విశాఖ భూ రికార్డుల ట్యాంపరింగ్ కేసులో సిట్ కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది.
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ గణేష్ అరెస్టు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ భూ రికార్డుల ట్యాంపరింగ్ కేసులో సిట్ కీలక నిందితుడిని అరెస్ట్ చేసింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో విజయనగరం జిల్లాలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న జి.ఎల్.గణేశ్వరరావు (గణేష్)ను ఆరిలోవ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ నిందితునితో పాటు అతని వద్ద స్వాధీనం చేసుకున్న విలువైన రికార్డులను, ఫోర్జరీ డాక్యుమెంట్లను మీడియా ముందు ప్రదర్శించారు.
ట్యాంపరింగ్‌లో గణేష్ కోసం గాలిస్తూనే అతని కారు డ్రైవర్ శ్రీనివాసరావును అగనంపూడి వద్ద తనిఖీ చేయగా ఆయన ఇంట్లో ప్రభుత్వ రికార్డులు, డాక్యుమెంట్లు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గణేష్‌ను ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రవేశపెడుతున్నట్టు సీపీ తెలిపారు.