సాక్షి, కృష్ణా: చంద్రబాబు విచారణకు తాత్కాలిక బ్రేక్. చంద్రబాబు విశ్రాంతి తీసుకోవాలన్న అధికారులు. చంద్రబాబు అరెస్ట్ నేపద్యంలో కీలకంగా మారిన రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న లాయర్లు. జడ్జి నివాసం వద్ద ఉద్రిక్తత. జడ్జి ఇంటి వద్ద హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది. అంతకు ముందు ఆయన్ని సీఐడీ ఆఫీసుకు తరలించారు.. స్కిల్ స్కాంలో అవకతవకలపై సీఐడీ.. చంద్రబాబును ప్రశ్నిస్తోంది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ప్రధాన కుట్రదారుడైన చంద్రబాబుని శనివారం వేకువ ఝామునే నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కోర్టులో ప్రవేశపెట్టనున్న తరుణంలో.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా విజయవాడ సివిల్ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించారు. ఇప్పటికే కోర్టు బయట ఆందోళన చేస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబుని విజయవాడ కోర్టు 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ న్యాయమూర్తి ముందు చంద్రబాబు తరపున ఇప్పటికే ఆయన కేసులు చూస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తారని సమాచారం. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ(గన్నవరం) చేరుకున్నారు. ఏపీ సీఐడీ, సిట్ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించనున్నారు.
ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ప్రధాన సూత్రధారి అయిన చంద్రబాబును తమ రిమాండ్‌కు ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment