కరీంనగర్ : 'ఓటుకు నోటు' కేసును తెలంగాణ ప్రభుత్వం నీరుగారుస్తుందని తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు విషయంలో పెద్దలను వదిలి క్రింది స్థాయి వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే చంద్రబాబు, కేసీఆర్ మధ్య రాజీ కుదిరినట్లు ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి సీపీఐ అండగా ఉంటూ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.