
తాత్కాలిక బెయిల్ పై రేవంత్ విడుదల
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. గురువారం ఉదయం చర్లపల్లి జైలు నుంచి తాత్కాలిక బెయిల్ పై విడుదలయ్యారు. కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది.
గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని జడ్జి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్న ఆయనకు అభిమానులు పూలతో స్వాగతం పలికారు.