‌పై చర్చ కోసం పట్టుబట్టాలని ఎంపీలకు హితబోధ

09:29AM, సెప్టెంబర్‌ 15, 2023
పొత్తు ప్రకటన చెప్పేశా.. ఇక ఏం చేద్దాం!

► రాజమండ్రి సెంట్రల్‌ జైలు బయట  శుక్రవారం టీడీపీ పొత్తు ప్రకటన చేసిన పవన్‌  
► పవన్‌ ప్రకటనపై పార్టీలో ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు శనివారం(రేపు) జనసేన విస్తృత స్థాయి సమావేశం
► నెక్ట్స్‌ ఏంటన్న దానిపైనా భేటీలో చర్చించే అవకాశాలు
► మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్‌ అధ్యక్షతన భేటీ
► పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల దగ్గరి నుంచి సంయుక్త కార్యదర్శుల దాకా అంతా హజరయ్యే ఛాన్స్‌
► ఇప్పటివరకు టికెట్‌ ఆశ చూపెట్టి ఇప్పుడు పొత్తు అంటే ఎలా అని జనసేన కార్యవర్గం అసంతృప్తి

09:21AM, సెప్టెంబర్‌ 15, 2023

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లపై వాదనలు ఆలస్యం?
►ఏసీబీ కోర్టులో బాబు తరపున రెండు పిటిషన్లు దాఖలు
►స్కిల్‌ స్కాం కేసులో బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ కోరుతూ పిటిసషన్లు
►బెయిల్‌పై ఇప్పటికే సీఐడీకి కోర్టు నోటీసులు
►పూర్తి వివరాలు ఉంచేందుకు సమయం కోరనున్న సీఐడీ
►పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాతే.. ఇరువైపులా వాదనలు మొదలయ్యే అవకాశం

08:00AM, సెప్టెంబర్‌ 15, 2023
జైలులో చంద్రబాబు @6వరోజు

► రాజమండ్రి సెంట్రల్‌ జైలు సమీపంలోనే చంద్రబాబు భార్య భువనేశ్వరి బస
► ఈ వారం ముగిసిన చంద్రబాబు ములాఖత్‌లు
 
06:44am, సెప్టెంబర్‌ 15, 2023

చంద్రబాబు పిటిషన్లపై సీఐడీ కౌంటర్‌

చంద్రబాబు పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ కౌంటర్‌
బెయిల్‌, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లు వేసిన చంద్రబాబు లాయర్లు
► ఏసీబీ కోర్టులో కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 

5:15am, సెప్టెంబర్‌ 15, 2023
చంద్రబాబు అరెస్టుపై ఢిల్లీకి లోకేష్
►చంద్రబాబు అరెస్టుకు విస్తృత  ప్రచారం చేయాలని ఢిల్లీకి లోకేష్
►నిన్న రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిక లోకేష్
►లోకేష్ కోసం జాతీయ పార్టీల నేతల అపాయింట్మెంట్ ప్రయత్నం చేస్తున్న టీడీపీ లీడర్ లు
► నిన్న చంద్రబాబుతో పవన్‌ ములాఖత్‌ తర్వాతనే ఈ నిర్ణయం

5:05am, సెప్టెంబర్‌ 15, 2023
మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ
 
► రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్
►విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం
►మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం

5:00am, సెప్టెంబర్‌ 15, 2023
చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ 

►విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేసిన న్యాయవాది సుబ్బారావు
►పిటిషన్ ను విచారణకు స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు
►పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement