ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా సాగించిన బేరసారాల్లో ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి భాగస్వామ్యం బయటపడింది. ఎమ్మెల్యేలతో మాట్లాడడం దగ్గరి నుంచి కొనుగోళ్లకు సొమ్మును సమకూర్చేదాకా ఆయన కీలకపాత్ర పోషించినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఏపీ సీఎం చంద్రబాబుకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో కీలక వ్యక్తిగా పరిగణించే ఈ కేంద్ర మంత్రి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధం చేసింది. అంతేకాదు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ‘బాబుగారు మాట్లాడుతారు' అంటూ మాట్లాడించిందీ ఆ కేంద్ర మంత్రేనని గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆ కేంద్ర మంత్రి భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఆడియో, వీడియోలతో కేంద్ర హోంశాఖకు ఏసీబీ ఒక నివేదిక అందజేసినట్లు సమాచారం.
Published Sat, Jun 13 2015 7:50 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement