ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాలకు ఈ నెల 15 వరకు జూడిషయల్ కస్టడీ విధించారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాలకు ఈ నెల 15 వరకు జ్యూడీషయల్ కస్టడీ విధించారు. మంగళవారం ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ కస్టడీకి అప్పగించారు.
కస్టడి ముగిశాక నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని ఆదేశించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే.