
స్టీఫెన్ సన్(ఫైల్)
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దర్యాప్తు వేగంగా సాగుతోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగూల్మం శుక్రవారం సీల్డ్ కవర్ లో ప్రత్యేక కోర్టుకు చేరింది. వాంగూల్మం సర్టిఫైడ్ కాపీ కోసం ఏసీబీ అధికారులు, రేవంత్ రెడ్డి న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రత్యక్ష సాక్షులుగా స్టీఫెన్‌సన్ కుమార్తె జెస్సికా, బంధువు మార్క్‌టేలర్ వాంగ్మూలాలను బుధవారం ఏసీబీ నమోదు చేసింది.
టీడీపీ ముడుపుల వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న స్టీఫెన్ సన్ వాంగూల్మంలో ఏముందోనని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతల పేర్లతోపాటు కీలక సమాచారాన్ని ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో స్టీఫెన్ సన్ వెల్లడించినట్లు తెలుస్తోంది.