ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సోమవారం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆయన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియటంతో చర్లపల్లి జైలు నుంచి కోర్టుకు తరలించారు. ఉదయసింహా, సెబాస్టియన్ లను కూడా న్యాయస్థానంలో హాజరుపరిచారు.
మరోవైపు ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది.