
సాక్షి, కరీంనగర్: గ్యాంగ్‌స్టర్ నయీం డైరీని, అతని బాగోతాల్ని బయటపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ నయీం బాగోతంపై న్యాయవిచారణ జరిపించాలని కోరారు. నయీం కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న 25 మంది పోలీస్ ఆఫీసర్‌లకు, క్లీన్‌చీట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. దోషులను నిర్దోషులుగా ప్రకటించడం చట్టవిరుద్దమని తెలిపారు.
ఈ సందర్భంగా ఎల్‌ఆర్‌ఎస్ జీవోను, రేట్లను సవరించాలని కోరారు. ఆస్తుల క్రమబద్దీకరణకు ఇంటింటా సర్వేను సీపీఐ స్వాగతిస్తుందని తెలిపారు. ఆస్తుల క్రమబద్దీకరణతో దేవాలయ భూములను, వక్ఫ్ బోర్డు భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.
(ఆ పోరాటం స్ఫూర్తిగా సీపీఐ పోరాడుతుంది)