LIVE : Chandrababu Arrest, Remand, Cases, Scams And Ground updates
6:05 PM, అక్టోబర్ 05 2023
మెదక్ : చంద్రబాబునాయుడిని జనమే బ్యాన్ చేశారు : మంత్రి హరీష్ రావు
► మెదక్ జిల్లా సభలో మాట్లాడిన తెలంగాణ మంత్రి హరీష్‌రావు
► కులాలు, జాతుల గురించి చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదు
► చంద్రబాబు నాయుడు పందులను, మేకలను బ్యాన్ చేశాడు
► చివరకు ప్రజలు ఆయన్నే బ్యాన్ చేశారు, ఇప్పుడు జైలుకు పంపారు
► చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం వద్దు
6:00 PM, అక్టోబర్ 05 2023
ఎట్టకేలకు ఢిల్లీ వదిలిన లోకేష్
► ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేష్
► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 22 రోజుల పాటు ఢిల్లీకే పరిమితమైన లోకేష్
► రఘురామకృష్ణరాజుతో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లతో చర్చలు జరిపిన లోకేష్
► వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు కనకమేడల, కేశినేని నాని, ఎంపీ రఘురామ
► రేపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తండ్రి చంద్రబాబును ములాఖత్‌లో కుటుంబసభ్యులతో పాటు కలవనున్న లోకేష్
► చంద్రబాబుకు మరో 14 రోజులు పాటు రిమాండ్ విధించిన న్యాయస్థానం
► ఆదివారం మళ్లీ లోకేష్ ఢిల్లీకి వెళ్లిపోతాడని ప్రచారం
► సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్
► విచారణ సమయంలో సుప్రీంకోర్టుకు లాయర్లతో కలిసి వెళ్లనున్న నారా లోకేష్
5:10 PM, అక్టోబర్ 05 2023
చంద్రబాబు నేర చరిత్రపై YSRCP విమర్శలు
► పదవిని అడ్డుపెట్టుకుని రూ.6 లక్షల కోట్లు దోచుకున్నాడని విమర్శ
► దోపిడిలో లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు వాటా ఉందని విమర్శ
Presenting India’s biggest and most notorious scamster Mr. Nara Chandra Babu Naidu @ncbn, who looted a whopping ₹6 Lakh Crores of Public Money!
— YSR Congress Party (@YSRCParty) October 5, 2023
Costarring his coterie of co-looters
Guru - Mr Ramoji Rao
Biological Son - Mr @NaraLokesh
Adopted Son - Mr @PawanKalyan
And… pic.twitter.com/tuQHUCEFPy
5:00 PM, అక్టోబర్ 05 2023
రేపు ACB కోర్టులో చంద్రబాబు బెయిల్‌పై వాదనలు
► విజయవాడ : చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా
► రేపు మధ్యాహ్నం బాబు న్యాయవాది దూబే వాదనలకి రిప్లై ఇవ్వనున్న AAG పొన్నవోలు
► రేపు మధ్యాహ్నం తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ PT వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం
4:45 PM, అక్టోబర్ 05 2023
హైకోర్టు : చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్
► హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసుపై ముగిసిన వాదనలు
► చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పు రిజర్వు
► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దంటూ CID తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం వాదనలు
► స్కిల్ కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్, పార్థసాని ఇప్పటికే పరారీలో ఉన్నారు
► చంద్రబాబు ప్రమేయంతోనే వారిద్దరూ పరారైనట్లు మాకు సమాచారం ఉంది
► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దు
► చంద్రబాబు బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు
4:45 PM, అక్టోబర్ 05 2023
స్కిల్ స్కాం నిధులన్నీ చంద్రబాబు ఖాతాలకు చేరాయి : సజ్జల
► స్కిల్ స్కామ్ కేసులో CID ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు తెలిపింది
► స్కామ్‌లో డబ్బులు చంద్రబాబు ఖాతాలోకి వెళ్లినట్టు CID ఆధారాలు సేకరించింది
► ఈ కుంభకోణంలో లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ పాత్ర కీలకంగా ఉందని CID దర్యాప్తులో తేలింది
► NDA కూటమి నుంచి బయటకొచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు
► పవన్ తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది
► టీడీపీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు
► పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో చెప్పాలి
► అసలు టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియాలి
► చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ కాదు కోర్టు
► ప్రభుత్వానికి చంద్రబాబు కేసులతో సంబంధం లేదు : సజ్జల
4:38 PM, అక్టోబర్ 05 2023
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
► ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు
► చంద్రబాబు రిమాండ్ మరో 14 రోజులు పొడిగింపు
4:31 PM, అక్టోబర్ 05 2023
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
► రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
► రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటానన్న న్యాయమూర్తి
► ఇవాళ హోరాహోరీగా సాగిన ఇరుపక్షాల వాదనలు
2:50 PM, అక్టోబర్ 05 2023
బుద్ధా వెంకన్న కేసు @ హైకోర్టు
► ఏపీ హైకోర్టులో బుద్ధా వెంకన్న పిటిషన్
► పేర్నినాని పెట్టిన కేసుపై హైకోర్టును ఆశ్రయించిన బుద్ధా వెంకన్న
► వల్లభనేని వంశీ, కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్నపై కేసు
► గన్నవరం ఆత్కూరు స్టేషన్‌లో కేసు పెట్టిన పేర్నినాని
► బుద్దా వెంకన్నకు 41A కింద నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు
2:50 PM, అక్టోబర్ 05 2023
బండారు కేసు @ హైకోర్టు
► ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి బండారు పిటిషన్
► తనపై పెట్టిన కేసును సవాలు చేసిన టిడిపి నేత బండారు
► బండారు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు సూచన
► ఇటీవల మంత్రి రోజాపై నీచ వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత బండారు
► మహిళలను కించపరిచినవారు బాగుపడ్డ దాఖలాలు చరిత్రలో లేవన్న మంత్రి రోజా
❝ స్త్రీ కన్నీటి బొట్టు గురించి
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023
చాగంటి వారి ప్రవచనం ❞ pic.twitter.com/6rshDIRACU
2:45 PM, అక్టోబర్ 05 2023
లంచ్ తర్వాత వాదనలు పునఃప్రారంభం
► ఏపీ హైకోర్టులో ఫైబర్ గ్రిడ్ కేసు
► ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు
► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు
2:15 PM, అక్టోబర్ 05 2023
తెలుగుదేశం, జనసేనలకు YSRCP చురకలు
► ఎన్నికలు రాగానే ప్యాకేజీ రాజకీయాలా?
► ఇవేం పార్టీలు, ఇవేం పొత్తులు : అంబటి
జనసేన రాజకీయ పార్టీ కాదు !
— Ambati Rambabu (@AmbatiRambabu) October 5, 2023
తెలుగుదేశం బలహీనపడినప్పుడు
వాడే బలం మందు! @PawanKalyan @naralokesh @JaiTDP
1:50 PM, అక్టోబర్ 05 2023
బాబు బయటకు వస్తే.. సాక్ష్యాధారాలు తారుమారే
► ఏపీ హైకోర్టు: ఫైబర్‌గ్రిడ్ కేసు సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు
► ప్రాథమిక విచారణలో చంద్రబాబు పేరు లేదు కాబట్టి కేసులో లేరు అనటం సరికాదు
► పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత చంద్రబాబు ప్రమేయం గుర్తించాం
► అందుకే నిందితుడుగా చంద్రబాబు పేరును చేర్చాం
► టెరా సాప్ట్ కు పనులు ఇవ్వటం మొదలు అన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయి
► నిబంధనలు పాటించకుండా నిర్ణయాలు అమలు చేసి అక్రమాలకు పాల్పడ్డారు
1:40 PM, అక్టోబర్ 05 2023
మద్ధతివ్వండి ప్లీజ్.. CPIని రిక్వెస్ట్ చేసిన TDP
► గుంటూరు జిల్లా CPI కార్యాలయానికి వెళ్లిన TDP నాయకులు
► ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌తో TDP నేతల భేటీ
► TDP బృందంలో నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్
► ఈ నెల 7న జరిగే శాంతి ర్యాలీకు CPI మద్దతు కోరిన TDP నాయకులు
1:20 PM, అక్టోబర్ 05 2023
ఓట్ల కోసం కక్కుర్తి పడతారా? మీలో మీకైనా కనీస గౌరవముందా?
► తెలుగుదేశం, జనసేన నాయకులపై YSRCP విమర్శలు
► మీలో మీకే గౌరవం లేదు, ప్రజలను ఏం గౌరవిస్తారని ప్రశ్న
మనసులో లేని ప్రేమ, అభిమానాన్ని నటిస్తూ అధికారం కోసం @JaiTDP, @JanaSenaParty పొత్తు పెట్టుకున్నాయి. కానీ.. ఎంత సీనియర్ నటులైనా లేని గౌరవాన్ని అన్నివేళలా నటించడం సాధ్యం కాదు కదా..? చంద్రబాబుని గాడు అని @PawanKalyan సంభోదిస్తే.. ఆ పవన్ కళ్యాణ్‌ని మరింత వెటకారంగా గాడూ అంటూ నందమూరి… pic.twitter.com/VXuaS4QYhQ
— YSR Congress Party (@YSRCParty) October 4, 2023
1:10 PM, అక్టోబర్ 05 2023
కార్పోరేషన్ తప్పు చేస్తే.. చంద్రబాబుకేంటీ సంబంధం : బాబు లాయర్ వాదన
► చంద్రబాబు తరపున మరో సీనియర్ లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు
► దూబే : సాంకేతికంగా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు
► న్యాయమూర్తి : చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ కార్పోరేషనుకు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల సంగతేంటీ?
► దూబే : స్కిల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే సీఎంగా చంద్రబాబు పాత్ర పూర్తయింది
► బ్యాంకు గ్యారెంటీలను స్కిల్ కార్పోరేషన్‌కు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది
► సీమెన్స్‌తో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పోరేషనే తప్ప.. ప్రభుత్వం కాదు
► స్కిల్ కార్పోరేషన్, సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది
► అక్కడ అవినీతి, అక్రమాలు జరిగితే చంద్రబాబుకు సంబంధం ఎలా ఉన్నట్టు? : దూబే
12:50 PM, అక్టోబర్ 05 2023
హైకోర్టు : ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు లాయర్ సిద్ధార్థ అగర్వాల్ వాదనలు
► ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై హైకోర్టులో వాదనలు
► ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులను నిబంధనలు ప్రకారమే బిడ్డర్‌కు ఇచ్చారు
► ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదు,
► ఈ కేసులో కొందరికి బెయిల్ లభించింది
► చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలి : లాయర్ అగర్వాల్
12:38 PM, అక్టోబర్ 05 2023
చంద్రబాబు పాత్రకు ఇవే ఆధారాలు : ACB కోర్టులో పొన్నవోలు
► విజయవాడ : రెండో రోజు ACB కోర్టులో సంచలన నిజాలు బయటపెట్టిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్
► నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్ల నిధులని దిగమింగారు
► చంద్రబాబు పాత్రను బయటపెట్టే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పణ
► ఏ రకంగా డొల్ల కంపెనీల నుంచి ఈ నిధులు నేరుగా టిడిపి ఖాతాలోకి వచ్చాయన్న దానిపై ఆధారాల సమర్పణ
► రూ.27 కోట్లు మళ్లించిన బ్యాంకు ఖాతాల డాక్యుమెంట్లని ACB కోర్టుకు సమర్పణ
► దీనికి సంబంధించిన ఆడిటర్‌ను విచారణకు పిలిచాం
► ఈ నెల 10 న విచారణకు ఆడిటర్ వస్తానన్నారు
► డొల్ల కంపెనీలని సృష్టించి హవాలా రూపంలో నిధులు దిగమింగిన వైనాన్ని వివరించిన పొన్నవోలు
12:30 PM, అక్టోబర్ 05 2023
ఫైబర్‌నెట్ స్కాంలో చంద్రబాబుదే కీలక పాత్ర
► ఏపీ హైకోర్టులో ఫైబర్ నెట్ కుంభకోణంలో వాదనలు
► తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు నాయుడు పిటిషన్
► CID తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు
► చంద్రబాబు నాయుడు బెయిల్ విజ్ఞప్తిని తిరస్కరించాలన్న AG శ్రీరామ్
12:30 PM, అక్టోబర్ 05 2023
భువనేశ్వరీ ప్రకటనపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి : YSRCP
► భువనేశ్వరీ ఇటీవల చేసిన ప్రకటనపై నారుమల్లి పద్మజ విమర్శలు
►ఎన్టీఆర్ కన్నీళ్లు కార్చితేనే స్పందించని భువనేశ్వరి ఇతర మహిళల కష్టాలకు స్పందిస్తుందా?
►హెరిటేజ్‌లో 2% అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు
►దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి, ఆస్తుల అఫిడవిట్లపై విచారణ జరపాలి
►బండారు సత్యనారాయణ లాంటి కీచకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతన్నారు
►ఇలాంటి వారిని ఎవరు ప్రోత్సాహిస్తున్నారు?
►ఒక మహిళ కన్నీరు తమకు సంతోషాన్నిస్తోందని అంటున్నారంటే టీడీపీ వారి పైశాచికత్వాన్ని ఏం అనాలి?
►భువనేశ్వరి సభలో ఒక పిల్లాడితో చండాలంగా మాట్లాడించారు
►భువనేశ్వరి చప్పట్లు కొడుతుంటే అసలు వీరు మహిళలేనా అనిపిస్తోంది
►చంద్రబాబు చేసిన స్కాంలలో కూడా భువనేశ్వరి పాత్ర ఉందనే అనుమానం వస్తోంది
►విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ జరిగినప్పుడు ఈ భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు?
12:24 PM, అక్టోబర్ 05 2023
బెయిల్ ఇవ్వొద్దు, కస్టడీకి అప్పగించండి : CID లాయర్ పొన్నవోలు
► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి
► స్కిల్ స్కామ్ కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే
► కస్టడీకి ఇస్తే కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుంది
► బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన అదనపు అడ్వకేట్ జనరల్
12:10 PM, అక్టోబర్ 05 2023
ఇవ్వాళ ACB కోర్టు ముందుకు చంద్రబాబు
► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్‌పై నేడు కోర్టు నిర్ణయం
► ఇవాళ ACB కోర్టు ముందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు హాజరు
► ఈ సాయంత్రానికి రాజమండ్రికి నారా లోకేష్
► రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్
► చంద్రబాబు అరెస్ట్ తర్వాత 21 రోజులుగా ఢిల్లీలోనే నారా లోకేష్
12:04 PM, అక్టోబర్ 05 2023
ACB కోర్టులో CID తరపున పొన్నవోలు వాదనలు
► స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయి
► చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారు
► రూ.27 కోట్లు నేరుగా టిడిపి ఖాతాలో జమ అయ్యాయి
► ఆర్టికల్ 14 ని ప్రస్తావించిన పొన్నవోలు
► న్యాయం ముందు అందరూ సమానమే.... ముఖ్యమంత్రైనా...సామాన్యుడికైనా న్యాయమొక్కటే
► ముఖ్యమంత్రి హోదాను అడ్డుకుని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా?
► ఇది మామూలు కేసు కాదు...తీవ్ర ఆర్ధిక నేరం కలిగిన కేసు
► చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారు
11:43 AM, అక్టోబర్ 05 2023
జైల్లో చంద్రబాబు, క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల కుస్తీలు
► కృష్ణా జిల్లా : పెనమలూరు టీడీపీలో టిక్కెట్ చిచ్చు
► ఇటీవల కాలంలో పెనమలూరు నియోజకవర్గంలో యాక్టివ్‌గా తిరుగుతున్న దేవినేని గౌతమ్
► జనసేన మద్ధతుతో పెనమలూరు టిడిపి టిక్కెట్ దేవినేని గౌతమ్‌కు ఇస్తారని ప్రచారం
► పార్టీలో పరిస్థితుల పై నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్ అసహనం
► దేవినేని గౌతమ్‌కు టిడిపి టికెట్ ఇస్తే.. పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా : బోడే
► క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని పార్టీ క్యాడర్ అంగీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా
11:43 AM, అక్టోబర్ 05 2023
ఎల్లో మీడియా తప్పుడు కథనాలపై కోర్టుకు ఫిర్యాదు
► విజయవాడ : ACB కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు
► ఎల్లో మీడియా తప్పుడు కథనాలను కోర్టు ముందు ప్రస్తావించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి
► ACB జడ్జి తనపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ తప్పుడు కథనాలు రాశారని తెలిపిన పొన్నవోలు
► తప్పుడు కవరేజీపై కోర్టు ఆగ్రహం
► విచారణ జరుగుతున్న హాలులో న్యాయవాదులు కాకుండా ఇంకెవరూ వుండకూడదని న్యాయమూర్తి ఆదేశం
11:40 AM, అక్టోబర్ 05 2023
TDP, జనసేన అట్టర్‌ఫ్లాప్: జోగి రమేష్
► తాడేపల్లి : టీడీపీ, జనసేన కలయిక వైరస్ కంటే ప్రమాదకరం
► టీడీపీ, జనసేన కలిసిన తర్వాత పెట్టిన మీటింగ్ ప్లాప్ అయింది
► పవన్ మీటింగ్ అట్టర్ ప్లాప్ షోలా మారిపోయింది
► పవన్ తాట తీస్తానని చెప్పి రెండు చోట్లా ఓడిపోయాడు
► ఎలాంటి విలువలు, విశ్వసనీయత లేని మనిషి పవన్
► రంగాను చంపించిన వారికి అమ్ముడుపోతావా పవన్?
► కాపుల కోసం పోరాడిన ముద్రగడను చంద్రబాబు వేధించారు
► పవన్ మీటింగ్ పెడితే కనీసం రెండు వేల మంది రాలేదు
► చేసిన తప్పుకు చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు
టీడీపీ, జనసేన పార్టీల కలయిక వైరస్ లాంటిది కాబట్టే.. రెండు పార్టీలు కలిసి మీటింగ్ పెట్టుకున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పెడన సభ అట్టర్ ఫ్లాప్ అయింది.
— YSR Congress Party (@YSRCParty) October 5, 2023
- మంత్రి జోగి రమేష్
#PackageStarPK#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/FwjhTPedU2
11:35 AM, అక్టోబర్ 05 2023
NDA నుంచి ఎందుకు బయటకు వచ్చానంటే : పవన్ కళ్యాణ్
► నాకు చాలా ఇబ్బందులున్నాయి
► NDAలో భాగస్వామి ఉండి కూడా.. నేను బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి మద్ధతు తెలిపాను
► వంద శాతం నా మద్ధతు ఎందుకు ప్రకటించానంటే..
► ఎందుకంటే తెలుగుదేశం చాలా బలహీన పరిస్థితుల్లో ఉంది కాబట్టి
► తెలుగుదేశం నాయకులు చాలా బలహీనంగా ఉన్నారు
► మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జనసేన పోరాట పటిమ టిడిపికి అవసరం కాబట్టి మద్ధతిచ్చాను
#PawanaKalyan #TDP #JanaSenaParty pic.twitter.com/DAH2BJIgjd
— Vattikoti Vishnu (@Vattikoti1989) October 5, 2023
11:30 AM, అక్టోబర్ 05 2023
NDAకు పవన్ కళ్యాణ్ రాం రాం.!
► తెలుగుదేశం కోసం పవన్‌కళ్యాణ్ NDAకు గుడ్‌బై
► ప్రకటించిన జాతీయ న్యూస్ ఏజెన్సీ ANI
Actor, Politician Pawan Kalyan exits NDA to support Chandrababu Naidu
— ANI Digital (@ani_digital) October 5, 2023
Read @ANI Story | https://t.co/K8qOh21K9Y#PawanKalyan #NDA #ChandrababuNaidu pic.twitter.com/Ojlq1ylmg1
11:20AM, అక్టోబర్ 05 2023
ACB కోర్టులో రిమాండ్ మెమో
► విజయవాడ : చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని కోరుతూ మెమో దాఖలు చేసిన CID
► 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించాలంటూ మెమో దాఖలు చేసిన సీఐడీ
11:00AM, అక్టోబర్ 05 2023
ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ
►ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
►ఏపీ హైకోర్టులో ప్రారంభమైన విచారణ
►చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ సిద్ధార్థ అగర్వాల్, లూథ్రా
10:40AM, అక్టోబర్ 05 2023
బాబు స్కీంలు ఇవ్వలేదు.. స్కాంలు చేశారు
►చంద్రబాబు స్కీం లు ఇవ్వలేదు, స్కాంలకు పాల్పడ్డారు
►తాను కట్టిన జైల్లో చంద్రబాబు శిక్ష అనుభవిస్తున్నారు
►మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారును ఉరి తీయాలి
►మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే నాలుక చీరేస్తాం
►పవన్ కల్యాణ్ కొట్టే.. సినిమా డైలాగ్ లకు వైఎస్సార్సీపీ భయపడదు
:::వంగపండు ఉష, రాష్ట్ర సంస్కృతిక విభాగం అధ్యక్షురాలు
10:24AM, అక్టోబర్ 05 2023
కోర్డుకి చేరుకున్న ఏఏజీ సుధాకర్ రెడ్డి
►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
►సీఐడీ తరపున నిన్న బలమైన వాదనలు వినిపించిన ఏఏజీ
►స్కిల్ కుంభకోణం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది
►స్కిల్ స్కామ్ ఫిక్షన్ కాదు.. ప్రభుత్వ నిధులు కొల్లగొట్టిన అవినీతి వ్యవహారం
►బాబు చేసిన 13 సంతకాలతో సహా బలమైన ఆధారాలున్నాయి
►చెప్పినట్లు చేయాలని అధికారులను బెదిరించారు
►బాబు ఆదేశాలతోనే.. మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారయ్యారు
►బెయిల్‌పై బయటకొస్తే మిగిలిన సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితంచేయొచ్చని వాదనలు
►మరికాసేపట్లో చంద్రబాబు పిటిషన్‌పై ప్రారంభం కానున్న వాదనలు
09:56AM, అక్టోబర్ 05 2023
ముందస్తుపై కాసేపట్లో వాదనలు
►ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
►మరికాసేపట్లో వాదనలు ప్రారంభం
►ఫైబర్ నెట్ కుంభకోణంలో కేసులో నిందితుడిగా చంద్రబాబు
►ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు
09:22AM, అక్టోబర్ 05 2023
చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ఉంటుందా?
►స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ అయిన నారా చంద్రబాబు నాయుడు
►26 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ 7691గా బాబు
►సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్
►రెండుసార్లు పొడిగించిన ఏసీబీ కోర్టు
►రిమాండ్‌లో, సీఐడీ కస్టడీ ఇంటరాగేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు పడలేదని స్వయంగా జడ్జికి చెప్పిన చంద్రబాబు
09:00AM, అక్టోబర్ 05 2023
పరిటాల సునీతపై కేసు నమోదు
►టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటా సునీతపై కేసు నమోదు
►శ్రీసత్యసాయి కనగానపల్లి లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహణ
►సునీతతో పాటు తనయుడు శ్రీరామ్ సహా 119 మందిపై కేసు
08:29AM, అక్టోబర్ 05 2023
నేడు రాజమండ్రికి లోకేష్?
►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు
►ఇవాల్టితో పూర్తి కానున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్
► బ్లూ జీన్ యాప్ ద్వారా ఏసీబీ జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్న అధికారులు
►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ జరుగనున్న విచారణ
►నేడు రాజమండ్రి రానున్న నారా లోకేష్?
►రేపు చంద్రబాబుతో ములాఖత్ కానున్న లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి
08:08AM, అక్టోబర్ 05 2023
బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
►ఫైబర్ నెట్ స్కామ్ కేసులో నిందితుడిగా చంద్రబాబు నాయుడు
►ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన బాబు లాయర్లు
►నేడు విచారణకు వచ్చే అవకాశం
07:53AM, అక్టోబర్ 05 2023
తాడు లేని బొంగరంగా.. టీడీపీ
►అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమల
►యనమలే పార్టీకి దిక్కంటూ వార్తలు
►టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది.
►తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే.. కొడుకు పలాయనం చిత్తగించాడు.
►టీడీపీ క్యాడర్ అడ్రస్సే లేదు
::: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
అసలు ఎమ్మెల్యేగా కూడా గెలవలేని యనమలే దిక్కంటూ వస్తున్న వార్తలు చూస్తుంటే టీడీపీ తాడు బొంగరంలేని పార్టీ అని అర్థమౌతుంది. తండ్రి స్కాం చేసి జైలుకెళ్తే, కొడుకు పలాయనం చిత్తగించాడు. క్యాడర్ అడ్రస్సే లేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 4, 2023
07:48AM, అక్టోబర్ 05 2023
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టిందట!
►మహానేత వైఎస్సార్‌పై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్
►వైఎస్సార్ మేరు పర్వతం.. పవన్ కంకర కుప్ప
►ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేది పవన్.. ప్రజలకోసం జీవించిన వ్యక్తి వైఎస్సార్
►2009 నాటికి నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు..కానీ జగన్ అప్పటికే కడప ఎంపీ
►నువ్వు అంత గొప్పోడివి అయితే ప్రజలు ఓడించరు కదా!.
►సొల్లు కబుర్లు మానేసి నాలుగు ఓట్ల కోసం ట్రై చేయు
నువ్వెంత? నీ స్థాయి ఎంత? మేరు పర్వతం ముందు కంకర కుప్పంత!
— YSR Congress Party (@YSRCParty) October 4, 2023
వైయస్సార్ తో నీకు పోలికా? ప్యాకేజీ తీసుకుని గంపగుత్తగా ఓట్లను తాకట్టు పెట్టేసిన నీకు ప్రజలకోసం జీవించిన మహానేతతో పోలిక దేనికీ @Pawankalyan? డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టకూడదు. నువ్వు చెప్పిన 2009 నాటికి… pic.twitter.com/pmEetPK8K1
07:26AM, అక్టోబర్ 05 2023
రాజమండ్రిలో పోలీసుల అలర్ట్
►ఛలో రాజమండ్రి పేరిట టీడీపీ, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ పిలుపు
►ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు పర్మిషన్ లేదని నిన్ననే స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ జగదీష్
►శాంతి భద్రతలకు భంగం వాటిల్లే చర్యలను ఉపేక్షించమని హెచ్చరిక
►144 సెక్షన్‌తో పాటు పోలీస్ సెక్షన్ 30 అమలు
►రాజమండ్రిలో పలు చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు
07:18AM, అక్టోబర్ 05 2023
సూత్రధారి చంద్రబాబే: ఏఏజీ సుధాకర్‌రెడ్డి
►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై నేడు కూడా కొనసాగనున్న విచారణ
►నేడు ఉదయం 11.15 గంటలకి ప్రారంభం కానున్న వాదనలు
►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకి సంబంధం లేదని వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే
►చంద్రబాబుకి కనీసం కండిషనల్ బెయిల్ అయినా ఇవ్వాలని కోరిన దూబే
►స్కిల్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు
►చంద్రబాబు బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయాలని కోరిన పొన్నవోలు
►చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారని ప్రస్తావన
►తీవ్రమైన ఆర్ధిక నేరాలలో బెయిల్ ఇవ్వకూడదన్న సుప్రీం తీర్పుని ఉదహరించిన పొన్నవోలు
►చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో సహకరించలేదని వివరణ
►చంద్రబాబుని మరో అయిదు రోజుల కస్ఢడీకి ఇవ్వాలని కోరిన పొన్నవోలు
►పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకి పారిపోవడం వెనక చంద్రబాబు హస్తముందన్న పొన్నవోలు
►ఇరువర్గాల వాదనలు పూర్తికాకపోవడంతో విచారణ నేటికి వాయిదా
►చంద్రబాబు బెయిల్, కస్టడీ విచారణల తర్వాత ఇన్నర్ రింగ్చరోడ్, ఫైబర్ నెట్ పిటి వారెంట్లపైనా విచారణ జరిగే అవకాశం
06:58AM, అక్టోబర్ 05 2023
చంద్రబాబు పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ
►చంద్రబాబు బెయిల్, కస్టడీ, పీటీ వారెంట్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ
►నిన్న సుదీర్ఘంగా సాగిన ఇరువైపుల వాదనలు
►నేటికి విచారణ వాయిదా వేసిన కోర్టు
06:52AM, అక్టోబర్ 05 2023
రిమాండ్ పొడిగింపుపై నేడు ఆదేశాలు
►నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్
►పొడిగింపుపై ఆదేశాలు ఇవ్వనున్న విజయవాడ ఏసీబీ న్యాయస్థానం
►వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం
►ఇంతకు ముందు రెండుసార్లు రిమాండ్ ముగిసినప్పుడు వర్చువల్‌గానే ప్రవేశపెట్టిన వైనం
►రిమాండ్ పొడిగింపు కోరుతూ.. మెమో దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు
06:40AM, అక్టోబర్ 05 2023
జైల్లో భద్రంగా చంద్రబాబు
►జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ చంద్రబాబు
►స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక వసతులు
►ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు
►కోర్టు అనుమతితో.. ఇంటి భోజనానికి అనుమతి
►కుటుంబ సభ్యులతో ములాఖత్‌లు
06:30AM, అక్టోబర్ 05 2023
రాజమండ్రి జైల్లో చంద్రబాబు @26
►స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►ఏపీ సీఐడీ అరెస్ట్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం
►26వ రోజుకి చేరిన చంద్రబాబు రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment