కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలు మానుకుని రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి హితవు పలికారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీలు ఒక్కటి కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళితబంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులివ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 21న అన్ని తహసీల్దార్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment