Live Updates..
7:00 PM, సెప్టెంబర్ 21, 2023
ఇమేజ్ బిల్డప్ కోసం అఖిలప్రియ అష్టకష్టాలు
► నంద్యాలలో దీక్ష పేరుతో మీడియాను ఆకర్షించేందుకు అఖిలప్రియ కష్టాలు
► ఇప్పటికే అఖిలప్రియపై బోలెడు కేసులు
► నడి రోడ్డుపై దౌర్జన్యం, పలువురిపై దాడి కేసుల్లో ఉన్న అఖిలప్రియ
► సుబ్బారెడ్డి కుటుంబంతో పలు వివాదాలు
► వేర్వేరు కేసుల్లో పలుమార్లు అరెస్టయిన అఖిలప్రియ
► ఇప్పుడు ఇమేజ్ బిల్డప్ కోసం నిరాహార దీక్ష
► చంద్రబాబును అరెస్ట్ అయిన RK ఫంక్షన్ హాల్ ఎదుటే అఖిలప్రియ దీక్ష
► నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి జనాల్ని తరలించేందుకు ప్రయత్నాలు
7:00 PM, సెప్టెంబర్ 21, 2023
విజయవాడలో తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం
► చంద్రబాబు అరెస్ట్‌పై రేపటి సభలోనూ పట్టుపట్టాలని టీడీఎల్పీ నిర్ణయం
► స్పీకర్ తమ్మినేనిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయం
► రేపు సభలో తగ్గేదే లేదన్న బాలకృష్ణ
► స్కిల్ అంశం పై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్దం కావాలని నిర్ణయం
► ఎల్లో మీడియాలోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట తమ వర్షన్ చెప్పుకోవాలని ఎమ్మెల్యేల నిర్ణయం
6:00 PM, సెప్టెంబర్ 21, 2023
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో కస్టడీకి ఇవ్వండి
► విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని పిటిషన్
► ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CID
► ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్‌లో కోరిన CID
► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు
5:50 PM, సెప్టెంబర్ 21, 2023
దోమల ప్రచారం వెనక అసలు వాస్తవాలు ఇవి
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమల వ్యవహారంపై స్పష్టత ఇచ్చిన అధికారులు
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతి చెందడాని టిడిపి చేస్తోన్న ప్రచారం తప్పు
► రిమాండ్ ఖైదీ సత్యనారాయణ ఈ నెల ఆరో తేదీన జైలుకు వచ్చారు
► వచ్చిన రోజే జరిగిన స్క్రీనింగ్ టెస్టులో ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది
► వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి నిందితుడిని తరలించాము
► ఈ నెల 19న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
► ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు
► జైల్లో కుట్టిన దోమల వల్ల సత్యనారాయణకు డెంగ్యూ వచ్చి చనిపోయాడన్న వాదన సరికాదు
► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికి ఫాగింగ్ పూర్తి, ప్రతీ రోజూ కొనసాగింపు
► చంద్రబాబు ఒక్కరే కాదు, జైల్లో ఉన్న ఖైదీల అందరి ఆరోగ్య భద్రత చూడడమే తమ లక్ష్యం అంటున్న జైలు అధికారులు
5:25 PM, సెప్టెంబర్ 21, 2023
కస్టడీ పిటిషన్‌పై ఇదీ క్లారిటీ.!
► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌కు కస్టడీ పిటిషన్‌కు సంబంధం ఉంది
► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి
► రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా
► రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తానన్న న్యాయమూర్తి
5:05 PM, సెప్టెంబర్ 21, 2023
కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా
► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి
► హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి
► హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌లో ఉందని చెప్పిన లాయర్లు
► హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు
► కస్టడీ పిటిషన్‌పై రేపటి వరకు వేచి చూద్దామని చెప్పిన న్యాయమూర్తి
► రేపటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం
5:00 PM, సెప్టెంబర్ 21, 2023
అందరి చూపు ACB కోర్టు నిర్ణయంపై
► విజయవాడ : ACB కోర్టు వెలువరించబోయే కస్టడీ నిర్ణయంపై ఉత్కంఠ
► బెంచ్ మీదకు వచ్చిన జడ్జి
► కాసేపట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించే అవకాశం
4:45 PM, సెప్టెంబర్ 21, 2023
పక్కా ఆధారాలతోనే బాబు అరెస్ట్ : CID చీఫ్
► స్కిల్ స్కాంలో పక్కా ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్
► ప్రతి పేపర్ పై చంద్రబాబు సంతకం ఉంది
► షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారు
► చంద్రబాబుకు పీఏగా పని చేసిన శ్రీనివాస్ ద్వారా డబ్బులు మళ్లించారు
► స్కిల్ స్కాంలో చంద్రబాబుకు పాత్ర ఉందని ఆధారాలు చెబుతున్నాయి
► పీఏ శ్రీనివాస్‌ను విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయి
► శ్రీనివాస్‌కు నోటీసులు ఇవ్వగానే అమెరికాకు పారిపోయాడు
► అప్పుడు సీఎంగా ఉన్నారు కనుకే ఐపీసీ 409 చంద్రబాబుకు వర్తిస్తుంది
► స్కిల్ స్కాంలో ఆధారాలు దొరికితే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం
► సీమెన్స్ సంస్థలో గతంలో పని చేసిన వాళ్ల పాత్ర కూడా ఉంది
► సీమెన్స్ లో ఇప్పుడున్న వాళ్లు స్కాంతో తమకు సంబంధం లేదంటున్నారు
► చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంది
4:30 PM, సెప్టెంబర్ 21, 2023
CID లాయర్లు ఏం వాదించారు?
► కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుంది : CID
► చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు
► కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు
► ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం
► చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి
► చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు
► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉంది
► కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు, నిజం బయటకు వస్తుంది
► 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదు
► స్కిల్ స్కాంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి
► కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు
4:30 PM, సెప్టెంబర్ 21, 2023
బాబు లాయర్లు ఏం వాదించారు?
► FIRలో పేరు లేదు, కస్టడీ వద్దు
► చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు
► FIRలో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారు
► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు
► అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది
► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు
► ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు
► ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు
► విచారణలో కొత్త కోణం ACB కోర్టు ముందు ఉంచలేక పోయారు
4:00 PM, సెప్టెంబర్ 21, 2023
ACB కోర్టుకు ఇరుపక్షాల లాయర్లు
► విజయవాడ : ACB కోర్టుకు చేరుకున్న లాయర్లు
► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు
► కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు, చంద్రబాబు లాయర్లు
4:00 PM, సెప్టెంబర్ 21, 2023
ACB కోర్టు ఉత్తర్వులపై అందరి దృష్టి
► విజయవాడ : ACB కోర్టులో కస్టడీ పిటిషన్‌పై నిన్ననే పూర్తయిన వాదనలు
► ఇవ్వాళ మరోసారి బెంచ్ ముందుకు రానున్న కస్టడీ పిటిషన్
► ఇవ్వాళ కస్టడీ ఇస్తారా? ఇస్తే ఎన్ని రోజులు అన్న విషయం న్యాయమూర్తి ప్రకటించే అవకాశం
► మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టు బెంచ్ ముందుకు కస్టడీ పిటిషన్ అంశం వచ్చే అవకాశం
3:20 PM, సెప్టెంబర్ 21, 2023
ఎర్రన్నాయుడు కూతురు ఎందుకు కనిపించడం లేదు?
► రాజమండ్రిలో 11 రోజులుగా జైల్లో ఉన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు
► పార్టీలో ఉన్న లీడర్లంతా ఇప్పటివరకు రాజమండ్రిలో హాజరు వేసుకున్నవాళ్లే
► రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.!
► పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అన్న కూతురు, లోకల్ ఎమ్మెల్యే ఎందుకు కనిపించడం లేదు?
► ఆదిరెడ్డి కుటుంబం దగ్గరుండి భవానిని దూరం పెట్టిందా?
► లేక చంద్రబాబు అసలు రంగు తెలిసి భవాని దూరంగా ఉంటోందా?
► చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ భువనేశ్వరి, బ్రాహ్మణి నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొనే అవకాశం లేదా?
3:20 PM, సెప్టెంబర్ 21, 2023
భద్రతపై తప్పుడు ఆరోపణలు సరికాదు : విజయసాయిరెడ్డి
► చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నేతల ఆరోపణలు సరికాదు
► లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు
► దోమలతో స్లో పాయిజన్ అంటూ ఎల్లో మీడియా చేస్తోంది విషప్రచారం
► అసలు తెలుగుదేశం నేతలే ఏదో చేస్తారా అన్న అనుమానాలున్నాయి
మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023
3:00 PM, సెప్టెంబర్ 21, 2023
ఇదేం పార్టీ? ఇదేం ప్రవర్తన? టిడిపి నేతల తీరుపై YSRCP మండిపాటు
► చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు
► అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు ఏ మాత్రం సరికాదు
► యువగళం పాదయాత్రలో లోకేష్ సాంతం బూతులు మాట్లాడారు
► ప్రజలను రెచ్చగొట్టడమే మామా అల్లుళ్ల పనా?
నాయకుడు అనేవాడు.. అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ.. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌కి ఆ లక్షణాలు మచ్చుకకి కూడా లేవు. ఒకరేమో అసెంబ్లీ వేదికగా, మరొకరేమో బహిరంగ వేదికపై అసభ్యంగా సైగలు చేస్తారు. కనీసం మహిళలు ఉన్నారనే ఇంగితం కూడా ఇద్దరికీ లేకపోయింది. #TDPGoonsInAssembly#APAssembly… pic.twitter.com/zBtLktpM7S
— YSR Congress Party (@YSRCParty) September 21, 2023
2:30 PM, సెప్టెంబర్ 21, 2023
దోమల పేరు చెప్పి భయపెడతారా?
► చంద్రబాబుపై సానుభూతి కోసం దోమల పేరు చెప్పడం సరికాదు : బాపట్ల ఎంపీ సురేష్
► ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు, దోమలకు భయపడతారా ?
► చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్ , టిడిపి నేతల నుంచే ఉంది
► చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్‌కు అబ్బినట్టుంది
► చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉంది
► చంద్రబాబు పై ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారి ఫోన్లను కోర్టు తనిఖీ చేయాలి
► వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు?
► దోమల పేరుతో ఎలాంటి సానుభూతి రాదు, నవ్వులపాలవుతారు
1:30 PM, సెప్టెంబర్ 21, 2023
బాబు భద్రతపై ఆందోళన అవసరం లేదు: జైళ్ల శాఖ
► రాజమండ్రి : చంద్రబాబు భద్రత గురించి టిడిపి అభ్యంతరాలను ఖండించిన జైళ్ల శాఖ డీఐజీ
► సెంట్రల్ జైలులో 2,063 మంది ఖైదీలు ఉన్నారు
► జైలు లోపల జాగ్రత్తలు తీసుకుంటున్నాం
► కోర్టు సూచించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం
► ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
1:00 PM, సెప్టెంబర్ 21, 2023
భారతీయుల నిరసనతో హోరెత్తుతోన్న కెనడా
► కెనడాలో గత కొద్ది రోజులుగా సిక్కుల నిరసనలు
► సిక్కుల నిరసనకు తోడుగా తెలుగుదేశం నిరసనలు
► ఇప్పటికే వరుస నిరసనలపై కెనడా ప్రభుత్వం సీరియస్
► టోరంటోలో తెలుగుదేశం నిర్వహించిన ఆందోళనలపై సీరియస్
► భారత్‌కు సంబంధించిన అంశాలను సున్నితంగా చూస్తోన్న కెనడా
► ఇప్పటికే రెండు దేశాల మధ్య దెబ్బ తిన్న సంబంధాలు
► ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పేరు చెప్పి కెనడాలో ఆందోళనలు చేయడం సరికాదంటున్న అక్కడి అధికారులు
► కెనడాలో సిక్కులకు పోటీగా టిడిపి నాయకులు చేస్తోన్న ఆందోళనలపై భారత ప్రభుత్వం సీరియస్
► మన దేశానికి సంబంధించిన అంతర్గత అంశం, అది కూడా అవినీతి కేసుకు సంబంధించి అంతర్జాతీయంగా ఆందోళనలు చేపట్టడం సరికాదంటున్న కేంద్రం
► తెలుగు రాని విదేశీయులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేస్తోన్న టిడిపి
► అనుమతి లేకుండా ఆందోళనలకు దిగే వారి వివరాలు సేకరిస్తోన్న భారత ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం
That’s Toronto canada 🇨🇦 for Babu garu #IAmWithBabu
— Bring it On🔥TDP Voice - Siva (@TDPVoice2024) September 18, 2023
#IAmWithCBN 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/LHJ3KkCHKt
12:40 PM, సెప్టెంబర్ 21, 2023
చంద్రబాబుకు జైల్లో అన్ని సౌకర్యాలున్నాయి : వైఎస్సార్‌సిపి
► జైల్లో చంద్రబాబుకు నిర్దేశిత నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలున్నాయి
► ఇంటి భోజనంకు అనుమతిస్తున్నారు, వేడి నీళ్లు కూడా ఇస్తున్నారు
► కోర్టు కల్పించిన అన్ని సౌకర్యాలు ఉన్నా.. టిడిపి బురద జల్లుతోంది
► భద్రత లేదంటూ లోకేష్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు
వైఎస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023
12:35 PM, సెప్టెంబర్ 21, 2023
చంద్రబాబు అరెస్ట్‌పై అసెంబ్లీలో రాద్ధాంతమా? : వైఎస్సార్‌సిపి
► జైల్లో చంద్రబాబు ఉంటే.. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు అల్లరి చేస్తున్నారు
► సభలో స్పీకర్ పోడియం చుట్టు ముట్టి సమావేశాలు అడ్డుకున్నారు
► మీసాలు తిప్పుతూ బాలకృష్ణ రెచ్చగొట్టేలా ప్రవర్తించారు
.@ncbn అరెస్టుకు నిరసనగా అసెంబ్లీలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన @JaiTDP ఎమ్మెల్యేలు. మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తించిన బాలకృష్ణ. వీరి నాయకుడు అవినీతి చేసి అరెస్టు అయితే దానిపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో నిరసన తెలుపుతూ విలువైన అసెంబ్లీ… pic.twitter.com/lQuzKDG4BV
— YSR Congress Party (@YSRCParty) September 21, 2023
12:30 PM, సెప్టెంబర్ 21, 2023
చంద్రబాబుకు జైల్లో ఏసీ లేక ఇబ్బందులు వస్తున్నాయి : అచ్చెన్నాయుడు
► జైల్లో చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు లేవు
► ఏసీ లేకపోవడం వల్ల చంద్రబాబుకు ఇబ్బంది అవుతోంది
► దోమలు కూడా కుడుతున్నాయని చంద్రబాబు చెప్పారు
► ఇటీవలే డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయని వార్తలు వచ్చాయి
► చంద్రబాబు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారని చెబుతున్నారు
► చంద్రబాబుకు వేడి నీళ్లు స్నానానికి ఇవ్వాలని కోరుతున్నాం
► కోర్టులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి
12:25 PM, సెప్టెంబర్ 21, 2023
చంద్రబాబు రిమాండ్‌పై చర్చించడానికి రెడీ
► చంద్రబాబు రిమాండ్‌పై చర్చించాలని టిడిపి పట్టు
► Yes, చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేసిన ప్రభుత్వం
► ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా?
► తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నించిన మంత్రి బుగ్గన
చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ.. చట్టపరంగా ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయినప్పటికీ అసెంబ్లీలో చర్చకి డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి అడిగే ప్రశ్నలకి టీడీపీ ఎమ్మెల్యేల వద్ద సమాధానం ఉందా?
— YSR Congress Party (@YSRCParty) September 21, 2023
- మంత్రి బుగ్గన… pic.twitter.com/5qpL4L1Nmq
12:20 PM, సెప్టెంబర్ 21, 2023
చంద్రబాబు రిమాండ్‌పై అసెంబ్లీలో బాలకృష్ణ ప్రెస్ మీట్
► లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ కావడం వల్లే చంద్రబాబును అరెస్ట్ చేశారు
► ఈ కేసులో ఏమీ తేలదు, ఇలాంటి కేసులు చాలా చూశాను
► చంద్రబాబు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారు
► తననెవరు ఏమి చేయలేరని నాకు చెప్పారు
► అమరావతి ఉద్యమంలో అంతా జూనియర్ అర్టిస్టులను విమర్శిస్తున్నారు
12:15 PM, సెప్టెంబర్ 21, 2023
బెయిల్ కోసం తెలుగుదేశం యాగం
► చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ విజయవాడలో యాగం
► టిడిపి నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
► చంద్రబాబు క్షేమంగా ఉండాలంటూ రుద్ర మహా మృత్యుంజయ యాగం
► రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాటు
12:10 PM, సెప్టెంబర్ 21, 2023
కస్టడీపై ఈ సాయంత్రం నిర్ణయం
► చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీ అడిగిన CID
► కస్టడీ వద్దంటూ నిన్న బాబు లాయర్ల వాదన
► ఒక్క రోజు కస్టడీ ఇస్తే సరిపోతుందంటూ కొన్ని కేసుల ఉదాహరణ
► ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వాలన్నదానిపై నేడు కోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం
► మరోవైపు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 26కు వాయిదా
12:00 PM, సెప్టెంబర్ 21, 2023
లోకేష్ కొత్త రాగం, చంద్రబాబుకు మరింత భద్రత కావాలని డిమాండ్
► చంద్రబాబుకు జైల్లో దోమలు కుడుతున్నాయి
► చంద్రబాబు జైల్లో ప్రాణ భయం ఉంది
► చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలి
► పూర్తి భద్రత ఉందని జైలు అధికారులు చెప్పినా బురద వేసే ప్రయత్నం
► దోమల పేరు చెప్పి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్న వైఎస్సార్‌సిపి
సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9
— Lokesh Nara (@naralokesh) September 21, 2023
11:45 AM, సెప్టెంబర్ 21, 2023
అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ సభ్యుల ఓవరాక్షన్
► శాసనసభ, మండలిలో టీడీపీ సభ్యుల రౌడీయిజం.
► స్పీకర్ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు.
► పోడియం వద్ద మీసం మెలేయడంపై బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్.
► ఒక్కరోజు సభ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్
► సమావేశాల నుంచి పూర్తిగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ సస్పెండ్.
11:40 AM, సెప్టెంబర్ 21, 2023
► రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా
► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బాబు పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా.
► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్డు సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం
11:20AM, సెప్టెంబర్ 21, 2023
►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 26కు వాయిదా
11:00AM, సెప్టెంబర్ 21, 2023
►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ
►ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి
►కాసేపట్లో తీర్పు వెలువరించే అవకాశం
►సీఐడీ తరుఫున వాదనలు వినిపించిన పొన్నవోలు
►చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లూద్రా, సిద్ధార్థ్ అగర్వాల్
8:40AM, సెప్టెంబర్ 21, 2023
►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న :3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..?
►సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు..
►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..?
►సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం..
►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..?
►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు
8:00 AM, సెప్టెంబర్ 21, 2023
రాజమండ్రి సెంట్రల్‌లో జైలులో 11వ రోజు చంద్రబాబు..
►యథావిధిగా చంద్రబాబు రోజు వారి కార్యక్రమాలు
►ఇంటి నుంచే వచ్చిన ఆహారం, మందులు.
►పటిష్టమైన భద్రత మధ్య స్నేహ బ్లాక్‌లో చంద్రబాబు
►రాజమండ్రి రూరల్ కాతేరులో కొనసాగుతున్న టీడీపీ క్యాంపు
►రాజమండ్రిలోనే ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణి
►రాజమండ్రి వస్తే లొకేష్‌ను అరెస్ట్ చేస్తారంటూ రచ్చ చేస్తున్న ఎల్లో మీడియా.
►ఇవాళ జరగనున్న అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు.
7:50 AM, సెప్టెంబర్ 21, 2023
ఎల్లో బ్యాచ్ కొత్త నాటకం.
►అసెంబ్లీకి హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు
►సభకే రాని బాబు కోసం ఎల్లో బ్యాచ్ కొత్త ప్లాన్
►అసెంబ్లీ వాయిదా వేయాలని మరో నాటకం.
7:00 AM, సెప్టెంబర్ 21, 2023
చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు వాదనలు
► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు
► కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు ఇచ్చే అవకాశం
6:00 AM, సెప్టెంబర్ 21, 2023
అంగళ్లు కేసుపై నేడు హైకోర్టులో విచారణ
► అంగళ్లు విధ్వంసం కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్
► నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు
► అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు
► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు
► వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలు
► టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు
► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment