సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో గత 20 ఏళ్లలో ఎన్నడూలేనంత కరువు నెలకొందని, కరువు దుర్భిక్షంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి నివేదిక పంపించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని కరువుపై పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు గళం విప్పాలని కోరారు. ధరణి వెబ్ సైట్ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ధర్మగంట మ్రోగిస్తున్నారంటూ విమర్శించారు. భూ ప్రక్షాళన తప్పులతడకగా మారి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అవినీతి మయమైందన్నారు. నెరవేరని ప్రభుత్వ హామీలు ప్రజా సమస్యలపై ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment